Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చిరు 150వ చిత్రానికి నేనే దర్శకత్వం వహిస్తా

$
0
0

జంగారెడ్డిగూడెం/కొవ్వూరు, జనవరి 15: కేంద్ర మంత్రి చిరంజీవి 150వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. నాయక్ విజయోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం కొవ్వూరు, జంగారెడ్డిగూడెం వచ్చిన ఆయన విలేఖరులతో ముచ్చటించారు. చిరంజీవి తన 150వ చిత్రం చేసి తీరుతారని, అయితే మంచి కథ కోసం అనే్వషిస్తున్నామని చెప్పారు. మంచి కథ దొరకగానే 150వ చిత్రంలో చిరంజీవి నటించేలా తానే ఒప్పిస్తానని అన్నారు. త్వరలో చిరంజీవి నటిస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో కూడా తాను ఒక సినిమా తీసే ఛాన్స్ మిస్సయ్యానని, మంచి కథ దొరకగానే ఆయనతో కూడా ఒక సినిమా తీస్తానని వినాయక్ చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చేదీ లేనిదీ తన చేతుల్లో లేదని, ప్రజల అభిప్రాయం మేరకు వ్యవహరిస్తానన్నారు. డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు తనకు పెదనాన్న అవుతారని ఆయనతో ఉంటుంటే తాను కూడా రాజకీయాలలోకి వస్తానని పలువురు అనుకుంటున్నారని చెప్పారు. అలా అనుకోవడం సహజమైనప్పటికీ రాజకీయాల్లోకి రావడం అనేది తన చేతుల్లో లేదని వినాయక్ స్పష్టం చేసారు. నాయక్ విజయం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఈ చిత్రం రికార్డు కలక్షన్లు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు, మహాత్మా జ్యోతిరావుఫూలే అవార్డు గ్రహీత డికెడి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు మల్లాబత్తుల మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాజట్ల శుభారంభం
నరసాపురం, జనవరి 15: రుస్తుంబాదలో జరుగుతున్న శ్రీ గోగులమ్మ తల్లి జాతీయ స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీల్లో రెండో రోజైన మంగళవారం పురుషులు, మహిళల విభాగంలో ఆంధ్రా జట్లు శుభారంభం చేశాయి. పోటీలు సోమవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నరసాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ పోటీలను ప్రారంభించారు. ఆర్డీవో జె వసంతరావు క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. డిఎస్పీ రఘువీరారెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ పండుగల సమయంలో యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయితో ప్రారంభమైన ఈ కబడ్డీ పోటీలు నేడు జాతీయ స్థాయికి విస్తరించాయన్నారు. అలాగే గ్రామీణ క్రీడైన కబడ్డీని ప్రోత్సహించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఆర్డీవో వసంతరావు, డిఎస్పీ రఘువీరారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన నరసాపురం పట్టణంలో ప్రతి ఏటా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న శ్రీ గోగులమ్మ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. అలాగే మానసిక వికాసానికి, శరీర ధారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అందువల్ల అందరూ క్రీడలకు కొంత సమయాన్ని కేటాయించాలన్నారు. అలాగే మహిళల క్రీడా మైదానాన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు చిదంబరం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాంతి కపోతాలను ఉత్సవ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవకొలను తులసీరావు, డాక్టర్ ఇలపకుర్తి ప్రకాష్, సినీ నిర్మాత కొండేటి సురేష్, కొత్తపల్లి నానీలు ఎగురవేసారు. