విజయ్‌చందర్ యేసుక్రీస్తుగా నటించి, నిర్మించిన చిత్రం ‘కరుణామయుడు’ (1978). భీమ్‌సింగ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిఅతం ఈ నెల 21వ తేదీకి 34 వసంతాలు పూర్తి చేసుకొని 35వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిత్రం తాలూకు మధురానుభూతులు, చిత్రీకరణ విశేషాలను ‘నేను నా కరుణామయుడు’ అనే పుస్తక రూపంలో విజయ్‌చందర్ రూపొందించారు. శుక్రవారం సాయంత్రం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పుస్తకావిష్కరణ జరిగింది. ‘నేను నా కరుణామయుడు’ పుస్తకాన్ని ఫాదర్ రేమండ్ ఆవిష్కరించి తొలి ప్రతిని సిస్టర్ లీనాకు అందజేశారు. అతిథులు విజయ్‌చందర్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్‌చందర్ మాట్లాడుతూ - ‘కరుణామయుడు’ విడుదలై నేటికి 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. సినిమా తాలూకు అన్ని విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచాం. 650 పేజీలుగల ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో చిత్రానికి సంబంధించిన ఫొటోలు, సినిమాతో నా అనుభవం, యేసుక్రీస్తు జీవిత చరిత్ర, తదితర అంశాలను ప్రస్తావించామ’ని తెలిపారు. పుస్తకావిష్కరణకు సినీ నిర్మాతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కె.సి.శేఖరబాబు, ప్రసన్నకుమార్, ఫాదర్ రేమాండ్ అంబ్రాసీ, నిర్మాత సజ్జల శ్రీనివాస్, ఏడిద గోపాలరావు, మాడా, రాజకీయ నాయకులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విజయ్‌చందర్ యేసుక్రీస్తుగా నటించి,
english title:
n
Date:
Sunday, December 23, 2012