Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వైద్య విద్యార్థిని ఆత్మహత్య

$
0
0

శ్రీకాకుళం (రూరల్), జనవరి 13: శ్రీకాకుళం మండలంలో రాగోలు సమీపంలో ఉన్న జెమ్స్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన చిట్టా బాపూజీరెడ్డి కుమార్తె ఐశ్వర్యసాయి (20) జెమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. విద్యార్థులంతా సంక్రాంతి సెలవులకు వెళ్ళిపోయారు. ఈ నెల 17న సెకండియర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడంతో కేవలం 27 మంది విద్యార్థినులు మాత్రమే హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ నెల 9న విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ఇంటికి తీసుకువెళ్ళి 12న ఉదయానే్న వసతి గృహంలో దించేసి తిరిగి వెళ్ళారు. ఐశ్వర్యసాయి చెల్లెలు లిఖితారెడ్డి ఇదే కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్తూ రూమ్ తాళాన్ని తన అక్కకు ఇచ్చింది. అదేరోజు రాత్రి భోజన సమయంలో ఐశ్వర్యసాయి కనిపించకపోవడంతో విద్యార్థులు గ్రంథాలయంలో ఉందేమోనని చూడగా అక్కడ లేదు. దీంతో స్నేహితులు వెతకడం మొదలుపెట్టారు. కింద అంతస్థులో ఉంటున్న ఐశ్వర్యసాయి కనపడకపోవడంతో మొదటి అంతస్థులో వెతికేసరికి రాత్రి సమయంలో నిఖితారెడ్డికి చెందిన గది కిటికీ తెరచిఉండడంతో విద్యార్థులు వెళ్ళి చూసేసరికి ఆమె ఉరిపోసుకున్న స్థితిలో కనిపించింది. కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారాన్ని అందించడంతో డిఎస్‌పి ఎల్.అర్జున్, సిఐ ఎం.మహేశ్వరరావు, ఎస్సై అవతారంలు కళాశాల వద్దకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తహశీల్దార్, మండల ఎడ్యుకేటివ్ మెజిస్ట్రేట్ కళాశాలకు చేరుకుని ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు కలెక్టర్‌కు అందజేశారు.
యాజమాన్యమే కారణం
సిలబస్ పూర్తి కాలేదని, సెకండియర్‌కు సంబంధించి ఫ్యాకల్టీ లేరని, ఈ నెల 17 నుండి ఎగ్జామ్స్ కావడంతో మానసిక ఒత్తిడికి గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్టు తల్లిదండ్రులు బాబూజీరెడ్డి, అనూరాధ ఆరోపించారు.