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ సంఘం కార్యదర్శి వీర్ల వెంకయ్య, రంగారావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
కరవుతీరా కోడిపందాలు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 15: పశ్చిమ వాకిట్లో మరోసారి పందాల పుట్ట సంచలనం సృష్టించింది. తీగ లాగకుండానే తుట్ట అంతా బయటపడ్డట్లు జిల్లావ్యాప్తంగా పందాలు వాడవాడలా ఉత్సాహంగా సాగిపోయాయి. మల్టీస్టారర్ సినిమా రేంజ్‌లో ఇది హిట్ అయింది. మల్టీస్టార్లుగా మన ప్రజాప్రతినిధులే వ్యవహరిస్తే నిర్వాహకులు నిర్మాతలుగా మారిపోయారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే జనానికి బదులు పోలీసులు ప్రేక్షకపాత్రలో ఉండటం. ఏదీఏమైనా హోరుగా సాగిన పందాల జోరులో దాదాపు 200 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. చాలాచోట్ల పందెగాళ్లు ఫట్ అయ్యారనే చెపుతున్నారు. ఈసారి మాత్రం అనూహ్యమైన రీతిలో పందాల జాతర సాగిపోయింది. పోలీసుల నుంచి ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాకపోవటంతో నిర్వాహకులు కూడా ముందునుంచి భారీగా ఏర్పాట్లు చేసుకుని ఆఫర్ల వల కూడా సిద్ధం చేసి పందాలు ఆడించారు. కొన్నిచోట్ల పందెం కాస్తే బిర్యానీ ఫ్రీ అని, మరికొన్నిచోట్ల పందెం గెలిస్తే ఆ మొత్తంతో పాటు ఎల్‌సిడి టివి ఉచితం అంటూ ప్రచారం కూడా చేశారు. ఈవిధంగా సాధారణ వ్యాపారాల మాదిరిగా వీరు కూడా ప్రచారరంగంలోకి దిగటం ఈసారి చర్చనీయాంశంగానే మారింది. అయితే కోడిపందాలు పూర్తిగా పశ్చిమలో సాంస్కృతిక రూపాన్ని సంతరించుకుంటున్నాయనడానికి ఈవిధమైన పరిణామాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొన్నిచోట్ల ఉన్న సంప్రదాయాలను ఏవిధంగా అరికట్టలేకపోతున్నారో జిల్లాలో ఆ జాబితాలో కోడిపందాలే ఉండటం గమనార్హం. ఏదీఏమైనా ఉభయగోదావరి జిల్లాల పరిధిలో పందాల జాతర జరిగితే పశ్చిమ పందాలకు సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరవుతుండటంతో వీటికి మరింత ఆకర్షణ కలిసివచ్చింది. దీంతో ఈ ప్రాంతానికి ఇతర జిల్లాల నుంచి పందాల కాసేందుకు వచ్చినవారి సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి మరింత అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎటువైపు చూసినా పందానికి వెళ్లేవారో, వచ్చేవారో కన్పించారంటే ఏ రేంజ్‌లో ఈ పందాలు సాగిపోయాయో అర్ధమవుతుంది. అయితే ఈ మూడురోజులతో పెద్ద పందాలు ఆగిపోతాయన్న ప్రచారం జరిగినా మధ్యతరహా, చిన్నాచితక పందాల మాత్రం దాదాపు ఈనెలంతా సాగుతాయని చెపుతున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలలో గత మూడురోజుల నుండి ప్రతిరోజు ఉదయం నుంచే కత్తులు కట్టిన కాళ్లతో బరిలోకి దిగిన కోళ్లు రెక్కలు