
రామ్‌చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్, అమలాపాల్ నాయికలుగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘నాయక్’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. నటి ఛార్మి రామ్‌చరణ్ సరసన నర్తించిన ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘ఓయ్యారమంటే ఏలూరే...’ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తయింది. వినాయక్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధతో చిత్రీకరిస్తున్నారు. రామ్‌చరణ్ నటన, హీరోయిన్ల గ్లామర్, ఆకుల శివ కథ, మాటలు ఈ చిత్రానికి హైలైట్. థమన్ సంగీతంలో రూపుదిద్దుకున్న ఆడియో ఇప్పటికే విజయవంతమైంది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్, థియేటర్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’ని తెలిపారు. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎం.ఎస్. నారాయణ, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కథ, మాటలు: ఆకుల శివ, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి.దానయ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.