Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆశాజనకంగా లేని అపరాల సాగు

$
0
0

గజపతినగరం, డిసెంబర్ 30 : ఈ ఏడాది రబీలో రైతులు సాగు చేస్తున్న అపరాలు సాగు రైతులకు అంతగా ఆశాజనకంగా లేని పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రబీలో రైతులు మినుము, పెసర పంటలకు వరినాట్లు వేసిన వెంటనే పల్లం భూముల్లో నేరుగా విత్తనాలను చల్లి సాగు చెయ్యడం అనవాయితీ, సాధారణంగా ఈ పంటను రైతులు నవంబర్ రెండో వారం నుండి ఫిబ్రవరి నెలాఖరు నాటికి పండించగా పంట కోతకు వచ్చే అవకాశం ఉండేది. ఈ ఏడాది ఖరీఫ్ వరిపంట ఆలస్యంగా నాట్లు వెయ్యడంతో నవంబర్ నెలాఖరు వరకు కోతలు కొయ్యని పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబర్ మొదటి వారం వరకు పంటలను సాగు చేసారు. దీంతో డిసెంబర్ నెల నుండి వర్షాలు పడే అవకాశంలో నందున కేవలం నవంబర్ నెలలో భూమిలో ఉండే తేమ, మంచు వలనే ఈ పంటను పండుతాయి. అయితే ఈ ఏడాది ఆలస్యంగా పంటలను సాగు చెయ్యడంతో ప్రస్తుతం పెసర, మినుము మొక్కలు, అంత ఆశాజనకంగా లేదని అంతంత మాత్రంగా ఎదుగుదల లేకుండా మొక్కలు ఉండటంతో రైతలు దిగుబడి భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అసలు పండుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని రైతలు అంటున్నారు.
‘అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి’
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 30: ఢిల్లీలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్ డిమాండ్ చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పట్టణంలో ప్రధాన రహదారుల్లో నోటికి నల్లగుడ్డ కట్టుకుని వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశరాజధానిలో జరిగిన అత్యాచార సంఘటన యావత్తు దేశానే్న కుదిపేసిందన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన పట్ల మారుమూల గ్రామాల్లో సైతం పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్త కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి.సతీష్, వెంకటేష్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

‘పుచ్చలపల్లి సుందరయ్య పీడిత జనుల పక్షపాతి’
విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 30: పుచ్చలపల్లి సుందరయ్య బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి కొనియాడారు. ఎస్.ఎఫ్.ఐ 21వ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా పుచ్చలపల్లి శతజయంతి ఆదివారం బిసి స్టడీ సర్కిల్ యూత్ హాస్టల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముందుగా ఆయన పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్.ఎఫ్.ఐ సంఘం ఎలా పనిచేయాలో పుచ్చలపల్లి దిశనిర్ధేశించారని అన్నారు. ఆయన సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి తన నిరాండంబరతను చాటుకున్నారని అన్నారు. చిన్నతనం నుంచి ఉద్యమ లక్షణాలను అలవరుచుకున్న వ్యక్తి సుందరయ్యని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటుల్లో ఉండాల్సిన వారు జైల్లో ఉండటం దేశదౌర్భాగ్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం పట్టడం లేదని విమర్శించారు. సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి ఎం.గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడు జగన్మోహనరావు పాల్గొన్నారు.

రిపోర్టర్స్ డైరీ
నోరు మంచిదైతే..
