విజయనగరం , పిబ్రవరి 5: ఓడిషాలో బర్డ్ఫ్లూ వ్యాధి ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి అన్నారు. తనను కలిసిన విలేఖర్లుతో ఆమె మాట్లాడుతూ కాకులు, కొంగలు తదితర పక్షులు ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్తుంటాయని వాటి ద్వారా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు గమనించాలన్నారు. ఈ వ్యాధి హెచ్5ఎన్1 ఆనే వైరస్ వలన వ్యాధి వస్తుందన్నారు. ఆకస్మికంగా పక్షులు చనిపోతే వాటిని అంటుకోవద్దని సూచించారు. ఎక్కడైనా పక్షులుచనిపోయి కుప్పలుగా పడి ఉంటే వేంటనే పశు సంవర్ధకశాఖ ఆధికారులకు సమాచారం అందించాలన్నారు. మార్చి నెల నుండి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత సంవత్సరం గిరిజన ప్రాంతాలల్లో డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, మైదాన ప్రాంతాలల్లో రెండు చోట్ల చేపలు తినడం వల్ల డయేరియా ప్రబలిందని తెలిపారు. కాని ఎక్కడ మరణాలు లేవన్నారు. సీజన్ వ్యాధులు మార్చి నెల నుండి ప్రారంభ మవుతాయన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని ముందు నుండే అవగాహన కల్పిస్తామని తెలిపారు. క్షేత్ర స్ధాయిలో మందులను ఏర్పాటు చేసి అందుబాటులో పెడతామన్నారు. జిల్లా స్ధాయి నుండి గ్రామీణ స్ధాయి వరకూ కార్యాక్రమాల ద్వారా ప్రజలకు వ్యాధులు పట్ల తీసుకొవాల్సిన జాగ్రత్తలను వివరిస్తామన్నారు. మందు ద్రావణంతో తయారు చేసిన 1,45000 దోమ తెరలను గిరిజన ప్రాంతాలల్లో పంపీణీ చేయనున్నామన్నారు. ఏప్రిల్ నెలలో గిరిజన ప్రాంతాల్లో మలాథియాన్‌ను పిచకారి చేయడం జరుగుతుందన్నారు. వైద్య సిబ్బంది తక్కువచోట కోత్తగా కాంట్రాక్టు పద్ధతిలో 10 మంది సిబ్బందిని నియమించామని, అన్నిచోట్ల ఖాళీ లేకుండా ఏర్పాటు చేశామన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు గత సంవత్సరం నుండి జిల్లా కేంద్రసుపత్రిలోనే జరుపుతున్నామని దీనివలన మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవచ్చని తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని
english title:
bird flue
Date:
Monday, February 6, 2012