ఆదిలాబాద్ , ఫిబ్రవరి 5: ‘టెట్’ను రద్దు చేయాలని సోమవారం రాష్టవ్య్రాప్తంగా కలెక్టరేట్‌ల ముందు ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఇందులో భాగంగానే నేడు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బొమ్మెన సురేష్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి రాజు, పిడిఎస్‌యు జిల్లా సహాయ కార్యదర్శి పి సంధ్యలు ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో బిఇడి, డిఇడి విద్యార్థులకు టెట్‌ను నిర్వహించడం వల్ల ఎంతో నష్టపోవడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎంతో కష్టపడి బిఇడి, డిఇడి శిక్షణలు పూర్తి చేసి డిఎస్సీకి సిద్దం అవుతున్న తరుణంలో అభ్యర్థులకు ‘టెట్’ పేరుతో పరీక్ష నిర్వహించడం అందులో పాస్ మార్కులు అధికంగా వుండడంతో అర్హత కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల టెట్‌తో విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలే అవకాశం వుందన్నారు. వెంటనే టెట్‌ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. బిఇడి విద్యార్థులకు మరింత తీరని అన్యాయం జరుగుతుందని, కేవలం ఎస్‌ఎలో అవకాశం కల్పించడం పోస్టులు వంద లోపే వుండడంతో అభ్యర్థులు మరింత ఆందోళనకు గురవుతున్నారని, బిఇడి అభ్యర్థులకు ఎస్‌జిటిలో కూడా అవకాశం కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో నిర్వహించే నేటి కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంకు విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు, అభ్యర్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు బొమ్మెన సురేష్ పిలుపునిచ్చారు. డిఇడి, బిఇడి విద్యార్థులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని విద్యార్థి, యువజన సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, డివైఎఫ్‌ఐలు విజ్ఞప్తి చేశాయి.
కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతు
ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళనలు చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల దీక్షలకు తమ సంపూర్ణ మద్దతును ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యులు ప్రకటించాయి. కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బొమ్మెన సురేష్, పిడిఎస్‌యు జిల్లా సహాయ కార్యదర్శి పి సంధ్యలు హెచ్చరించారు. వారి కనీస డిమాండ్లను పరిష్కరించాలని నేతలు కోరారు.
* నేడు కలెక్టరేట్ ముట్టడి
english title:
‘టెట్’ను రద్దు చేయాలని సోమవారం రాష్టవ్య్రాప్తంగా కలెక్టరేట్‌ల ముందు ధర్నా
Date:
Monday, February 6, 2012