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న పెద్దల మాట ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల వారికి ఇప్పుడిప్పుడే అవగతం అవుతున్నట్టుంది. అదేంటో గానీ పి.సి.సి పెద్ద నోటి నుంచి వస్తున్న ప్రతి మాటా ఇప్పుడు వివాదస్పదం కావడం తెలిసే జరుగుతోందో తెలియక జరుగుతోందో అర్ధం కావట్లేదట. అప్పుడెప్పుడో వోక్స్‌వేగన్ కుంభకోణంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఒక అనామకుడు కళ్ళముందే మూటగట్టుకుని పోయాడు. ఈ వ్యవహారంలో సంబంధిత మంత్రిగా ప్రస్తుత పి.సి.సి ఛీఫ్ ఎనలేని అపఖ్యాతిని కూడగట్టుకున్నారు. ‘సొమ్ములు పోనాయి మరేటి సేత్తాం’ అంటూ బొత్స ఆనాడు చేసిన వాఖ్యలకు విపక్షాలు మండిపడ్డాయి. ప్రజాధనం కళ్ళముందే దొంగల పాలైతే, అందుకు బాధ్యత వహించి బాధ పడాల్సింది పోయి సొమ్ములు పోనాయంటూ సమర్ధించుకోడాన్ని ఎండగట్టాయి కూడా. తాజాగా పి.సి.సి పెద్ద గారు మరోసారి తన నోరు జారి ఇరుకున పడ్డారు. ఫార్మసి విద్యార్ధిని దేశ రాజధానిలో గేంగ్‌రేప్‌కు గురైన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మహిళలకు కనీస రక్షణ కరవైందంటూ విపక్షాలతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ప్రజాందోళన హింసాత్మకంగా మారి ప్రభుత్వానే్న కుదిపేస్తోంది. దేశాధ్యక్షునితో పాటు ప్రధానమంత్రి జరిగిన సంఘటనను ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటూ తమ పొరపాటును అంగీకరించారు. ఇదే సందర్భంలో పి.సి.సి ఛీఫ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి స్వతంత్య్రం వచ్చిందికదాని అర్ధరాత్రి తిరుగుతామా ఏంటి అంటూ నోరు జారారు. అంతే ఇంకేముంది. ఈ ఒక్క ముక్క అల్లకల్లోలమే సృష్టించింది. బాధ్యతగల మంత్రిగా, పార్టీ పరంగా పెద్ద హోదాలో ఉన్న నేత అనాల్సిన మాటలేనా ఇవి అంటూ మళ్ళీ విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించాయి. మీడియా సమావేశం ముగిసి గంట కాకుండానే పిసిసి ఛీఫ్ మరోసారి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. మహిళలు అర్ధరాత్రి తిరగడాన్ని తాను వ్యతిరేకించలేదంటూ సవరణ ఇచ్చుకోవాల్సిన అగత్యమేర్పడింది. ఇప్పటికీ ఈ విషయంపై అక్కడక్కడ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా పి.సి.సి ఛీఫ్ మరో వివాదస్పద వాఖ్య చేసి నాలిక్కరుచుకున్నారు. రాష్ట్ర విభజన అంశం హాట్‌టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతలతో చర్చిస్తున్న పి.సి.సి పెద్దగారు వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినే అంటూనే తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అంటూ పార్టీ ప్రతినిధుల వద్ద చేసిన వాఖ్యలు లీకయ్యాయి. ఈఎపిసోడ్‌లో ఆయన బహిరంగంగా చేసిన వాఖ్యలు ఎక్కడా లేకపోగా ఛీఫ్‌తో సమావేశమైన ప్రతినిధులు తమ మధ్య జరిగిన సంభాషణలను పూసగుచ్చినట్టు మీడియా ముందు పెట్టడంతో ఆయన మరోసారి దిద్దుబాటుకు రావాల్సి వచ్చింది. అయితే ఈసారి నెపం వేసేందుకు మరో ప్రతినిధి దొరకడం ఆయనకు ఊరటనిచ్చే విషయమే. అయితే ఎప్పుడూ ఎదో అనకూడని మాట అనడం ఆనక పొరపాటు జరిగింది మరేటిసేత్తాం. అనడం ఆయనకి మామూలే. మరేందుకు ఇలాంటి విషయాలను అనవసరంగా రాద్దాంతం చేయడం ఎందుకని.. ప్రజలే సరిపెట్టకుంటే పోలా....