విప్పి పందెగాళ్ల దుమ్మురేపాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈవిడత పోలీసులు చేష్టలుడిగి ఉండిపోవటంతో నిర్వాహకులు, పందెగాళ్లు పేట్రేగిపోయారు. ఇక ప్రజాప్రతినిధులు చాలామంది తమ అధికారదర్పాన్ని ప్రదర్శించి దర్జాగా వీటిని వీక్షిస్తూ గడిపారు. మొత్తంమీద పందెం కోళ్లు లేపిన దుమ్ముకు పశ్చిమగోదావరి జిల్లా మొత్తం కదనరంగంగా మారిపోయింది. డెల్టా ప్రాంతంలో నిర్వాహకులు మీసం మెలెస్తే, మెట్ట ప్రాంతంలో కూడా ఆటగాళ్ల హవాకు అడ్డులేకుండా పోయింది. ప్రధానంగా ఈ పందాలకు డెల్టా ప్రాంతం కేంద్రంగా నిలవగా, మెట్టలోనూ దానికి దీటుగానే పందాలు నిర్వహించారు. మెట్ట ప్రాంతంలో భారీ పందాలతోపాటు చిన్న,మధ్యతరహా పందాలు జోరుగా సాగగా డెల్టాలో మాత్రం పందాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. స్వయంగా ప్రజాప్రతినిధులే ఈ ప్రాంతంలో కోడిపందాలను పర్యవేక్షించటం విశేషం. అనధికార వౌఖిక ఆదేశాలు అందాయని పోలీసుశాఖలోనే ప్రచారం జరగటంతో మూడురోజులపాటు పందాల నిర్వహణకు ఏవిధమైన అభ్యంతరాలు చెప్పవద్దంటూ ఆదేశాలు రావటంతో భోగి ఉదయం నుంచి పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయటం మానివేసింది. భోగి రోజు ఉదయం నుంచి పొరుగు జిల్లాల పందెగాళ్లు పశ్చిమగోదావరి జిల్లాకు వస్తూనే ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పొరుగుజిల్లాలు ఖమ్మం, కృష్ణా, తూర్పుగోదావరి ప్రాంతాల నుంచి అతిధులు హాజరయ్యారు. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో గత మూడురోజులుగా నిర్వహించిన పెద్ద పందాల వద్ద కనీసం పది నుంచి 20వేల మంది వరకు ప్రజలు హాజరై సినిమా షూటింగ్‌లను మరిపించారు. సంప్రదాయకంగా వస్తున్న పేరుమీద కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారినా దానికి మించి పేకాట, ఇతర జూదాలపై కూడా పందాలు సాగాయి. లోపు, బయట, గుండాట, కోతాట ఇలా అనేక రకాల జూదాలు కూడా పందెం జరిగే ప్రాంతాలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. వీటి వద్ద కూడా అధికసంఖ్యలో ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జువ్వలపాలెం, కలగంపూడి, ఐ భీమవరం, భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆకివీడు, గణపవరం, నిడమర్రు, తాడేపల్లిగూడెం, పెదవేగి, లింగపాలెం, ములగలంపాడు, కొణిజెర్ల, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలతోపాటు ఏజన్సీ మండలాల్లో కూడా భారీఎత్తున కోడిపందాలు సాగాయి. సందేట్లో సడేమియాగా అర్ధరాత్రి సమయాల్లో అశ్లీల నృత్యాల జోరు సాగిపోయింది. ఇక ఈ మూడురోజులు మద్యం పరవళ్లు తొక్కింది. ఎక్కడ చూసినా బెల్టుషాపులు ఏర్పాటుచేసి కావాల్సినంత మద్యాన్ని సరఫరా చేశారు.

