Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వ్యక్తిగత మరుగుదొడ్లకు ముందుకురాని లబ్ధిదారులు

$
0
0

గజపతినగరం, జనవరి, 15: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా గ్రామాల్లో పరిశభ్రమైన వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మాణాలు కోసం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నిర్మల్ భారత్ అభియాన్ పధకం క్రింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంకు లబ్ధిదారులు ఆశక్తి చూపడం లేదు. ప్రతి గ్రామంలో 100కు తక్కువ కాకుండా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. తెల్ల రంగురేషన్ కార్డును కలిగి ఉండి, ఉపాధి హామీ పధకం గుర్తింపు కార్డుల ఉండి. గతంలో ఏపధకం క్రింద మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టకపోతే ఈ పధకంకు అర్హులు అయితే ప్రభుత్వం అన్ని నిబంధనలు విధించడంతో నిర్మాణాలు కోసం ప్రజలు ముందుకు రావడం లేదు. ఉపాధి హామీ పధకం ద్వారా 4500 రూపాయలు గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ ద్వారా 4600 రూపాయలను ఈనిర్మాణాలు కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్నది. పెరిగిన ముడిసరుకుల వలస నిర్మాణం కోసం 20 వేల నుండి 25 వేల రూపాయలు ఖర్చు అవుతున్నదని ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఏమూలకు సరిపోకముందుకు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలవోని తోలి విడతలో 5 గ్రామా పంచాయతీల్లో ఈ పధకం ప్రారంభించగా కేవలం 82 మంది మాత్రమే ముందుకు వచ్చారు. రెండో విడతలో 10 పంచాయతీలకు ఎంపిక చెయ్యగా ప్రస్తుతం లబ్దిదారుల సర్వేను చేపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి నిధులను ఏవిధంగా పక్కదారి పట్టించారో ప్రస్తుతం కూడా తూతూ మంత్రంగా చేపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

కూరగాయల సాగుతో అధిక లాభాలు
కొత్తవలస, జనవరి 15 : మండలంలోని రైతులు కూరగాయలు పండిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బీర, బెండ, వంగ, టమాటా, చిక్కుడులతో పాటు తోటకూర, గోంగూర, బచ్చలి విరివిగా సాగు చేస్తున్నారు. గనిశెట్టిపాలెం, గవరపాలెం, మిందివలస, సీతంపేట,రామచంద్రపురం, సంతపాలెం, దెందేరు, గులివిందాడకు చెందిన రైతులు పూర్తిగా కూరగాయలసాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఖర్చులు పోనూ 50 నుండి లక్ష రూపాయలు వరకు సంపాదిస్తారు. ఖరీఫ్ సీజన్‌లో బెండ, బీరకాయలు పండించి ఎక్కుగా సొమ్ము సంపాదిస్తారు. రబీసీజన్ వచ్చేసరికి ఆకుకూరలతోపాటు ఇతర కూరగాయలు పంపిస్తారు. వీరికి కొత్తవలస, మార్కెట్ అనువుగా ఉండటంతో చాలామంది రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బీర, వంకాయ, చిక్కుడు, బరబటాలకు మంచి డిమాండ్ ఉంది. వీటితోపాటు టమాటా మార్చి, ఏప్రిల్ వరకూ పండిస్తూ లాభాలు పొందుతారు. ప్రభుత్వ రాయితీలు, రుణాలు వీరికి తెలియక పోవడం గమనార్హం. ఉద్యానవన శాఖ అధికారుల జాడే కానరాదు. రైతులకు మరింత ప్రొత్సాహం, అందిస్తే మరింత దిగుబడులు సాధిస్తామని రైతులు అంటున్నారు.
పెరిగిన మాంసం ధరలు
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 15: పండుగ సందర్భంగా మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. పండుగ ముందు రోజుల్లో కిలో చికెన్ ధర్ 130 రూపాయలుంటే ప్రస్తుతం కిలో 150 నుంచి 160 రూపాయల వరకు ధరలు పెంచేశారు. మటన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కిలోమటన్ ధర 400 రూపాయల వరకు పెంచేశారు. దీంతో చికెన్, మటన్ ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణంలో ఏ ప్రాంతంలో చూసి చికెన్, మటన్ దుకాణాలు జనంతో నిండిపోయాయి. ధరలు పెరిగినప్పటికీ, మాంసం కోసం ఉదయం నుంచే దుకాణాల వద్ద బారులు తీరాల్సివచ్చింది.