- బ్యూరో, విజయనగరం

అంతర్జాతీయ వేదికలపై మెరిసిన క్రీడాకారులు
విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 30: జిల్లాలో వివిధ క్రీడాంశాల్లో రాణించినా, తగిన ఆదరణ కొరవడింది. ఈ ఏడాదిలో కూడా వెయిట్ లిఫ్టర్లు తమ హవాను కొనసాగించారు. వీరు మరోసారి జిల్లా ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వెయిట్ లిఫ్టింగ్‌లో వి.శ్రీనివాసరావు, మత్స సంతోషి, వెంకటలక్ష్మి, రామకృష్ణలు వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని అంతర్జాతీయంగా దేశఖ్యాతిని చెటిచెప్పారు. ఈ ఏడాదిలో న్యూజిలాండ్‌లో జరిగిన కామనె్వల్త్ పోటీల్లో వెంకటలక్ష్మి పతకాన్ని సాధించి కామనె్వల్త్ క్రీడలో దేశఖ్యాతిని చాటిచెప్పింది. కబడ్డీకి జిల్లాలో మంచి ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాదిలో కబడ్డీ క్రీడాకారులు పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. సభ్‌జూనియర్స్‌లో కళ్యాణి, వెంకటలక్ష్మి, సీనియర్స్ విభాగంలో చైతన్య, శాంతికుమారి, రాజేశ్వరిలు జాతీయ స్థాయికి జిల్లా నుంచి ఎంపికయ్యారు. పైకా క్రీడల్లో జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో తృతీయస్థానంలో నిలిచింది. వాలీబాల్ సీనియర్స్ విభాగంలో ఎం.్ఫణికుమార్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూనియర్స్‌లో రవిరాజు, దుర్గాప్రసాద్‌లు జాతీయ స్థాయిలో స్థానం సంపాదించారు. తైక్వాండో పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు మెరుస్తున్నారు. తైక్వాండో అండర్-14,17,19 విభాగాల్లో టి.ఇందిర, కె.పార్వతి, వై.పార్వతీష్, డి.హరి, వి.రమాదేవి, సి.హెచ్ ఉమాశంకర్, అనీతలు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభనకనబరిచి త్వరలో జరగబోవు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు స్థానం సంపాదించుకున్నారు. అథ్లెటిక్స్‌లో క్రీడాకారులు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా ఫర్వాలేదనిపించారు. క్రీడాసంఘాల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రతిభ కల్గిన క్రీడాకారులు మరుగున పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నప్పటకి వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే వారు కరవయ్యారని వాపోతున్నారు. అసోసియేషన్లు తరుపున అంతంతమాత్రంగా అందుతున్న ప్రోత్సాహం తప్ప అధికారుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందటం లేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన జిల్లా స్థాయి పైకా పోటీల నిర్వహణ తీరు విమర్శలకు గురవడం తెలిసిందే.

‘వేర్పాటువాదంతో దేశభద్రతకు ప్రమాదం’
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 30: వేర్పాటువాదం దేశభద్రతకు పెనుప్రమాదమని సమైక్యాంధ్ర జిల్లా జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రెండోరోజు సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఇప్పటికే విడిపోయిన చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధిపరంగా శాంతిభద్రతల విషయంలో పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కెసిఆర్ లాంటివారు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు ఎం.సోంబాబు, జాగరపుశ్రీనువాసరావు, బి.్భస్కరరావు, పాల్గొన్నారు.

