Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చంద్రబాబుకు సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి బహిరంగ లేఖ

$
0
0

విశాలాక్షినగర్, జనవరి 16: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు వి.సుమంత్, రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్, రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవింద, రాష్ట్ర జాయింట్ కన్వీనర్ అట్టాడ అవినాష్‌లు బుధవారం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన సీమాంధ్ర ప్రాంతంలో మీకోసం వస్తున్నా యాత్ర చేరకముందే మీ నిర్ణయం తెలియజేయాలని డిమాండ్ చేసారు. సీమాంధ్ర, తెలంగాణా రెండు కళ్ళు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తెలంగాణా అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. ఈ నిర్ణయం పట్ల తెలుగుజాతి క్షమించదు అని చరిత్రహీనులుగా మిగులుతారని లేఖలో జెఎసి పేర్కొంది.

సమైక్యాంధ్ర శాంతిర్యాలీ ప్రారంభం
* రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన
విశాలాక్షినగర్, జనవరి 16: తెలంగాణా నాయకులు గాంధేయమార్గాన్ని అనుసరించాలని కోరుతూ సమైక్యాంధ్ర ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో సీతమ్మధార షిరిడీసాయి దేవాలయం వద్ద నుంచి శాంతి ర్యాలీ మొదలైంది. ఈ ర్యాలీని సమైక్యాంధ్ర ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు జిఎ.నారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం గురించి పోరాటం చేయడానికి శాంతి మార్గాన్ని అవలంబించాలని ఆకాంక్షించారు. ఉద్యమం ద్వారా ప్రజలకు మంచి జరగాలే తప్ప చెడు జరిగేటట్లు టిఆర్‌ఎస్ ప్రవర్తించడాన్ని తప్పుపట్టారు. గతంలో జరిగిన విధ్వంసాల వలన రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని గుర్తు చేసారు. ఉద్యమాల వలన విద్యార్థులు పోటీపరీక్షల్లో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తపరిచారు. హింసాయుత మార్గాన్ని టిఆర్‌ఎస్ విడనాడాలని కోరారు. ప్రజలు సహనం పాటించాలని అన్నారు. గాంధేయ మార్గానికి విలువనిచ్చి రాష్ట్రం చిన్నాభిన్నం కాకుండా కాపాడాలని ప్రజలందరినీ ఏకతాటిపైకి తేవడానికి రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీని చేపడతామన్నారు. ఈ ర్యాలీలో సమితి నాయకులు వి.శ్రీనివాసరాజు, కేదార లక్ష్మి, బి.శ్రీదేవి, ఉమ్మిడి భాస్కరరావు, ఎన్.శ్రీరామమూర్తి, విద్యార్థులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

వుడాకు ఐఎస్‌ఓ గుర్తింపు

విశాఖపట్నం (జగదాంబ), జనవరి 16: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నగర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలనాపరమైన అవసరాలన్నింటిని గుర్తించి కంప్యూటరైజేషన్ చేయడంతో ఎట్టకేలకు వుడాకు ఐఎస్‌ఓ సర్ట్ఫికేట్ లభించింది. అంతే కాకుండా వినియోగదారులకు పారదర్శకతతో మెరుగైన సదుపాయాలు అందించడం, వుడా వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయి సమాచారాన్ని పొందుపర్చడం, నగరంలోనే కాకుండా ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఎల్‌ఆర్‌ఎస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కంప్యూటరీకరించిన ధృవపత్రాలను అందజేయడం, విసితో ముఖాముఖి, సకాలంలో అందించే సేవలు, పలు నూతన సంస్కరణలకు వుడా విసి కోన శశిధర్ చేసిన సేవలను గుర్తించి ఈ సర్ట్ఫికేషన్ లభించింది. అయితే ఈ ఐఎస్‌ఓ సర్ట్ఫికేట్‌ను బుధవారం రాజధానిలో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి ఎన్.మహీధర్‌రెడ్డి చేతుల మీదుగా వుడా విసి కోన శశిధర్ ఐఎస్‌ఓ-9001 సర్ట్ఫికేట్‌ను అందుకున్నారు. నగర ప్రజల సంక్షేమం కోసం పలు నూతన ప్రాజెక్టుల రూపకల్పనతో ముందుకు వెళుతున్న వుడా మరిన్ని మంచి సర్ట్ఫికేట్‌లను పొందాలని ఆకాంక్షించారు.

