గజపతినగరం, ఫిబ్రవరి 5 : సప్తగిరి దూరదర్శన్ చానల్ ద్వారా ప్రజలకు మంచి కార్యక్రమాలు ప్రసారాలు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ అసిస్టెంట్ పరిశోధనా కేంద్రం అధికారి కె.రాఘవ తెలిపారు. స్థానిక గ్రామపంచాయతీ శివారుగ్రామం ఎం.వెంకటాపురంలో ఇంటింటికి వెళ్ళి సర్వే జరిపారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ జరపడానికి ఐదు జిల్లాలు ఎంపిక కాబడినట్లు తెలిపారు. హైదరాబాద్ , విజయనగరం, చిత్తూరు, వరంగల్, కర్నూలు జిల్లాలు ఎంపికైనట్లు చెప్పారు. దశలవారీగా రాష్టవ్య్రాప్తంగా సప్తగిరి లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలపట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మూడురోజులు సర్వే జరుపుతున్నట్లు తెలిపారు. ప్రసారం అవుతున్న కార్యక్రమాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రజలను అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు మెరుగైన మంచి కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకుని మార్పులుచేర్పులు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
సప్తగిరి దూరదర్శన్ చానల్ ద్వారా ప్రజలకు మంచి కార్యక్రమాలు ప్రసారాలు
english title:
channel
Date:
Monday, February 6, 2012