‘2013ని మహిళా సాధికారిక సంవత్సరంగా ప్రకటించాలి’
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 30: మహిళల సంక్షేమానికి 2013ని మహిళా సాధికారిక సంవత్సరంగా ప్రకటించాలని మాజీ ఎం.పి.డాక్టర్ డివిజి శంకరరావుకోరారు. ఆదివారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పాలనలో మహిళలకు రక్షణ కరవవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఢిల్లీ అత్యాచార సంఘటనలో మృతిచెందిన యువతిని ఉదాహరణగా పేర్కొవచ్చునన్నారు. మన చుట్టూ ఎంత అనాగరికత ఆవరించి ఉందో, ఎటువంటి కాలుష్య వాతావరణంలో బతుకుతున్నామో, కొరగాని చట్టాలు, అమలు చేయాల్సిన అధికారులు, నాయకులు ఎంతో నిద్రావస్థలో ఉన్నారో ఢిల్లీ అత్యాచార సంఘటన రుజువు చేస్తుందన్నారు. ఈ సందర్భంలో యువత చూపిన చైతన్యం స్ఫూర్తిదాయకమని డాక్టర్ శంకరరావుపేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగి మెరుగైన సమాజం ఏర్పాటుకు దోహదం చేయాలన్నారు. అయితే ఇదే సమయంలో నాయకుల స్పందన పేలవంగా ఉందన్నారు. పిసిసి అధ్యక్షుడితో సహా కొంతమంది నాయకులు ఈ సంఘటనపై స్పందించడంలో చులకన వైఖరి చూపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరాన్ని ప్రభుత్వం మహిళా సాధికారిక సంవత్సరంగా ప్రకటించాలని డాక్టర్ శంకరరావుకోరారు.

‘గిరిజన గ్రామాల్లో అధ్వాన్న పరిస్థితులు’
కురుపాం, డిసెంబర్ 30: జిల్లాలోని గిరిజన గ్రామాలు కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదని కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువజన బృందం తెలిపింది. కర్ణాటక రాష్ట్రం సుమోగ జిల్లా అప్పలగిరి, కొనసోడు, హరంగట్ట, కోమనార్ గ్రామాలకు చెందిన యువజన సంఘాల సభ్యుల బృందం గిరిజన గ్రామాల్లో పర్యటించారు. జాగృతి, బసవేష, ఆంజనేయ, కూర్ ఎన్.జి. ఓ.సొసైటీలకు చెందిన 10మంది సభ్యుల బృందం సంపన్నగూడ, టి.కె.జమ్ము, బియ్యాలవలస గ్రామాలను పరిశీలించింది. ఈసందర్భంగా ఆదివారం బృందం సభ్యులు విలేఖర్లతో మాట్లాడుతూ కర్ణాటక ప్రాంతాల గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రతీ పంచాయతీకి ఆరోగ్య కేంద్రం, రోడ్లు, మరుగుదొడ్లు, వీధి లైట్లు, బస్సు సౌకర్యం కలిగి ఉంటాయన్నారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదన్నారు. మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం కూడా కలిగించాల్సి ఉందన్నారు. యువతలో నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నా ఉపయోగించే అవకాశాలు లేవన్నారు. ఈ మేరకు గ్రామాల్లో తాము అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ను కలిసి సమస్యలను తెలియజేశామన్నారు. పరిశీలించిన అంశాలను నివేదికగా తయారుచేసి జిల్లా నెహ్రు యువకేంద్రానికి అందించనున్నట్లు తెలిపారు. బృందంలో చంద్రశేఖర్, దేవరాజు, రఘునాధ్, మంజునాధ్, తదితరులు ఉన్నారు. వీరికి గ్రామీణ పునఃనిర్మాణ కేంద్ర సహకారాలు అందిస్తోంది.