కరెన్సీ కట్టలే కట్టలు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 15: నల్లధనాన్ని బయటకు తీయటం ఎలా అన్న అంశంపైనే దేశవ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతుండటం తెల్సిందే. కానీ ఈ అంశాన్ని పశ్చిమగోదావరి పందాల పేరుతో ఇట్టే పరిష్కరించిందనే చెప్పుకోవాలి. గతంలో ఏనాడు లేని రీతిలో ఈ ఏడాది పందాలు కోట్లకు పడగలెత్తగా దాదాపు ఆ సొమ్ము అంతా నల్లధనంలో కొంత భాగమనే చెపుతున్నారు. ఈరకంగా మరో రెండురోజుల పాటు పందాల జాతర కొనసాగితే కళ్లు చెదిరే రీతిలో నల్లధనం వెలుగుచూడక తప్పదని చెపుతున్నారు. గత మూడురోజులుగా ఎక్కడ చూసినా నోట్ల కట్టలే. గెలుపే ధ్యేయంగా పందేగాళ్లు నోట్లను వెదజల్లేరు. కోడిపందాలు, కోతాట, పేకాట, గుండాట, మద్యం... ఇలా అన్నివిధాలా ధనలక్ష్మి చేతులు మారింది. ఈ ధనప్రవాహం కొన్ని జీవితాలకు అనందం పంచగా మరికొందరికి మాత్రం తీరని విచారాన్ని మిగిల్చింది. సంప్రదాయం ముసుగులో అన్ని వ్యసనాలను ఒకేచోట నిర్వహించటం ద్వారా చాలామంది నిర్వాహకులు లక్షాధికారులయ్యారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్దితుల కారణంగా ఈసారి సంక్రాంతి జూదం భారీస్ధాయిలోనే జరుగుతుందని ముందస్తు అంచనాలున్నప్పటికీ దాన్ని మించి కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. ఖాకీలు చేష్టలుడిగి గమ్మున ఉండిపోవటంతో జిల్లా అంతటా ధనప్రవాహం చోటుచేసుకుంది. భోగి రోజు ఉదయం రిబ్బన్ కటింగ్‌తో ప్రారంభమైన జూద క్రీడ నిర్విఘ్నంగా మూడురోజులపాటు కొనసాగింది. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల సారధ్యంలో, మరికొన్నిచోట్ల స్ధానికంగా పలుకుబడి ఉన్న నేతల నాయకత్వంలో పందాలు కొనసాగాయి. తొలుత వేలల్లో ప్రారంభమైన పందాలు క్షణంక్షణం గడుస్తున్న కొద్ది లక్షలు, కోట్లకు కూడా చేరిపోయింది. 1000, 500 నోట్లతోనే పందాలు అన్నీ దాదాపుగా కొనసాగాయంటే ఆతిశయోక్తి కాదు. ఈ మూడురోజులు ఎటిఎం కార్డులకు కూడా క్షణం తీరికలేకుండా పోయింది. పదివేలు తీసుకువెళ్లటం అది కాస్తా పోతే మరోసారి ఎటిఎం సెంటరుకు పరిగెట్టడంతోనే చిన్నపాటి పందెగాళ్లు అలసిపోయారు. దీంతో కొన్ని ఎటిఎంలు భోగి రోజు తర్వాత పనిచేయటం మానివేశాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతిఒక్కరిలోనూ కసి పెరిగిపోయి ఎలాగైనా సరే ఈసారి భారీమొత్తం సంపాదించాలన్న తాపత్రయం కన్పించింది. ఇక మోతుబరులు, బడాబాబులు సంచిల కొద్ది నల్లధనాన్ని పందెం బరులకు తరలించారు. కాస్తే లక్ష అన్నట్లుగా పందాల జోరును పెంచేశారు. మరోవైపు నకిలీ నోట్లు కూడా ఈసారి బాగానే చేతులు మారాయని భావిస్తున్నారు. వెయ్యి, అయిదువందల రూపాయలతోనే పందాలు సాగటంతో వాటికి సంబంధించిన నకిలీ నోట్లను భారీగా చలామణి చేసారన్న ప్రచారం జరిగింది. పందెగాళ్లు హోరు మరింత జోరుగా సాగిపోవటంతో కొన్నిచోట్ల నిర్వాహకులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా పందాల కోసం నోట్ల కట్టలు వెదజల్లటంతో వాటిని లెక్కపెట్టి తీసుకోవటం కష్టసాధ్యంగా మారింది. గత ఏడాది ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్న నిర్వాహకులు ఈసారి దీనికి కూడా పరిష్కారాన్ని చూసుకున్నారు. నోట్ల లెక్కింపు యంత్రాలను ఏర్పాటుచేశారు. అయితే రకరకాల నోట్లు ఒక్కసారిగా మీదపడటంతో వాటిని లెక్కించటం తప్ప అవి అసలా, నకిలా అన్న తేడాను తేల్చలేకపోయారు. అయితే యధావిధిగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నల్లధనం ఒకవైపు, నకిలీనోట్లు మరోవైపు కోడిపందాల్లో దర్శనమిచ్చాయి.