మోహన్‌బాబుతో బాలయ్య భేటీ

అరగంట పాటు మంతనాలు

ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జనవరి 13: ప్రముఖ సినీనటుడు, విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబుతో మరో ప్రముఖ సినీనటుడు, నందమూరి బాలకృష్ణ ఆదివారం భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల నారావారిపల్లికి వచ్చిన సినీనటుడు బాలకృష్ణ ఆదివారం సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌లో ఉన్న సినీనటుడు మోహన్‌బాబును కలిసి సుమారు అరగంట పాటు పలు విషయాలపై చర్చించారు. అయితే మీడియాను అనుమతించలేదు. వీరిద్దరి మధ్య సినిమారంగంపై చర్చలు జరిగి ఉంటాయా? లేక కుటుంబ కుశల ప్రశ్నలకే పరిమితమై ఉంటాయా? లేక జిల్లాలో నెలకొని ఉన్న తాజా రాజకీయాలపై చర్చించి ఉంటారా? అన్న అంశాలపై సర్వత్రా వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇటీవల మోహన్‌బాబు విద్యాసంస్థల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఆ సందర్భంగా కూడా మోహన్‌బాబు, చంద్రబాబుల మధ్య తిరిగి సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయన్న చర్చలు జరిగాయి. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డితో నెలకొన్న బంధుత్వం నేపధ్యంలో మోహన్‌బాబు ఇటీవల ఆయన్ను కూడా కలిసి వచ్చారు. ఈ పరిస్థితుల్లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నను రాజకీయ అరంగేట్రం చేయించనున్నారని అందుకు చంద్రగిరి నియోజకవర్గానే్న ఎంపిక చేసుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఆయన ఏ పార్టీ నుండి తన కుమార్తెను పోటీ చేయిస్తారనే విషయం ఉహాగానాలకే పరిమితం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇటు వైఎస్‌ఆర్‌సిపి, అటు టిడిపితోను అవసరమైతే మరో పార్టీతోనైనా సంబంధాలు నెరపగలిగిన చాణుక్యత మోహన్‌బాబుకు ఉందన్నది అక్షరసత్యం. మొత్తం మీద మోహన్‌బాబు ఎవరికి అంతుచిక్కడని ‘తన రూటే...వేరని’ బాలయ్యతో భేటీ అయి మరోసారి చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో టిడిపిని బలోపేతం చేయడానికి చంద్రబాబు చేస్తున్న విస్తృత ప్రయత్నాల నేపధ్యంలో బాలయ్య, మోహన్‌బాబు భేటీ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భోగి వేడుకల్లో అపశ్రుతి
నలుగురికి తీవ్ర గాయాలు
బిక్కవోలు, జనవరి 13: ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుందామనుకున్న నాలుగు వ్యవసాయ కూలీల కుటుంబాల్లో సంక్రాంతి తొలిరోజు భోగిమంట రేపిన చిచ్చు విషాదాన్ని నింపింది. ఆదివారం తెల్లవారు ఝామున భోగి మంట వెలిగిస్తుండగా పందలపాకలోని ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ప్రమాదానికి గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసుల కథనం ప్రకారం పందలపాకలోని శెట్టిబలిజపేటలో ఆదివారం తెల్లవారు ఝామున కొబ్బరిచెట్టు దుంగలతో భోగి మంటను వేశారు. అయితే మంట సరిగ్గా వెలగకపోవడంతో గ్రామంలో ధాన్యం సంచులపై ముద్రణకు ఉపయోగించే రసాయన పదార్థాన్ని (తిన్నర్) కురుపూడి ప్రసాద్ అనే వ్యక్తి మంటపై చల్లాడు. ఒక్కసారిగా మంట బ్లోఅవుట్‌లా వ్యాపించడంతో సమీపంలో ఉన్న కోసూరి వీరమ్మ (52), రాయుడు మంగయ్యమ్మ (50), కురుపూడి నాగేశ్వరరావు (40) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం 108లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన కోసూరి చిన సుబ్బారావు రాయవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హోరాహోరీగా ఎడ్లబండ్ల పోటీలు
ఎస్‌ఐపై దాడి.. కేసు నమోదు
కోవూరు, జనవరి 13: నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరులో భోగి పండుగ సందర్భంగా జరిగిన ఎడ్లబండ్ల పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలను పోలీసులు అడ్డుకోవటంతో ఎడ్లబండ్ల పోటీదారులు కోవూరు ఎస్‌ఐ నరసింహారావుతో వాగ్వివాదానికి దిగారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ఐపై ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశారు. దీంతో ఎస్‌ఐ తుపాకీని వారిపై గురిపెట్టారు. అయినప్పటికీ పోటీదారులు ఎస్‌ఐని కిందపడవేసి పిడుగుద్దులు కురిపించటంతో ఆయన గాయపడ్డారు. ఎస్‌ఐతో వచ్చిన కానిస్టేబుళ్లు కూడా జరిగిన సంఘటన చూస్తూనే మిన్నకుండిపోయారు. దీంతో కొద్దిసేపు పోటీలు ఆగిపోయాయి. ఆందోళనలో ఉన్న వారిపై ఎస్‌ఐ దాడి చేసే సరికి ఆవేశాన్ని ఆపుకోలేక పోయారు. దీంతో ఎస్‌ఐపై దాడికి దిగారు. ఇదిలావుండగా మూగజీవాలను హింసిస్తున్నారన్న కారణంగా ఎడ్ల పందేల నిర్వాహకులపై కేసు నమోదైంది.

శ్రీకాకుళం మండలంలో రాగోలు సమీపంలో ఉన్న జెమ్స్ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని
english title: 
V

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>