‘పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి’
పార్వతీపురం, డిసెంబర్ 30: పట్టణంలోని వ్యాపారవర్గాలకు తన సహకారం అందిస్తానని రాష్ట్ర అటవీశాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. ఆదివారం ఇక్కడ పార్వతీపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యాపారులంతా కలిసి చాంబర్ ఆఫ్ కామర్స్‌గా ఏర్పడడం ఆనందదాయకమన్నారు. పార్వతీపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వ్యాపారులు ముందుకు రావాలన్నారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. పార్వతీపురం అన్నిరంగాల్లో అభివృద్ధిగా పయనించాలన్నారు. పార్వతీపురంను జిల్లా కేంద్రం అవుతుందని మంత్రి శత్రుచర్ల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ పార్వతీపురంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారవర్గాల సమస్యలు తెలుసుకుని తద్వారా వ్యాపార రంగ సమాచారం తెలుసుకోవడానికి అనువైన చర్యలు తీసుకోవడానికి వీలుకలుగుతుందన్నారు. పన్నులు చెల్లింపువిషయంలో కూడా నిబంధనలు తెలుసుకునేందుకు సులభతరమైన మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ టాక్సు డిప్యూటీ కమిషనర్ జెవిఎస్ శర్మ మాట్లాడుతూ తమశాఖాపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు తాము తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే సవరపుజయమణి, ఆర్డీవో జె.వెంకటరావుతో పాటు విజయనగరం, సాలూరు, బొబ్బిలి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వివి ఎస్ ప్రసాదరావు, ఆరిశెట్టి గున్నయ్య గుప్త, నంబియార్ వేణుగోపాలరావు, పార్వతీపురం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి పెంటపాటి సూర్యారావు తదితరులు మాట్లాడారు. అలాగే ఈకార్యమానికి అధ్యక్షత జల్దు బాబ్జి వహించగా చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్ బొంపాడ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శత్రుచర్లకు ఘనంగా సన్మానించారు. అలాగే ఇక్కడ బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈసమావేశానికి పెద్ద ఎత్తున వ్యాపారులు పాల్గొన్నారు.

చెరకు రైతుకు గిట్టుబాటు ధర దక్కేనా?
గజపతినగరం, డిసెంబర్ 30 : చెరకు రైతులకు ఈ ఏడాది కూడా చేదే మిగిలే పరిస్థితులు కనపడుతున్నాయి. గత ఏడాదితో పొల్చుకుంటే ఈ ఏడాది చెరకు దిగుబడి తగ్గిపోవడమే కాకుండా సాగు విస్తీర్ణం కూడా గణణీయంగా తగ్గిపొయినపుటికీ టన్ను చెరకుకు ఇచ్చే ధర గత ఏడాది వలే ఈ ఏడాది కూడా ప్రకటించడంతో చెరకు రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. గజతపతినగరం డివిజన్ పరిధిలో గతంలో మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం మండలాల్లో చెరకును సాగు చెయ్యగా ప్రస్తుతం గజపతినగరం మినహా మిగతా మండలాల్లో చెరకును సాగు చెయ్యలేదు. గజపతినగరం మండలంలో కేవలం 9 గ్రామాల్లో 500 ఎకరాల్లో చెరకు పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది భీమసింగి ఫ్యాక్టరీకి 80 వేల టన్నుల చెరకును తరలించాలని కాటా అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గత ఏడాది సుగర్ ఫ్యాక్టరీ రైతులకు టన్నుకు 2 వేల రూపాయలు ధరను చెల్లించగా ఈ ఏడాది కూడా అదే ధరను చెల్లించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. లాభాలు వస్తే ధరను పెంచుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. లాభాలు మాట అటుంచి పెట్టుబడులు భారీగా పెరిగినందున 3 వేల రూపాయలు టన్నుకు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నా. చెరకును నరికి కాటాకు తరలించడానికి టన్నుకు 700 రూపాయలు ఖర్చు అవుతుందని పెరిగిన ఎరువులు, పురుగు మందులు, కూలీ డబ్బులు అన్ని కలుపుకుంటే టన్నుకు 1800 రూపాయలు ఖర్చు అవుతుందని ఇక రైతుకు మిగిలింది ఏది లేదని రైతులు అంటున్నారు. గత ఏడాది ఎరువులు, కూలీలు ఖర్చులు తక్కువగా ఉన్నప్పడే చెరుకు గిట్టుబాటు కావేదని ఇప్పుడు ఏమి ఉండదని రైతలు అంటున్నారు.