కోట్లలో అసలీ పందాలు
వీరవాసరం, జనవరి 15: వీరవాసరంలో జరుగుతున్న రాష్టస్థ్రాయి అసలీ (డింకి) కోడి పుంజుల పందాల పోటీలు మంగళవారం తారాస్థాయికి చేరుకున్నాయి. ఆఖరి రోజు రూ.2కోట్ల వరకు పందాలు జరగడంతో గ్రామస్థులు నివ్వెరపోయారు. ముంబాయి, ఒరిస్సా, ఛత్తీస్‌ఘ్ఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి పందెగాళ్లు తరలి రావడంతో వీరవాసరం గ్రామస్థుల్లో ఆశ్చర్యం వ్యక్తమయింది. ఏటా నిర్వహించే కత్తికోడి పందాలు మాదిరిగానే ఈ పందాలు నిర్వహిస్తారని తొలిరోజు అందరూ భావించారు. అయితే కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించడం చూడటానికి, పందెంలో పాల్గొనడానికి ఆరు రాష్టల్ర నుండి పందెగాళ్లు రావడంతో ఆశ్చర్యం కలిగింది. చివరకు గెలిచిన పందెగాళ్లకు బహుమతులు సైతందజేయండం విశేషం.వీరవాసరం ఎల్లమ్మ చెరువుగట్టు వెనుక భాగం వైపు జోరుగా నిర్వహించిన ఈ పందాల్లో పాల్గొన్నవారు 95 శాతం ఇతర రాష్టల్ర నుండి వచ్చిన వారే. వీరవాసరం గ్రామానికి చెందిన నక్కెళ్ల కృష్ణారావుకు 50 సంవత్సరాలుగా కోడిపందాల్లో అనుభవం ఉంది. ఈ పందాలకు అయిదారు రాష్ట్రాల ప్రజలతో సంబంధాలు ఉండటంతో ఈసారి సంక్రాంతి సమయంలో జరిగే పోటీలు వీరవాసరంలో నిర్వహించడానికి అనుమతి సంపాదించారు. ఈ పందాల్లో కోళ్లకు కత్తులు కట్టకుండా బరిలోకి వదులుతారు. ఒక్కొక్క పందెం సుమారు 2నుండి 4 గంటల వరకు సమయం పడుతుంది. ఆఖరి రోజున నిర్వాహకుడు వెంకట్‌కు చెందిన కోడిపుంజు గెలిచింది. దీనిపై రూ.15లక్షలు వరకూ పందం జరిగినట్లు సమాచారం. ఒరిస్సా, కలకత్తా, ఛత్తీస్‌ఘడ్, చెన్నై, మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ల మధ్య సుమారు రూ.2కోట్లు పందాలు జరిగాయి. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద 30 కాసుల బంగారాన్ని బహుమతులుగా అందజేశారు.

ఎర్రకాలువలో ఇద్దరు చిన్నారుల గల్లంతు
చాగల్లు, జనవరి 15: నిడదవోలు శివారు ఇందిరానగర్ కాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు సమీపంలోగల బసివిరెడ్డిపేట ఎర్రకాలువలోకి ఈతకెళ్ళి గల్లంతైన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలావున్నాయి. 10వ తరగతి చదువుతున్న అంబటి కుమార్ (15), 8వ తరగతి చదువుతున్న సారిక ప్రవీణ్ (13) మంగళవారం మధ్యాహ్నం ఎర్రకాలువలోకి ఈతకెళ్ళారు. కాలువ ప్రవాహంలో కొట్టుకుని పోతున్న వీరిని సమీపంలో ఉన్నవారు గమనించి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అంబటి కుమార్ తండ్రి జీవన్‌బాబు ఫిర్యాదుమేరకు నిడదవోలు ఎస్‌ఐ శ్యామ్‌సుందర్ కేసు నమోదుచేసి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో గాలింపుచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పర్వదినాన ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

పెదవేగి మండలంలో పండగే పండగ!
పెదవేగి, జనవరి 15 : మండలంలో పందెం రాయుళ్లకు పండగే పండగ. పోలీసుల భయం లేకుండా కోడిపందాలు జరగడం వారి ఆనందానికి హద్దులే లేవు. మండలంలో ముఖ్యంగా కొప్పాక, జానంపేట, కవ్వగుంట, లక్ష్మీపురం, కూచింపూడి, రామశింగవరం, వేగివాడ తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన అతిధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొప్పాకలో ప్రజాప్రతినిధి నిర్వహించిన పందాల్లోనే 40 కోట్లు చేతులు మారాయి. మద్యం ఏరులై పారింది. గుండాట, కోతముక్క, చిత్తులాటలతో బిరులు బిజాగా నడిచాయి. పలావు సెంటర్లు, కోడి పకోడి, చిరు తిండ్లు ప్రేక్షకులకు అందుబాటులో వున్నాయి. కొప్పాకలో జరిగిన పందాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వి ఐపిలు, ఎన్‌ఆర్ ఐలు, మహిళలు హాజరయ్యారు. ఇక విఐపి పాస్‌లు కూడా జారీ చేశారు. మంగళవారం జరిగిన పందాలకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, వెంకటగిరి ఎమ్మెల్యే జి రామకృష్ణ, తదితర ప్రముఖులు హాజరయ్యారు. మూడు రోజుల నుంచి కోడిపందాలు విచ్చలవిడిగా జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచే స్పందించడం ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల వరకే పండుగ పర్మిషన్ వుందని, ఆపై పందాలు వేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినా భేఖాతరు చేయలేదని, కొప్పాకలో ఎమ్మెల్యే నిర్వహిస్తున్న పందాల స్థావరంపై పెదవేగి పోలీసులు దాడి చేశారు. వీరికి ప్రముఖులెవ్వరూ తారసపడలేదు కానీ కొప్పాక గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు, రెండు కోళ్లు దొరికాయి. వీరిని అదుపులోకి తీసుకుని వారిపై జంతువులు, పక్షుల హింసా నేరం కేసు నమోదు చేస్తున్నామని ఎస్ ఐ బి మోహనరావు తెలిపారు.

ఒకరి మరణవార్త విని మరొకరుగా ముగ్గురు మృతి!
-స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక మరొక యువకుడు, మనుమడి మృతి తట్టుకోలేక అమ్మమ్మ
ఆకివీడు, జనవరి 15: ఒకరి మరణం తర్వాత మరొకరు, ఆ తర్వాత మరొకరు ఇలా ముగ్గురు కొద్ది గంటల వ్యవధిలో మృతిచెందటం ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. సంక్రాంతి పండుగ రోజునా మృతుల ముగ్గురి కుటుంబీకులు, బంధువులు, మిత్రుల రోదనలతో ఆకివీడు దద్దరిల్లిపోయింది. స్థానిక మాదివాడకు చెందిన బొల్లం భోగన్న (35) సంక్రాంతికి నిర్వహించిన ఓ జూద క్రీడలో మరొక వ్యక్తితో వివాదం ఏర్పడింది. వీరిరువురి మధ్యా వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దీనితో భోగన్న అస్వస్థతకు గురయ్యాడు. ఇతనిని వెంటనే భీమవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనతో అతని మిత్రులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇతని మృతదేహాన్ని సోమవారం రాత్రి ఆకివీడుకి తీసుకొచ్చారు. ఇతనికి మిత్రుడైన ఎ సూరిబాబు ఈ సంఘటన తెలిసిన వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. అతడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించేటప్పటికే గుండెపోటుతో మరణించాడు. దీనితో సాన రుద్రవరానికి చెందిన ఇతని అమ్మమ్మకు ఫోన్‌చేసి మనవడి మరణవార్తను తెలియజేశారు. దీనితో ఆమెకూడా మనవడి మరణవార్తను జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందింది. ఈ ముగ్గురి మరణం ఆయా కుటుంబాల్లో విషాదం నింపడంతోపాటు ఆకివీడులో సంచలనం రేకెత్తించింది.