రబీ వరి సాగుపై రైతుల ఆసక్తి
కొత్తవలస, జనవరి 15 : కొత్తవలస వ్యవసాయ సబ్ డివిజన్‌లో రైతులు రబీ వరిసాగుపై ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రబీ కాలంలో వరిసాగు చేయు రైతులు పెరిగారు. కొత్తవలస సబ్ డివిజన్‌లో వేపాడ, ఎస్‌కోట, జామి, కొత్తవలస, ఎల్ కోట మండలాలు ఉన్నాయి. ఖరీఫ్ సుమారు 18 వేల హెక్టార్లలో రైతులు వరిసాగు చేస్తారు. అయితే ఖరీఫ్ అంతగా రైతులకు అనుకూలించక రబీపై మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ కాలంలో వరుస తుఫానులో ఏర్పడి పంట నష్టం వాటిల్లడం, వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో రైతుకు భారీగా నష్టం వాటిల్లుతోంది. వీటికి తోడు ఎరువులు, విత్తనాలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. అందుకనే రైతులు రబీ సీజన్‌లో వరిసాగు చేయుటకు ఇష్టపడుతున్నారు. ఆక్రమంలో ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. కొత్తవలస మండలంలో సుమారు 20 సెక్టార్లు, ఎల్‌కోటలో50, వేపాడలో 75, ఎస్‌కోట, జామి మండలాల్లో 150 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రబీలో మంచును తట్టుకునే రకాలను రైతులు ఎంచుకోవాలని చూచించారు. రబీలో ఎరువులు సరిపడగా దొరుకుతాయని, చీపపేడలు తక్కువగా ఆశిస్తాయని, వ్యవసాయ అధికారి ఎం. సూరినాయుడు తెలిపారు. అయితే నీరు ఉన్న ప్రాంతాలనే ఎన్నుకోవాలని చెప్పారు.
ఉత్సాహంగా
సంక్రాంతి సంబరాలు
మెరకముడిదాం, జనవరి 15: సంక్రాంతి పండగను సోమవారం మండల ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ పండగను పురష్కరించుకుని ప్రతి గ్రామంలోనూ వారి తాహతకు తగ్గట్టు కొత్త దుస్తులను ధరించి సాంప్రదాయబద్దంగా ధరించారు. అలాగే రైతులు ఏడాది కాలం పండించిన పంటలు ఇల్లలో భద్రపర్చుకుని ఇలాగే ప్రతి ఏటా పంటలు పండాని ధాన్య లక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పండగను పురస్కరించుకుని పురవీధుల్లో గంగిరెద్దుల సంచారం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
సంక్రాంతి పండగ సందర్భంగా గర్భాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యువత ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి ఈ పోటీ ల్లో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులను ప్రదానం చేసారు. ఈ కార్యక్రమానికి చుట్టు ప్రక్కల గ్రామాలైన బైరిపురం,నరసయ్యపేట పెదమంత్రి పేట తదితర గ్రామాల నుండి పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఉల్లి పంటతో రైతులకు మేలు
కొత్తవలస, జనవరి 15 : మండలంలోని రైతులు ఉల్లి పంటపై దృష్టి సారించారు. ఉల్లి పంటవల్ల కలిగే మేలు ఏ ఇతర పంటల వల్ల కలగలేదని చీపురువలస గ్రామ రైతులు అంటున్నారు. మండలం మొత్తంగా సుమారు 50 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. డిసెంబర్ నెలలో ఉల్లి నారు నాటుతారని ఫిబ్రవరి ఆఖరుకు పంట చేతికి వస్తోదని వ్యవస్యా అధికారులు తెలిపారు. నాటు (సాంప్రదాయ) ఉల్లిపాయలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండటం వల్ల రైతులు ఎక్కువగా ఆశక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రైతు ఎంతో కొంత ఉల్లి పంటను సాగు చేస్తుండటం విశేషం. ఎక్కువగా చీపురువలస, చీడివలస, దేవాడ, బలిఘట్టాం, ఉత్తరాపల్లి, చిన్నిపాలెం, గ్రామాల రైతులు ఉల్లిసాగు చేస్తున్నారు. పెద్దగ పెట్టుబడులు అవసరం లేదని రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులకు నోచుకోని
ట్రాఫిక్ సిగ్నల్స్
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 15: పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రధానంగా పట్టణంలో మయూరి కూడలితోపాటు బాలాజీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ తరచూ మరమ్మతులకు గురవుతున్నా ట్రాఫిక్ అధికారులు గాని పురపాలక అధికారులు గాని పట్టించుకోవడం లేదు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొనాల్సి వస్తోంది. గత కొద్ది రోజులుగా మయూరి కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకుండా పోయాయి. అదేవిధంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్క్రోలింగ్ బోర్డులు కూడా పనిచేయడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది.
ప్రధానంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, మయూరి కూడలి, ఎత్తు బ్రిడ్జి, కంటోనె్మంట్ బాలాజీ మార్కెట్ రోడ్డుతోపాటు గంటస్తంభం మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొనాల్సి వస్తోంది.
మంచుతో మిర్చి రైతు దిగాలు
కొత్తవలస, జనవరి 15 : గత వారం రోజులుగా కురుస్తున్న మంచు వల్ల మిర్చి రైతు నష్టాన్ని చవిచూస్తూ దిగాలు చెందుతున్నాడు. మంచువల్ల మిర్చిపూతంతా రావి పోవడమే కాకుండా, ఆకులు ముడతలు ఏర్పడి పంటుకు భారీగా నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ మిర్చి రైతు మంచునుండి పంటను కాపాడేందుకు వేలకువేలు మందులకు ఖర్చు చేస్తున్నాడు. పొగమంచు వల్ల పూత రాలి పోవడమే కాక మిర్చి పిందెలు ఏదుగకుండా గుజ్జుజారిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో మిర్చికి మంచి ధర ఉండటంతో చాలా మంది రైతులు మిర్చి పంటను సాగు చేస్తున్నారు. కొత్తవలస సబ్ డివిజన్‌లో గల గ్రామాల్లో సుమారు 100 హెక్టార్లలో మిర్చిసాగు అవుతోందని వ్యవసాయ అధికారులు వివరించారు. జనవరి నెలాఖరు వరకు పంటను మంచు నుండి కాపాడ గలగాలని రైతులకు సూచించారు. పూతరాలి పోకుండా మందులు పిచకారి చేయాలని తెలిపారు.
నేడు కొఠారుబిల్లి కనకదుర్గ జాతర
గంట్యాడ, జనవరి 15 : ప్రసిద్దిగాంచిన కొఠారుబిల్లి కనకదుర్గమాత జాతర మహోత్సవం బుధవారం జరుగనుంది. ఈ ఏడాది భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహిమాన్వితగా, సంతాన దేవతగా భక్తులచే పూజలందుకుంటున్న కనక దుర్గ మాత కొటారుబిల్లి గ్రామస్తులకు ఆరాద్యదేవత, ఏటా కనుమ పండుగ మారునాడైన ముక్కనుమ రోజన జరిగే ఈ జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. కొన్ని వందల సంవత్సరాల నుండి కనకదుర్గ జాతర కొఠారుబిల్లికి చెందిన వేమలి కుటుంబీకుల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఏడాది అమ్మవారి జాతరకు తరలివచ్చే భక్తుల సంఖ్య అంచనా వేసి, దానికి అనుగుణంగా నిర్వాహకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆలయం వద్ద ప్రత్యేక బారికేడ్లు, నిర్మించారు. జాతర దృష్ట్యా స్థానిక ఎస్‌ఐ బిఎన్‌మూర్తి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయం వద్ద తీర్ధమహోత్సవం జరుగనుంది. తీర్ధమహోత్సవంలో వ్యాపమారులు పెట్టుకునే దుకాణాలకు ఏవిధమైన ఆశీలు చెల్లించనవసరం లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. జాతర ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పేకాట రాయళ్ల అరెస్టు
మక్కువ, జనవరి 15 : మండలంలోని మక్కువ, కంచెడివలస, కొయ్యన్నపేట, పాపయ్యవలస గ్రామాల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై మంగళవారం మక్కువ ఎస్సై లక్ష్మణరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. 36 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుండి 41,978 రూపాయలు నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

‘రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే మూల్యం చెల్లించక తప్పదు’
విజయనగరం (్ఫర్టు), జనవరి 15: బెదిరింపు రాజకీయాలకు తలొగ్గి రాజకీయ స్వార్థం కోస రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ మామిడి అప్పలనాయుడు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాస్ర్తియ పద్దతుల్లో రాజ్యాంగబద్దంగానే దేశంలో రాష్ట్రాల విభజన జరగాలన్నారు. అయితే అవకాశవాద రాజకీయాల కోసం రాష్ట్ర విభజన జరిగితే చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం దోషిగా నిలబడక తప్పదని ఆయన హెచ్చరించారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా మద్ధతు లభించిందని ఆయన గుర్తు చేశారు. అయితే అదే పార్టీకి చెందిన పెద్దలు నాటినేతల ఆశయాలకు తూట్లు పొడవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే విశాలాంధ్ర ఉద్యమానికి పునాది వేసిన సిపిఐ, అవకాశవాద రాజకీయం చేస్తున్న బిజెపి రాజకీయ స్వలాభం కోసం తెలుగుజాతి మద్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈనెల 17వతేదీన హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని జరగన్విబోమని తెలంగాణ జాగృతి సమితి ప్రకటించడం దారుణమన్నారు. ఈనెల 28వ తేదీన సమైక్యాంధ్రకు స్వష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ ఈనెల 25వ తేదీన జిల్లా బంద్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 26, 27 తేదీల్లో శాంతియుతంగా ఉద్యమం చేపడతామన్నారు. ఈ సమావేశంలో సమైక్యాంధ్ర జెఎసి నాయకుడు అబ్దుల్వ్రూఫ్ తదితరులు పాల్గొన్నారు.

శబరిమలవాసునికి కర్పూర నీరాజనం
విజయనగరం(కల్చరల్), జనవరి 15 : ఇక్కడికి సమీపంలోని పూల్‌బాగ్ రోడ్డులో అయ్యప్పస్వామి ఆలయంలో మకరసంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఉదయం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం విశేషఅర్చనలు స్వామికి జరిపారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని మంగళవాయిద్యాలతో ఆలయం చుట్టూ మూడుమార్లు ఊరేగింపు చేసారు. శబరిమలైలో మకరజ్యోతి కనిపించిన సమయానికి ఇక్కడ ఆలయంలో భక్తులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆలయమంతా శరణఘోషతో ప్రతిధ్వనించింది. స్వామిని కన్నులపండువగా పూలమాలతో అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శించుకున్నారు. కార్యక్రమంలో శ్రీ అయ్యప్పస్వామి సేవా సంఘం అధ్యక్షులు దారా రాజగోపాల్, రవ్వా రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

వాహనం ఢీకొని విద్యార్థ్ధి మృతి
గుర్ల, జనవరి 15 : మండలంలోని గుజ్జంగివలస గ్రామంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని గ్రామానికి చెందిన కొయ్యాన రమణ (17) ఆదివారం రాత్రి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల కధనం ప్రకారం సోమవారం మృతుడి తండ్రి కొయ్యాన సూరయ్య తన కుమారుడు కనిపించకోవడంతో వెతుకుతుండగా తన ఇంటి సమీపంలో రోడ్డు ప్రక్కన ఎవరో చనిపోయి ఉన్నారని స్థానికులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి తన కుమారుడని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. తలకు బలమైన గాయం, కుడిచెయివిరిగిపోవడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొందని స్థానికులు భావిస్తున్నారు. ఒక్కగానోక్కకోడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, బందువులు బోరున విలపిస్తున్నారు.
బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ
పార్వతీపురం, జనవరి 15: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పండగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు కొన్నింటిని తగ్గించడం వల్ల సమయాలను కూలంగా బస్సులు రాకపోవడం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలోని మెయిన్ బస్టేషన్‌తో పాటు మినీ బస్టేషన్ కూడా బోసిపోయినట్టు కన్పిస్తున్నాయి. బుధవారం నుండి మళ్లీ ప్రయాణికులు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించే అవకాశాలున్నందున బస్సులు రద్దీ విపరీతంగా ఉంటుందని పలువురు అంటున్నారు. ఏమైనప్పటికీ పండగ నేపథ్యంలో బస్సులు తగ్గించడంతో పాటు జనం రాకపోకలు కూడా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కొద్దిపాటి జనం రాకపోకలకు కూడా అవసరమైన బస్సులు ఆశించిన రీతిలో లేకపోవడంతో ఆటోలు కూడా అంతంత మాత్రంగానే తిరగడం వల్ల ప్రయాణికులకు కొంతమేర ఇబ్బందులు తప్పడం లేదని పలువురు అంటున్నారు. అయితే బుధవారం నుండి బస్సులు, ఇతర వాహనాలు ఎక్క్వుగా నడిపేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు. ఆర్టీసీ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

చుక్కేసారు...
