![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/4sadh82.jpg)
* ఏ నగరంలో జరుగుతున్న సాహిత్య ఉత్సవాలకు రావద్దని వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది?
-జైపూర్ , రాజస్థాన్ ప్రభుత్వం కోరింది. జైపూర్‌లోని సాహిత్య ఉత్సవాలకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడంతో రష్దీ ఉత్సవాలకు దూరంగా ఉండిపోయారు.
* ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు?
- మాంటెక్‌సింగ్ అహ్లువాలియా
* ఎస్‌పిహెచ్ 10066540 అనే తార చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాన్ని గుర్తించింది ఎవరు?
- ఈ కొత్త గ్రహాన్ని క్రిస్ హోమ్స్ , లీ థ్రియాపిల్‌టిన్‌లు కనుగొన్నారు. బ్రిటన్‌కు చెందిన ఈ ఇద్దరు ఔత్సాహిక ఖగోళశాస్తవ్రేత్తలు. చరిత్రలో ఔత్సాహికులు గ్రహాలను కనుగొనడం ఇది మూడోసారి. నాసాకు చెందిన కెప్లర్ టెలిస్కోప్ అందించిన చిత్రాలను పరిశీలించినపుడు అసాధారణ స్థాయిలో కాంతి హెచ్చుతగ్గులకు లోను కావడాన్ని వారు గమనించారు. దీని ప్రకారం గ్రహం ఉనికి కనుగొన్నారు. ఇది నెఫ్ట్యూన్ గ్రహం అంత పరిమాణంలో ఉంటుందని భావిస్తున్నారు. ఒక వేళ దీని ఉనికిని నిర్ధారిస్తే దీనికి థ్రియాపిల్‌టన్ హోమ్స్ బి అని పేరు పెడతారు.
* దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో విజయంసాధించింది ఎవరు?
- దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం ఖాయం అనుకున్న న్యూట్ గింగ్రాచ్ అనూహ్యంగా విజయం సాధించారు. విజయపథంలో దూసుకుపోతారని అనుకున్న ప్రత్యర్ధి మిట్‌రోష్నీని ఆయన చిత్తుగా ఓడించారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ అయిన గింగ్రిజ్ 40.4 శాతం ఓట్లను కైవశం చేసుకున్నాడు. రోష్నీ 27.9 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. 68 ఏళ్ల గింగ్రిచ్ విజయంతో నవంబర్ 6న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామాకు ప్రత్యర్ధి దొరికినట్టయింది.
* ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు?
-ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన వారిలో జస్టిస్ ఎన్ ఆర్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ పి దుర్గాప్రసాద్, జస్టిస్ కె జి శంకర్, జస్టిస్ ఎన్ రవిశంకర్, జస్టిస్ సూరి అప్పారావులు ఉన్నారు. జస్టిస్ సూరి అప్పారావు ప్రస్తుతం కర్నాటక హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.
* దేశంలో ఎక్కువ మంది అభిమానాన్ని చూరగొనడంతో పాటు విశ్వసనీయతకు మారు పేరుగా ది బ్రాండ్ ట్రస్టు గుర్తించిన పది మంది ఎవరు?
- అన్నాహజారే, సచిన్ టెండూల్కర్, సల్మాన్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, ధోని, బాబా రాందేవ్, ఎపిజె అబ్దుల్ కలాం, రతన్‌టాటా, విజయ్ మాల్యా ఉన్నారు.