ఆదిలాబాద్, ఫిబ్రవరి 5: జిల్లాలో 12 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ కరీంనగర్ రేంజీ డిఐజి అజయ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ళ సీనియార్టీ పూర్తి చేసుకొన్నవారికి మరి కొందరు విఆర్‌లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుండడంతో బదిలీలు అనివార్యమయ్యాయి. బదిలీ అయిన వారిలో ఎం శ్యాంసుందర్ బెల్లంపల్లి టూటౌన్‌కు పోలీసుస్టేషన్‌కు, జి రాజన్న బేలాకు, కడెం ఎస్‌ఐ సిహెచ్ అజయ్ ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యారు. అలాగే బెల్లంపల్లి టూటౌన్ ఎస్‌ఐ కె పురుషోత్తం కడెం పిఎస్‌కు, ఆదిలాబాద్ ఉమెన్ పిఎస్ ఎస్‌ఐ బి రఘుపతి ముధోల్ పిఎస్‌కు, ఆదిలాబాద్ సిసిఎస్ ఎస్‌ఐ జి కిష్టయ్య ఆదిలాబాద్ ఉమెన్ పిఎస్‌కు, ఇస్‌గాం ఎస్‌ఐ కె స్వామి బెల్లంపల్లి వన్‌టౌన్‌కు, ఆదిలాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐ జడ్ శాంతారాం నిర్మల్ టౌన్‌కు, నిర్మల్ టౌన్ ఎస్‌ఐ ఎన్ సత్యనారాయణ ఇస్‌గాంకు, ఆదిలాబాద్ సిసిఎస్ ఎస్‌ఐలు కె సత్యనారాయణ, అహ్మద్ రజీయోద్ధీన్ కాగజ్‌నగర్ పోలీస్టుషన్‌లకు, బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌ఐ డి రాజనర్సయ్య సిసిఎస్ ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు.
సిర్పూర్-యులో పోలీసుల ఉచిత వైద్య శిబిరం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 5: జిల్లాలో వైద్యం అందక గిరిజనులు మరణించడం చాలా దురదృష్టకరమని, తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. ఆదివారం నాడు మారుమూల సిర్పూర్-యు మండలంలోని ఖాతిగూడ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయగా, గిరిజనుల నుండి భారీ స్పందన వచ్చింది. 1000 మంది గిరిజనులు హాజరుకాగా, 500 మంది గిరిజనులు చికిత్సలు పొందారు. కాగా కొందరు టైఫాయిడ్, మలేరియాతో బాధపడుతున్న వారిని పోలీసు వ్యాన్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా గిరిజనులను రవాణా వసతులు కల్పించి శిబిరానికి తరలించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ భానుప్రకాశ్, డాక్టర్ సందీప్ పవార్, డాక్టర్ దత్తుతో పాటు మరో పది మంది డాక్టర్లు పాల్గొని వైద్య చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ గిరిజనులకు వైద్యం అందించేందుకు ఈ వైద్య శిబిరాలను ఏర్పాటుచేశామని, ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నందున, రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ బి ఉమామహేశ్వర్, ఎఎస్పీ అంబర్‌కిశోర్‌జా, జైనూర్ సిఐ కాశయ్య, ఎస్సైలు సురేష్, నరేందర్, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.