ఇచ్చోడ, ఫిబ్రవరి 5: పెళ్ళి అయిన ఎనిమిది నెలలకే మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని భర్త వేధించడంతో మరో పెళ్ళికి ఒప్పుకోని భార్యను హతమార్చిన భర్త ఉదంతం ఆదివారం మండలంలోని సిరికొండలో చోటు చేసుకొంది. సిరికొండ గ్రామానికి చెందిన గంగామణి (19) మేనబావ అయిన అంజనేయులుకు గత మే నెలలో కట్నకానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని నెలలు సాఫీగా సాగిన వీరి సంసారం అంజనేయులుకు మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని కోరిక కలగడంతో నిత్యం భార్య అయిన గంగామణిని వేధించడాని, గతంలో అనేక సార్లు ఈ విషయం కుటుంబ పెద్దల వరకు వెళ్ళినా అమ్మాయి తల్లిదండ్రులుకు అమ్మాయికి నచ్చజెప్పి భర్త ఇంటికి పంపించారు. అప్పటి నుండి భార్య భర్తల మధ్య తరచు తగాదాలు జరిగేవని మృతురాలి తల్లి లక్ష్మి, తండ్రి భూమన్నలు రోధిస్తూ తెలిపారు. ఎన్నిసార్లు అంజనేయులను నచ్చజెప్పినా ప్రవర్తన మారలేదని చివరకు ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో కత్తితో కడుపులో పొడవడంతో తీవ్ర రక్తస్రావం జరుగగా, అరుపులు కేకలు విన్న చుట్టు పక్కల వారు రక్తం మడుగులో కొట్టుకుంటున్న గంగామణిని ఇచ్చోడలోని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో తుధి శ్వాస విడిచింది. పెళ్ళి జరిగి కనీసం యేడాది జరగక ముందే భర్త చేతిలో గంగామణి హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. భార్యను హతమార్చిన భర్త అంజనేయులును పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. బోథ్ సిఐ రాంగోపాల్ హత్య సంఘటనకు వెళ్ళి విచారించారు. స్థానిక ఎస్‌ఐ రమేష్‌కుమార్ శవపంచనామా నిర్వహించి శవపోస్టుమార్టంను పంపించారు.
పెళ్ళి అయిన ఎనిమిది నెలలకే మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని
english title:
murder
Date:
Monday, February 6, 2012