బలియా (ఉత్తరప్రదేశ్), డిసెంబర్ 23: ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై ఆసుపత్రిలో అచేతనంగా పడివున్న వైద్య విద్యార్థిని త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఆమె గ్రామస్తులు కనిపించిన ప్రతి దేవునికీ మొక్కుతున్నారు. ఈ అత్యాచార వార్త తెలిసిన నాటి నుంచి మెద్వారా కలాన్ గ్రామస్తులు బాధిత యువతి త్వరగా కోలుకుని మళ్లీ తమ మధ్యకు రావాలని వేడుకొంటూ స్థానిక దేవాలయాల్లో రేయింబవళ్లూ ప్రార్థనలు చేస్తున్నారని ఆ గ్రామ మాజీ పెద్ద ప్రశాంత్ యాదవ్ తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దోషులకు మరణ శిక్ష విధించాలని తమ గ్రామస్తులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని, వారిని ఉరితీసే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని యాదవ్ స్పష్టం చేశారు. ఆసుపత్రిలో జీవచ్ఛవంలా పడివున్న బాధితురాలిని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలసి తాను ఢిల్లీ వెళ్లినట్టు ఆ యువతి బంధువు ఒకరు తెలిపారు.
‘్ఢల్లీ’ బాధితురాలి గ్రామస్తుల ప్రార్థనలు
english title:
m
Date:
Monday, December 24, 2012