‘సాహితీ రంగానికి సేవలందించిన ఆనంద గజపతిరాజు’
విజయనగరం (్ఫర్టు),డిసెంబర్ 30: విజయనగర చరిత్రలో సంగీత, సాహిత్య రంగాలకు ఘనమైన సేవలందించిన ఆనందగజపతిరాజు సాహిత్య సంగీత విద్వత్‌పతి అని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు, ఎమ్మెల్యే పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. కణపాక చైతన్య యువజన సేవా సంఘం కార్యాలయంలో ఎలయన్స్‌క్లబ్, ఉషోదయా టాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆంధ్రభోజ ఆనందగజపతిరాజు 162వ జయంతిసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ఆనందగజపతిరాజు ఆంధ్రంతోపాటు ఆంగ్ల, పారశీక, సంస్కృత భాషల్లో దిట్ట అని, రుగ్వే(మిగతా 2వ పేజీలో)
దాన్ని ఆంగ్లంలో తర్జుమా చేసేందుకు మాక్స్‌ముల్లర్‌కు ఆర్థిక సహాయం అందించారన్నారు. వేదాంత కల్పతరు పరిమళం, ధర్మ సింధూరం వంటి 100కు పైగా రచనలను ముద్రించారన్నారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ రాసిన ఆనందగజపతిరాజు జీవితచరిత్రను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వాకర్స్‌క్లబ్ అధ్యక్షుడు డిసివిఎన్ రాజు, ధవళ కనకరాజు, ఈపు విజయ్‌కుమార్, శేషారావు, మజ్జికాంతారావు తదితరులు పాల్గొన్నారు.
‘రిజర్వేషన్ పాటించకపోతే
సహకార ఎన్నికల విధులు బహిష్కరణ’
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 30: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఇన్‌సర్వీసు ఉద్యోగులకు 25శాతం ఉద్యోగ నియామకాల రిజర్వేషన్ పాటించకపోతే ఎన్నికల విధులు బహిష్కరించాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఈ మేరకు ఇక్కడికి సమీపంలో గొట్లాంలో ఆదివారం ఉద్యోగులు సభ్యసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు మాట్లాడుతూ రిజర్వేషన్‌ల పేరు చెప్పి ఇన్‌సర్వీసు ఉద్యోగులకు కేటాయించిన పోస్టులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇటీవల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కొంతమందిని రెగ్యులర్ చేస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. సహకార సంఘాల ఉద్యోగులకు రావాల్సిన ఎనిమిది పోస్టులను వెంటనే ఇవ్వకపోతే సహకార సంఘాల ఎన్నికల విధులు బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అప్పుల రెన్యువల్ చేయాలని, రెండు, మూడుసార్లు చేస్తున్నందున సంఘాలపై పనిభారం పెరగడమేకాకుండా రైతులపై కూడా ఆర్థికభారం పడుతుందని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడి వల్ల సహకార (మిగతా 2వ పేజీలో)
సంఘానికి హాజరుకాలేపోయిన బొండపల్లి సహకార సంఘం సిఇఒను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. సహకార సంఘాల్లో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రామునాయుడు, నాయకులు బి.్భస్కరరావు, సింహాచలం. పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘నైతిక విలువలు కాపాడుకోవాలి’
బొబ్బిలి, డిసెంబర్ 30: అంతరించిపోతున్న నైతిక విలువలను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కృష్ణాజిల్లా అదనపు జడ్జి వి సత్యారావు అభిలషించారు. అభిమాని ఫౌండేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శ్రీకళాభారతిలో సేవా శ్రీ విశిష్ట పురస్కారాల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నిష్ణాతులైన వారికి సన్మానాలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నైతిక విలువలను కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. తోటివారికి సేవా కార్యక్రమాలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి శ్రమను గుర్తించినప్పుడే దేశం ముందుకు వెళుతుందన్నారు. దేశాన్ని, చట్టాన్ని గౌరవించాలని కోరారు. పరోపకారం కోసం కొంత సమయాన్ని కేటాయించాలన్నారు. అభిమాని ఫౌండేషన్ సేవా పురస్కారాలను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం కంటి వైద్యనిపుణులు వెంగళరావు మాట్లాడుతూ మరిన్ని అభిమాని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ ఇటువంటి సంస్థలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈసందర్భంగా రూరల్ సి. ఐ. శ్రీహరి రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాన్న రామకృష్ణ, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె.వి. అప్పారావులు మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమాని ఫౌండేషన్‌ను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా చేసుకోవాలన్నారు. అభిమాని ఫౌండేషన్ వ్యవస్థాప అధ్యక్షులు రెడ్డి రాజగోపాలనాయుడు మాట్లాడుతూ 5 ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించామని స్పష్టం చేశారు. వీటితోపాటు వృద్ధుల కోసం మాతృశ్రీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎవరినైన ఫౌండేషన్ ఆహ్వానిస్తుందన్నారు. అనంతరం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆర్. సత్యనారాయణరావు, ఏ.హెర్బట్, ఎం.శ్రీరాములు, ఎస్.అమ్మడమ్మ, ఎం.సూర్యారావు, ఎస్.మోహనరావులతోపాటు ఎన్.వి. ఆర్. సత్యనారాయణమూర్తి, ఎస్.సూర్యం, పి.సోమరాజు, డాక్టర్ శశిభూషణరావు, ఏ.్భస్కరరావు, ఎస్.గోవిందరావు, సి.హెచ్.వెంకటరావు, డి.శ్రీనివాసరావు, జాక్సన్, టి.అచ్యుతవల్లి,కె.విక్రంరావు, ఎం.వాసుదేవనాయుడు, సి.హెచ్. శ్రీదేవమ్మలకు విశిష్ట పురస్కారాలు అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
‘రూ. 60 కోట్లతో 33 మంచినీటి పథకాలు’
బొబ్బిలి(సాలూరు), డిసెంబర్ 30: సాలూరు నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో 33 మంచినీటి పథకాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు. మండల పరిధిలో ఉన్న అంటివలస, దాగరవలస, గాదెపల్లిలలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి పథకాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 మంచినీటి పథకాలలో కొన్ని ప్రారంభించారని, అవి వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. మంచినీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాలల్లో సైతం మంచినీటి సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం లక్షలాది రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.డబ్ల్యుఎస్ డిఇ కోటేశ్వరరావు మాట్లాడుతూ మంచినీటి పథకాల పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పలు ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన పథకాల పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎఇ ప్రకాష్, మాజీ ఎంపిపి సుశీల, జడ్పీటీసి సురేష్, స్పెషలాఫీసర్ జీవపుత్రకుమార్, ఎండిఒ శంకరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.రమణ, రామకృష్ణ, పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు. వెంగళరాయసాగర్ కాలువలో 5లక్షల 63 వేల చేప పిల్లలను ఆదివారం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు సంపూర్ణ సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎస్టీ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు మరిన్ని పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతానికి చెందిన 84మంది మత్స్యకారులకు సైకిళ్లు, వలలు, ఇతర పరికరాలను అందించినట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏ.డి. ఫణిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో మత్స్యకారులకు పలు రకాలైన పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా వారి ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుకోవాలని కోరారు. జాతీయ మత్స్యకార అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు రుణాలు, పరికరాలను అందిస్తున్నామన్నారు. కావల్సిన వారు మత్స్యశాఖకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. చేపల పెంపకం పట్ల మత్స్యకారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకుంటే మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డి.డి. ప్రభుదాస్, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షులు కంచి వెంకటరావుతోపాటు కన్నయ్య, స్పెషలాఫీసర్ జీవపుత్రకుమార్, ఎండిఒ శంకరరావుతోపాటు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బెల్లం ఊట ధ్వంసం