ముగిసిన జూదాల జాతర
భీమవరం, జనవరి 15: సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న జూదాల జాతర మూడవ రోజైన మంగళవారంతో ముగిశాయి. ఈ పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడి పందాలతోపాటు పేకాట, గుండాటలు సైతం యథేచ్ఛగా కొనసాగాయి. డెల్టాలోని భీమవరం ప్రాంతంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కోడి పందాలను వీక్షించడానికి భారీ సంఖ్యలో పందెం రాయుళ్లు భారీ సంఖ్యలో విచ్చేశారు. కోడి పందాలతోపాటు మద్యం విక్రయాలు జోరుగానే సాగాయి. ఈ పందాలను తిలకించేందుకు వేలాదిమంది కార్లలోనూ, ఆటోలోనూ అలాగే మోటార్ సైకిళ్లు, ద్విచక్ర వాహనాలతో తరలిరావటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఒక్కొక్క పందానికి లక్షలాది రూపాయలు చేతులు మారాయి. మహిళలు, యువతులు సైతం అధిక సంఖ్యలో విచ్చేసి కోడి పందాలు తిలకించారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాట తదితర వాటిపై కూడా పందెం రాయుళ్లు ఆసక్తి చూపారు. ఈ పందాల్లో కూడా భారీ స్థాయిలోనే సొమ్ములు చేతులు మారినట్టు తెలిసింది. జిల్లా నుండే కాక ఇతర రాష్టల్ర నుండి సైతం భారీ సంఖ్యలో పందెం రాయుళ్లు హాజరుకావడం విశేషం.
ఆకివీడు మండలంలో...
ఆకివీడు: సంక్రాంతి కోడిపందాలకు తెర పడింది. మూడురోజుల పాటు జరిగిన మంగళవారం సాయంత్రం నాటితో ముగిసింది. అనధికారంగా ఇచ్చిన అనుమతులతో ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో పందెం కోళ్లు భారీగా తలపడ్డాయి. పోటీ తిలకించేందుకు ప్రజాప్రతినిధులు పాతపాటి సర్రాజు, చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, కామినేని శ్రీనివాస్, పసల కనకసుందరావులతో పాటు పలువురు ప్రముఖులు కోడిపందాలకు హాజరై వారికి ఉన్న మక్కువను చాటుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాల నుండి ఈ ప్రాంతాలకు మహిళలు, ప్రముఖులు తరలివచ్చారు. కోడిపందాలు నిర్వహించిన ఐ భీమవరం ప్రాంతం వేలాదిమంది ప్రజలతో కిక్కిరిసిపోయింది. పోటీల్లో పాల్గొనడానికి వచ్చేవారికి మద్యం, పలావ్, మాంసం పకోడిలతో పాటు పలు వంటకాలు అమ్మకందారులు అమ్మేందుకు ఎగబడ్డారు. మంగళవారం సాయంత్రంతో జూదాలు, పందాలు నిర్వహించే ప్రాంతాలకు పోలీసులు ముందుగా సమాచారం అందించి వౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీనితో షామియానా తొలగింపు ప్రారంభించారు.
యలమంచిలి మండలంలో...
యలమంచిలి: యలమంచిలి మండలంలో సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు కోడిపందాలు భారీస్థాయిలో సాగాయి. మొదట అనుమతి లేదంటూనే పోలీసులు అనధికారికంగా అనుమతించడంతో పందాలు జోరందుకున్నాయి. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్వగ్రామమైన యలమంచిలి మండలం కలగంపూడిలో పందాలు భారీ స్థాయిలో జరగడం విశేషం. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పందెంరాయుళ్లు హాజరయ్యారు. బరులకు సమీపంలోనే వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఎండిపోయిన రొయ్యల చెరువుల్లో సర్కస్ గుడారాల్లా షామియానాలు ఏర్పాటుచేసి, సకల సౌకర్యాలతో నిర్వాహకులు పందాలు నిర్వహించారు. పందాలకోసం వచ్చిన వారికి తినుబండాలతోపాటు మద్యం దుకాణాలు కూడా అందుబాటులో ఉంచారు. గుండాట తదితర జూదాల్లో పలువురు డబ్బును పోగొట్టుకున్నారు. కొన్ని గ్రామాల్లో గుండాటలు స్వయంగా ప్రజాప్రతినిధులే ఆడించడం గమనార్హం. మండల కేంద్రమైన యలమంచిలిలో పోలీస్ స్టేషన్‌కు సమీపంలో కోడి పందాలు, పేకాట జోరుగా సాగాయి. కాజ, కొంతేరు, యలమంచిలి, మేడపాడు, దొడ్డిపట్ల, వడ్డిలంక, మట్లపాలెం, కట్టుపాలెం గ్రామాల్లో పందాలు జరిగాయి. పోడూరు మండలంలో పోడూరు, గుమ్ములూరు, జిన్నూరు, మట్టపర్రు, తూర్పుపాలెం, పండితవిల్లూరు గ్రామాల్లో కోడి పందాలు జోరుగా సాగాయి.
ఉండి మండలంలో...
ఉండి: మండలంలోని చినపుల్లేరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణ మంగళవారం కోడి పందాలు, గుండాటలకు వేదికగా మారింది. పందెం రాయుళ్లు పవిత్ర స్థలమైన విద్యాసంస్థ ప్రాంగణానే్న ఎంచుకోవటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యాశాఖాధికారులు గానీ, ఉపాధ్యాయులుగానీ తమ పాఠశాల ప్రాంగణంలో గుండాటలు ఆడవద్దని చెప్పకపోవటం పందెం రాయుళ్లకు అలుసుగా కనిపించింది. మంగళవారం మండలంలో యండగండి, మహాదేవపట్నం, ఉండి, కోలమూరు గ్రామాల్లో పెద్దఎత్తున కోడి పందాలు నిర్వహించారు. వేలాది రూపాయలు చేతులు మారాయి. యండంగండిలో నిర్విరామంగా పేకాటలో కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ రాత్రీంబవళ్లు తేడా లేకుండా జూద క్రీడలు నిర్వహించారు.
ఏజెన్సీ, మెట్టలో...
జంగారెడ్డిగూడెం: సంక్రాంతి, కనుమ పండుగ రోజులైన సోమ, మంగళవారాల్లో కోడి పందాలు, జూదాలు ఏజన్సీ, మెట్ట ప్రాంతాలలో జోరుగా సాగాయి. మండలంలోని శ్రీనివాసపురంతో పాటు లక్కవరం, పేరంపేట, ఎ.పోలవరం, చక్రదేవరపల్లి, కేతవరం గ్రామాలలో కోడిపందాలు జోరుగా జరిగాయి. శ్రీనివాసపురం బరిలో ఎంపిటిసి సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు పోల్నాటి బాబ్జి ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు కోడిపందాలు తిలకించారు. డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు, మహాత్మా జ్యోతిరావుఫూలే అవార్డు గ్రహీత డికెడి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు మల్లాబత్తుల మునేశ్వరరావు మంగళవారం కొద్దిసేపు కోడి పందాలు తిలకించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు పందాల బిరుల్లో సందడి చేసారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి మూడు రోజులు కోడిపందాల్లో పాల్గొనడం కూడా సంప్రదాయంగా భావిస్తున్నామని పలువురు నాయకులు చెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన పందాలరాయుళ్ళు స్థానిక బృందాలను ఎదుర్కొన్నారు. 50వేలకు పైబడి జోడీ పందాలు నిర్వహించారు. సామాన్యులు తెచ్చుకున్న కోడి పుంజులు వేరే బరిలో పందెం వేసారు.
ఈ సారి కూడా పందాల్లో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. మండలంలోని లక్కవరంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో కోడి పందాలు భారీ ఎత్తున నిర్వహించారు. లక్కవరం కోడిపందాలతో పాటు పేకాట, గుండాట జూదాలు, మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. ఈ సారి పందాలు ఎక్కడపడితే అక్కడ జరగడంతో పలు బరుల్లో జనం పలుచబడ్డారు. అయినప్పటికీ మూడు రోజుల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కనుమ రోజుతో పందాలకు పోలీసులు ముగింపు పలికారు. బుధవారం నుండి పందాలు నిర్వహిస్తే సహించేది లేదని పోలీసు అధికార్లు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
జీలుగుమిల్లి మండలంలో....
జీలుగుమిల్లి: సంక్రాంతి సందర్భంగా సోమ, మంగళ వారాలలో మండలంలోని ప్రతి గ్రామంలోను కోడి పందాలు జోరుగా జరిగాయి. రాచన్నగూడెం, ములగలంపల్లి, పి.రాజవరం, అంకన్నగూడెం గ్రామాలలో ఒక మోస్తలు పందాలు జరగ్గా, మిగతా గ్రామాలలో చిన్నా చితకా పందాలు నిర్వహించారు.

కేంద్ర మంత్రి
english title: 
wg

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>