మెక్కేసారు..!
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 15 : సంక్రాంతి పండుగ అట్టహాసంగా ముగిసింది. సంక్రాంతి నాడు పెద్దలను స్మరించుకున్న జనం కనుమ రోజు మాత్రం విందు వినోదాలతో పండుగకు ముగింపు పలికారు. మందు మజా రుచులకో గడిపేసారు. ఒక్కరోజులో జిల్లా వ్యాప్తంగా సుమారు 1.95 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైపోయింది. జిల్లా వ్యాప్తంగా 195 మద్యం దుకాణాలతో పాటు 18 బార్లు ఉన్నాయి. మద్యం దుకాణాలు కనుమ రోజున కిటకిటలాడాయి. ప్రతి దుకాణం సుమారు 75 వేల రూపాయల నుంచి 1.25 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. పట్టణాల పరిధిలోని బార్లలో ఒక్కరోజులోనే 2 లక్షల రూపాయలకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అంచనా. ఇక కనుమ అంటే నాన్ వెజ్ రుచుల మెలవింపే ఒక్కరోజులో జిల్లా వ్యాప్తంగా ఆరున్నర టన్నుల మాంసం ఉత్పత్తుల విక్రయం జరిగినట్లు అంచనా రెండున్నర టన్నుల మటన్, మరో నాలుగుటన్నుల చికెన్, మాంస ప్రియులకు పలహారంగా మారిపోయాయి. ఇక గుడ్లు, ఇతర నాన్ వెజ్ వెరైటీలకు లెక్కేలేదు. మొత్తం మీద ఈ సంక్రాంతిని ప్రజానీకం ఆర్బాటం గానే జరుకుందనే చెప్పాలి.
విజయనగరం (కంటోనె్మంట్): సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. పండుగ రోజుల్లో సుమారు 5 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగవచ్చనని ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కడ చూసి మద్యం దుకాణాల వద్ద జనం బారులు తీరారు. గతం కంటే ఈ ఏడాది పండగ సందర్భంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగుతాయని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వయస్సుతో తారతమ్యం లేకుండా మందుబాబులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరడం విశేషం. జిల్లా కేంద్రంలో సుమారు 16 బార్లతోపాటు 30 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. మందుబాబులు పలుచోట్ల హల్‌ఛల్ సృష్టించారు. అతిగా మద్యం సేవించిన మందుబాబు తాగిన బార్లు, మద్యం దుకాణాలు, రోడ్లపై పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

బస్ స్టేషన్ నిర్మాణానికి సర్వే ప్రారంభం
విజయనగరం (్ఫర్టు), జనవరి 15: పట్టణంలో ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఖాళీస్థలంలో కొత్త బస్‌స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రాథమిక సర్వే ప్రారంభమైంది. రాష్ట్ర రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో బిఒటి పద్దతిలో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా బస్‌స్టేషన్‌ను ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ కార్యాలయం ప్రాంగణంలోకి తరలించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు మంగళవారం ప్రాథమిక సర్వే ప్రారంభమైంది. బస్‌స్టేషన్, ఆర్.ఎం.కార్యాలయం ప్రాంగణాన్ని మంత్రి బొత్స పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న బస్‌స్టేషన్‌లో 24 ప్లాట్‌పారాలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా నిర్మించనున్న బస్‌స్టేషన్‌లో 40ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కొత్త బస్‌స్టేషన్ నిర్మాణానికి సుమారు 10కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అధికారులు అంచనావేశారు. బస్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రిబొత్స ఆదేశించారు. ఆర్.ఎం.కార్యాలయం ప్రాంగణంలో ఎంతమేరకు ఖాళీస్థలం ఉందో మంత్రికి మ్యాప్ ద్వారా జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంతపల్లి రామకృష్ణ వివరించారు. మంత్రి వెంట జెడ్పీ సిఇఒ మోహనరావు, ఆర్డీఒ జి.రాజకుమారి, ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ గిడుగు వెంకటేశ్వరరావు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిపోమేనేజర్ పిబిఎంకె రాజు, బస్‌స్టేషన్‌మేనేజర్ ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>