పార్వతీపురం, డిసెంబర్ 30: పార్వతీపురం సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈనెల 28,29 తేదీల్లో నిర్వహించిన దాడుల్లో 12500 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేశామని పార్వతీపురం ఎక్సెజ్ సర్కిల్ ఇనస్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడి విలేఖరులతో మాట్లాడుతూ ఎన్‌ఫోర్సుమెంట్ అసిస్టెంట్ కమిషనర్ బి ఎన్ ఆనందరాజు నేతృత్వంలో దాడుల్లో భాగంగా గడిసింగుపురం, చినబుడ్డిడి, కోడిపుంజువలస, బిల్లమానుగూడ, వనజ, కొత్తగూడలలో నిర్వహించిన దాడుల్లో 5వేల లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధంసం చేసి, 300లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ఒడిశా సరిహద్దుప్రాంతంలోని పిల్లిగుడ్డివలసలో నిర్వహించిన దాడుల్లో 200లీటర్ల పులిసిన బెల్లం ఊటలు, జైకోట ప్రాంతంలో 5500 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేశాన్నారు. జియ్యమ్మవలస పరిధిలోని నిర్వహించిన దాడుల్లో చినమేరంగికి చెందిన మీసాల చినబాబు, రామరామభద్రాపురానికి చెందిన కొండగొర్రి మల్లేశ్వరరావు ఇళ్లలో దాడులు చేసి 20 నాటు సారా పేకట్లు వంతున స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు. జియ్యమ్మవలస మండల కేంద్రంలో నిర్వహించిన దాడుల్లో గర్భాపు జనార్థననుండి 20పేకట్లు, గెడ్డతిరువాడలో నిర్వహించిన దాడుల్లో డప్పుకోట రవీంద్ర నుండి 20 పేకట్లు వంతున స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్టు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈదాడుల్లో బొబ్బిలి, తెర్లాం, సాలూరు సి ఐలు కె.సురేష్, ఎం.సింహాచలం, ఎం.జగన్మోహనరావులతో పాటు పార్వతీపురం ఎన్‌ఫోర్సుమెంట్ సి ఐ బివి రవికుమార్ పాల్గొన్నారని సిఐ శ్రీనివాసరావు వివరించారు.
యువతి ఆత్మకు శాంతి కలగాలని ర్యాలీ
పార్వతీపురం, డిసెంబర్ 30: ఢిల్లీలోని అత్యాచారానికి బలైన యువతి ఆత్మకు శాంతికి కలగాలని పార్వతీపురం పట్టణంలోని నాలుగురోడ్ల జంక్షన్ నుండి ఆర్‌టిసి కాంప్లెక్సు వరకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం హుస్సేన్ (సునీల్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈర్యాలీని యువతిపై దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు నినాదాలు చేశారు. యువతి ఆత్మకు శాంతికి కలగాలని కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్సువద్ద తెలుగుతల్లి విగ్రహం వద్ద రెండు నిమిషాలుపాటు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, మాజీ కౌన్సిలర్ గౌరీశంకర్, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సలీమ్, శివాజీ, బాలు,రవి, ప్రకాశ్, సురేష్ , ఉదయ్, లక్ష్మణ్, శేఖర్, కల్యాణ్ పాల్గొన్నారు.
తెన్నుఖర్జలో వనభోజనాల సందడి
* మంత్రి శత్రుచర్ల హాజరు
కురుపాం, డిసెంబర్ 30: మండలంలోని తెన్నుఖర్జ సిల్వర్ జూబ్లీ పార్కులో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున వన భోజనకార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం కురుపాం ఎమ్మెల్యే వి.టి. జనార్దన థాట్రాజ్ ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండలానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో రాష్ట్ర అటవీశాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శత్రుచర్ల వనభోజన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో జియ్యమ్మవలస మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ఏడాది
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>