నెల్లిమర్ల, ఫిబ్రవరి 5: స్థానిక తహశీల్దారు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో 12 కంప్యూటర్లు, మూడు బ్యాటరీలను దుండగులు అపహరించారు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం శనివారం అర్దరాత్రి ఈ దొంగతనం జరిగింది. కంప్యూటర్ సిబ్బంది 18 కంప్యూటర్లను చార్జింగ్ నిమిత్తం అమర్చి తలుపులకు తాళాలు వేసి సాయంత్రం ఇంటికి వెళ్ళారు. ఆదివారం సిబ్బంది వచ్చి తలుపులు తెలిచేసరికి వెనుక కిటీకిగ్రిల్స్‌ను కోసి వస్తువులు చిందరవందరగా ఉండడంతో కంప్యూటర్ కంట్ట్రాక్టర్‌కు తెలియజేశారు. సదరు కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన స్థలాన్ని ఎస్సై పి.వి.ప్రసాద్ పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
స్థానిక తహశీల్దారు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో 12 కంప్యూటర్లు, మూడు బ్యాటరీలను
english title:
chori
Date:
Monday, February 6, 2012