అత్యాచారాలు అరికట్టాలంటూ మహిళాసంఘాల ఆందోళన

విశాఖపట్నం (జగదాంబ), జనవరి 16: మహిళలపై నానాటికి పెరుగుతున్న దాడులను అరికట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని మసిళా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రాయగడ హత్యాచార బాధితురాలి మృతదేహం వద్ద మహిళా సంఘాలు బుధవారం ఆందోళన చేపట్టాయి. చట్టాలు పటిష్టంగా అమలుపర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎపి మహిళాసమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల ఆరోపించారు. సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నాన్ బెయిల్ కేసులు బనాయించాలని ఆమె డిమాండ్ చేసారు. దాడులకు పాల్పడుతున్నవారిపై చర్యలు చేపట్టే నిమిత్తం రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఢిల్లీ ఘటన బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతోందని విమర్శించారు. గాజువాకలోని బబిత ఘటన తీవ్ర అమానుషమని, ఆమె ఆవేదన వెలిబుచ్చారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం అసమర్థ చర్యను ఖండిస్తున్నామని మహిళా చేతన్ నాయకురాలు కె.పద్మశ్రీ అన్నారు. మహిళలను ఆట వస్తువుగా పరిగణించడం, అశ్లీల సాహిత్యంను పెంచి పోషించడం సరికాదన్నారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఐద్వా నాయకురాలు సంతోషి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి మహిళా సమాఖ్య నగర అధ్యక్షురాలు బి.పరమేశ్వరి, రమణమ్మ, స్ర్తి శక్తి నుంచి లలిత, విరసం నేత క్రిష్ణబాయి, వైఎస్సార్‌సిపి మహిళా విభాగం నాయకురాలు కమలకుమారి, ప్రజాసంఘాల నాయకులు పివి.రమణ, జివి.రత్నం, నిర్మల, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

వరుస హత్యలు..
పారిశ్రామిక వాడ జనంలో ఆందోళన

గాజువాక, జనవరి 16: వరుసగా జరుగుతున్న దారుణ హత్యలతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రేమించలేదని కొందరు.. అక్రమ సంబంధం కొనసాగించలేదని మరికొందరు..డబ్బు కోసం ఇంకొందరు హత్యలు చేసిన సంఘటనలు గాజువాక ప్రాంతంలో అధికంగా వినిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం గాజువాక సమీపంలో కైలాస్‌నగర్‌లో గల ఒక బ్యూటీ పార్లర్‌లో మేనమామే కసాయిగా మారి 19 ఏళ్ల యువతిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. వారం రోజుల వ్యవధిలో గాజువాక ప్రాంతంలో రెండు హత్యలు ఒకే విధంగా జరిగాయి. అక్రమణ సంబంధం కొనసాగించక పోవడం, ఆర్థిక పరమైన లావాదేవీలు బెడిసి కొట్టడంతో ఈ నెల 9వ తేదీన గాజువాక సమీపంలో గల బొజ్జన్నకొండ ప్రాంతంలో దేవి అనే ఒక వివాహితను అప్పలనాయుడు అనే వ్యక్తి కిరాతకంగా నరికి హత్య చేశాడు. ఈ రెండు సంఘటనలు గాజువాక ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గాజువాక ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిలో అత్యధికంగా కార్మికులే. నిత్యం కష్టపడి పని చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. మనుసుల మధ్య తిరుగుతున్న ఏ మృగం వారి పిల్లలను కాటు వేస్తాయన్న ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు గాజువాక ప్రాంతంలో ఇటీవలే అధికమయ్యాయి. జరుగుతున్న సంఘటనలపై పోలీస్ ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక ప్రాంతంలో ఇటీవల విద్యా సంస్థలు అధికంగా వెలిశాయి. వేలామంది విద్యార్ధినులు నేడు గాజువాక ప్రాంతంలో విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలలకు వచ్చే విద్యార్ధినుల వెంట కొంత మంది పోకిరీలు ప్రేమించుమంటూ వెంట తిరుగుతున్నారు. అటువంటి వారిపై నిఘా పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అలాగే జరుగుతున్న సంఘటనుల దృష్ట్యా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించక పోవడం మరో నేరస్థుడుకి అవకాశం ఇచ్చే విధంగా ఉందన్న భావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ఒకటి నమోదు అయింది. డబ్బు కోసం డ్రైవరే యజమానిని హత్య చేసిన సంఘటన మరొకటి మల్కాపురంలో చోటు చేసుకుంది. ఇటువంటి సంఘటనులు రోజురోజుకు పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న తరుణంలో పోలీస్ వ్యవస్థ వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రధానంగా మనుసుల మధ్య తిరిగే మానవ మృగాల పట్ల మహిళలను కాపాడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. దీంట్లో భాగంగా కళాశాలల్లోను, మహిళా సంఘాల సమావేశాల్లోను పోలీసులు మానవ మృగాల తీరుపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కసాయి వేటుకు మరో కొంత మంది అమాయక మహిళలు బలి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను మహిళా సంఘాలు కోరుతున్నాయి.

జివిఎంసిలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇక తెలుగులోనే!
* వాహనాల నెంబర్ల ఫలకాలు తెలుగులోనే...

విశాఖపట్నం (జగదాంబ), జనవరి 16: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) ప్రధాన కార్యాలయంలో జరిపే అన్ని ఉత్తర, ప్రత్యుత్తరాలు, ఫైళ్ళు ఇక నుంచి తెలుగులోనే నిర్వహించాలని కమిషనర్ ఎంవి.సత్యనారాయణ పేర్కొన్నారు. జివిఎంసి పరిధిలో ఉన్న అన్ని కార్యాలయాల పేర్లు, వాహనాల నెంబర్లు ఫలకాలు తెలుగులోనే ఉండాలన్నారు తెలుగుకు ప్రాధాన్యత నివ్వడమే మన ముఖ్య లక్ష్యమన్నారు. సోమవారం ఉదయం తన ఛాంబర్‌లో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముడసర్లోవ వద్ద బొటానికల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి ఔషధమొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసమై విశాఖపట్నం పోర్టుట్రస్ట్ కొంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం పట్ల హర్షం ప్రకటించారు. అదే విధంగా సమర్థ నిర్వహణ, అక్రమణల తొలగింపు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. మురికివాడల వాసులకు గృహ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇందుకోసం ఎనిమిది ప్రాంతాల వారికి గృహాలు నిర్మించడానికి 15.53 ఎకరాలు గుర్తించామన్నారు. ఫ్లైఓవర్, బిఆర్‌టిఎస్ వివిధ తాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీర్ బి.జయరామిరెడ్డిని సూచించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలని, పిన్‌పాయింట్ శానిటేషన్, డిస్పెన్సరీలకు మందుల సరఫరా, పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా వినియోగించుకోవాలని ప్రధాన వైద్యాధికారి పివి.రమణమూర్తిని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలు వ్యయం, పరిపాలనాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది, వాహనాలను అవసరమైన చోట, అవసరమైన వారికి కేటాయించాలని అదనపు కమిషనర్ (జనరల్) కె.రమేష్‌కు సూచించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు బి.సన్యాసినాయుడు, శ్రీనివాస్, విశ్వనాధం, శివాజీ, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

20న తెలంగాణా భవన్ ముట్టడి
* పలు జెఎసి నాయకుల హెచ్చరిక

విశాలాక్షినగర్, జనవరి 16: పదే పదే సీమాంధ్ర ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని తెలంగాణాభవన్ వేదికగా చేసుకొని కించపరుస్తున్న కెసిఆర్ దోపిడీ జెఎసికి బుద్ధి చెప్పాలని ఛలో హైదరాబాద్ మేరుతో తెలంగాణా భవన్ ముట్టడి చేపట్టినట్లు పలు జాయింట్ యాక్షన్ కమిటీలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ అప్పారావు విగ్రహం వద్ద తెలంగాణా భవన్ ముట్టడి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పొలిటికల్ జెఎసి రాష్ట్ర కన్వీనర్ జెటి.రామారావు మాట్లాడుతూ మొన్న మర్రి చెన్నారెడ్డి, నిన్న కెసిఆర్, నేడు కోదండరామ్ ఇలా ప్రతీసారి తెలంగాణావాదుల బెదిరింపులకు హైదరాబాద్‌లో ప్రజలు బ్రతకాలా అని ప్రశ్నించారు. ఇప్పటికీ తెలంగాణా భవన్ స్వాధీనం చేసుకోవాలని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాష్ట్ర హైకోర్టు సూచించినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేటివరకూ సీలు వేయలేక పోయారని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వమే ఏమీ చేయనప్పుడు హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏమీ చేయలేరని టిఆర్‌ఎస్ గర్వపడుతుందన్నారు. దీనితో వారి మద్దతు, సమైక్యవాదుల సహకారంతో లక్షలాదిగా తరలి వెళ్లి తెలంగాణాభవన్‌ను స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పజెప్పడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ సీమంధ్ర ప్రజలపై దురుసు ప్రసంగాలకు వేదికైన తెలంగాణా భవన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 19వ తేదీలోగా నిర్ణయించుకోవాలని కోరారు. లేనిపక్షంలో ముట్టడి తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర స్టూడెంట్ జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు ఆరేటి మహేష్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ రాష్ట్రంలో పెట్టిన చిచ్చువలన విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. ఎపిపిఎస్‌సి, యుపిఎస్‌సి, ఇతర పోటీపరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు శ్రద్ధ చూపకపోవడానికి ఉద్యమాలే కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె.రామచంద్రమూర్తి, లీగల్ కన్వీనర్ పలికా శ్రీరామమూర్తి, కల్చరల్ కన్వీనర్ బొబ్బాది అప్పారావు, వికలాంగ జెఎసి రాష్ట్ర కన్వీనర్ సురేష్‌మీనన్, మహిళా జెఎసి నేతలు చెక్కా రమాదేవి, సమైక్యాంధ్ర దళిత జెఎసి నేత పెద్దాడ రమణ, గ్రేటర్‌విశాఖ బిసి సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు, నాయకులు వజ్రపు లెవియా, నిర్మలారాయ్, గొలగాని లక్ష్మి, మోహనరెడ్డి, దొడ్డిరమణ, గంటా కామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

18న భారతీతీర్థ మహాస్వామి విశాఖ రాక

విశాలాక్షినగర్, జనవరి 16: దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు శంకరాచార్య భారతీతీర్థ మహాస్వామి దక్షిణ భారతదేశ విజయయాత్రలో భాగంగా విశాఖ నగరానికి వస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఎంవిపి కాలనీ టిటిడి కల్యాణమండపంలో ప్రతీ రోజూ నిర్వహించే శారదా చంద్రవౌళీశ్వరుల పూజల్లో శ్రీ భారతీతీర్థ మహాస్వామి పాల్గొని అనుగ్రహభాషణం చేస్తారు. భారతీతీర్థ మహాస్వామి స్వయంగా పూజల్లో పాల్గొని లొకకల్యాణార్థం జరిగే శారదాచంద్రవౌళీశ్వర పూజను నిర్వహించి, భక్తులను అనుగ్రహించి ఆశీర్వదిస్తారని ఆహ్వానసంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డివి సుబ్బారావు, వి.సీతారామయ్య వెల్లడించారు. బుధవారం టిటిడి కల్యాణ మండపంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతీతీర్థ మహాస్వామి పీఠానికి 36వ పీఠాధిపతిగా హిందూధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారని అన్నారు. సుమారు 1300 ఏళ్ళ క్రితం శృంగేరీ పీఠాన్ని జగద్గురు శంకరాచార్యులు స్థాపించిన దగ్గర నుండి పలువురు పీఠాధిపతులు హిందూధర్మం, సంస్కృతి విస్తరణకు తమ బోధనల ద్వారా కృషి చేశారని పేర్కొన్నారు. నాటి నుండి నేటి వరకూ శృంగేరీ పీఠంలో నిరంతరంగా శ్రీ శారదా చంద్రవౌళీశ్వరుల పూజలు జరగడం విశేషమని అన్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం భీమిలి ఆనందవనం పీఠాధిపతి సద్గురు శివానందమూర్తి స్వగృహంలో శ్రీ భారతీతీర్థమహాస్వామి బస చేస్తారు. సాయంత్రం భీమిలి బీచ్ రోడ్డు మార్గంలో ఎంవిపి కాలనీ చేరుకుంటారు. సాయంత్రం ఆరుగంటలకు శ్రీ భారతీతీర్థస్వామికి ఆహ్వాన కమిటీ పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. ఎంవిపి కాలనీలో మేళతాళాలతో వేద సూక్తులతో స్వామికి ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం జరిగే శ్రీ శారదాచంద్రవౌళీశ్వరుల పూజలో స్వామి స్వయంగా పాల్గొని భక్తులకు అనుగ్రహభాషణం చేస్తారు. 19వ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎంవిపి కాలనీ అళ్వార్‌దాస్ క్రీడా మైదానంలో మహాజన సభ జరుగుతుంది. పండితులచే వేదసభ నిర్వహిస్తారు. శృంగేరీ శారదాపీఠ వైభవం గురించి మద్దులపల్లి దత్తాత్రేయశాస్ర్తీ, అయ్యగారి ప్రసన్నకుమార్, గోరుగొంతుల అక్క్భట్ల శర్మ ప్రసంగిస్తారు. అనంతరం భారతీతీర్థస్వామి అనుగ్రహభాషణం ఉంటుంది. 21వ తేదీన సాయంత్రం టిటిడి కల్యాణమండపంలో కవి సమ్మేళనం, గురువందనసభ, అద్వైత భారతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ జరుగుతుంది. సాయంత్రం 7.45 గంటలకు మహాస్వామి అనుగ్రహభాషణం ఉంటుంది. 22 ఉదయం జరిగే పూజల్లో పాల్గొన్న భారతీతీర్థస్వామి మధ్యాహ్నం మూడుగంటలకు అన్నవరం ప్రయాణమవుతారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శృంగేరీమఠం భిక్షావందనం, గురుపాదపూజ, అష్టోత్తరం, వస్తస్రమర్పణ, తిశతి, సహస్రం పూజలు భక్తుల కోసం టిటిడి కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పీఠంలో నిర్వహిస్తామని ఆహ్వాన కమిటీ వెల్లడించింది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీ శారదాచంద్రవౌళీశ్వరుల, జగద్గురు భారతీతీర్థ మహాస్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కమిటీ కోరింది.

పెంచిన విద్యుత్ చార్జీలపై పోరుబాట
* ఎమ్మెల్సీ దాడి పిలుపు
అనకాపల్లి టౌన్, జనవరి 16: సర్‌చార్జీల పేరుతో పలుసార్లు విద్యుత్ చార్జీలు పెంచుతూ వినియోగదారులను రాష్ట్రప్రభుత్వం దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ శాసనమండలి పక్షం నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. ప్రభుత్వ నియంతృత్వ చర్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని, ఈ నిరసనలో రైతుల భాగస్వామ్యం పెరగాలని ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు పిలుపునిచ్చారు. పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ మునగపాక ప్రాంత రైతులు అనకాపల్లి బైపాస్ రోడ్డు జాతీయ రహదారి జంక్షన్‌పై బుధవారం చేపట్టిన ఆందోళనకు ఎమ్మెల్సీ దాడి మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిరసనకారులను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ 2008 సంవత్సరానికి వాడిన కరెంట్‌కు ఇప్పుడు అదనపు చార్జీలువేసి ముక్కుపిండి ప్రజల వద్ద నుండి వసూళ్లు చేస్తున్నారని, ఇది చాలా దారుణమైన చర్య అని, అద్దెకు ఉండే ఇళ్లలో ఖాళీచేసి వెళ్లిపోయిన వారు వాడిన విద్యుత్‌కు యజమానులపై ప్రస్తుతం అదనపు చార్జీలు పడుతున్నాయని, ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వం పిచ్చితుగ్లక్ పాలన చేస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజలు బలవుతున్నారని ఆయన వాపోయారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలంటే రైతులు, ప్రజలు కలసికట్టుగా తిరుగుబాటు చేసిన నాడు ప్రభుత్వాలు దిగివస్తాయని ఎమ్మెల్సీ దాడి అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలు మళ్లీ పెంచాలంటూ ఆదేశాలు అందడంతో అందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా పెంచలేని ధరలకు ఇప్పటినుండే ఆందోళన చేపట్టడం విడ్డూరంగా ఉందనడం ఎంతవరకు సమంజసమని దాడి అన్నారు. ప్రజల నడ్డివిరిచే విద్యుత్ చార్జీలను పెంచేందుకు సిద్ధమవుతూ రైతులను, నాయకులను విమర్శించడం దారుణమని ఆయన పేర్కొన్నారు.

‘సహకార ఎన్నికల్లో వైఎస్సార్
కాంగ్రెస్ గెలుపు తథ్యం’
పరవాడ, జనవరి 16: సహకార సం ఘాల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ విజయఢంకా మోగిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జి ల్లా నేత గండి బాబ్జీ అన్నారు. బుధవా రం పరవాడలో జరిగిన వైఎస్సార్ కాం గ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగంలో నడుస్తున్న సంఘాలకు అధికారుల వినియోగంలో స్వయంప్రతిపత్తి కల్పించే చట్టాలను తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి అధికారాన్ని వినియోగించి రాష్ట్రంలోగల సహకార సంఘాలను అధికార కాంగ్రెస్ పార్టీ చే జిక్కించుకోవాలన్న ఆలోచనతో ఉందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కు తంత్రలు పన్నినా చివరకు విజయం సాధించేది వైఎస్సార్ పార్టీయే అన్నా రు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సహకార ఎన్నికల అనంతరం స్థానిక సం స్థల ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ములేదన్నారు. సహకా ర రంగాన్ని బలోపేతం చేసిన ఘనత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సహకార సంఘాలు ని ర్వీర్యం అయ్యాయన్నారు. అనేక సం ఘాలు మూతపడ్డాయన్నారు. సకాలం లో ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితి అన్నారు. అటువంటి సంఘాలను వైఎస్సార్ గుర్తించి నిధులను కేటాయించడంతోపాటు ఎన్నికల నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు దీటైన అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తారన్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎం పికను కార్యకర్తలకే అప్పగించార న్నారు. గెలిసే అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. లంకెలపాలెం సహకార సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ కైవసం చేసుకునే విధంగా ప్రణాళికలను రూపకల్పన చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనకాపల్లి విద్యుత్ వినియోగదారుల సహకార సంఘం(ఆర్‌ఇసిఎస్) చైర్మన్ చల్లా కనకారావు మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో కష్టించి పనిచేయాలన్నారు. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ గుర్తింపునిస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఇన్‌చార్జి గండి రవికుమార్, పార్టీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు పయిల గోపాలకృష్ణ, చుక్క రా మునాయుడు, సుందరపు అప్పారావు, లాలం ఈశ్వరరావు, ఇల్లపు ప్రసాద్, ప యిల అప్పలనాయుడు (జూనియర్), లాలం ఈశ్వరరావు, కాసు అంజిరెడ్డి, బొండా కనకారావు పాల్గొన్నారు.

టిడిపి ప్రతిష్ఠను పెంచాలి
* జిల్లా కమిటీల్లో యువతకు ప్రాధాన్యత
* సీనియర్లను కలుపుకొని పోవాలి
* రత్నాకర్‌కు చంద్రబాబు ఆదేశం
అనకాపల్లి, జనవరి 16: విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయంపై రత్నాకర్ స్వయంగా ‘మీకోసం యాత్ర’లో ఉన్న చంద్రబాబును మంగళవారం ఖమ్మం జిల్లా కోదాడ సమీపం రాయగూడెంలో కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుతోపాటు మీకోసం యాత్ర లో అప్పలనర్సాపురం నుండి రాయగూడెం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాధాన్యత గల జిల్లా కావడంతో పార్టీలో ఉన్న సీనియర్లను నియమించమని చంద్రబాబుకు రత్నాకర్ వివరించారు. ఈ విషయంపై రత్నాకర్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు తోసిపుచ్చుతూ నువ్వు సీనియర్లను కలుపుకొని వెళ్లగలవని, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తివని గుర్తించి ