ఆదిలాబాద్, ఫిబ్రవరి 5: గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా చేపట్టిన లోక్ అదాలత్‌లో 882 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి మధుసూదన్ అన్నారు. ఆదివారం న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4,5 తేదీల్లో జిల్లాలోని పలు కోర్టు పరిధిలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాప్రధాన న్యాయమూర్తి వెంకట్‌ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా అదనపు న్యాయమూర్తి ఆనంద్‌రావు ఆధ్వర్యంలో మెగా లోక్‌అదాలత్‌లు నిర్వహించామన్నారు. ఈ అదాలత్‌లో ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదఘటనలు, ప్రమాదాలపై 882 కేసులను పరిష్కరించామన్నారు. సంబంధిత ఇన్సురెన్స్కంపెనీల యాజమాన్యాల నుండి బాధితులకు, బాధిత కుటుంబాలకు దాదాపు కోటి రూపాయల వరకు పరిహారం అందేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ లోక్ అదాలత్‌ల వల్ల జిల్లాలోని పలు బాధిత కుటుంబాలకు, బాధితులు న్యాయం చేకూర్చడం జరిగిందన్నారు.
జిల్లాన్యాయసేవా సంస్థ కార్యదర్శి మధుసూదన్
english title:
mega lok adalat
Date:
Monday, February 6, 2012