న్యూఢిల్లీ, డిసెంబర్ 25: సామూహిక అత్యాచారానికి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో యువతరం చేస్తున్న ఆందోళనల్లో దాడికి గురైన పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ చంద్ తోమర్ (47) మంగళవారం మృతి చెందాడు. ఇండియా గేట్ వద్ద ఆదివారం హింసాత్మకంగా మారిన ఆందోళనల్లో తోమర్ తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్వాసక్రియ, గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న తోమర్ మంగళవారం ఉదయం 6:30 సమయంలో చనిపోయాడని ఇక్కడి వైద్యులు వెల్లడించారు. అయితే సోమవారం రాత్రి తోమర్ ఆర్యోగ పరిస్థితి మరింత విషమించిందని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ టిఎస్ సిద్ధూ తెలపగా, పోస్టుమార్టమ్ నిర్వహణ తర్వాతే తోమర్ మృతికి స్పష్టమైన కారణాలను చెప్పగలమని అన్నారు. కాగా, తోమర్ మృతికి సంబంధించి ఆదివారం రాత్రి ఎనిమిది మందిని అరెస్టు చేశామని, అయితే వారంతా బెయిల్‌పై విడుదలయ్యారని జాయింట్ పోలీస్ కమిషనర్ తాజ్ హస్సన్ తెలిపారు. వారందరిపై మర్డర్ కేసు బుక్ చేస్తామన్నారు.
కఠిన చట్టాలు కావాల్సిందే
వెంకయ్య నాయుడు డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: మహిళలపై యదేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాల్లో దోషులను కఠినంగా శిక్షించటానికి, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించటానికి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం లేదా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవాలని మంగళవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో అన్నారు. తమ విజ్ఞప్తులకు సానుకూలంగా ప్రధాని స్పందించకపోవటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పార్లమెంట్ ఉభయసభలలో ఈ దారుణ సంఘటనపై జరిగిన చర్చ తీవ్రతను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని క్రిమినల్ చట్టం సవరణకు తక్షణమే పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పుండుపై కారం జల్లినట్లు మహిళలను తప్పుబట్టే తీరులో చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
88వ జన్మదినోత్సవం జరుపుకున్న వాజపేయి
ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బిజెపి సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి మంగళవారం తన 88వ పుట్టినరోజును జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నేతలతోపాటు ఇతర పార్టీల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాజపేయి నివాసానికి విచ్చేసిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం శుభాకాంక్షలతో కూడిన పుష్పగుచ్ఛాన్ని పంపించారు.
గాయపడిన కానిస్టేబుల్ మృతి
english title:
d
Date:
Wednesday, December 26, 2012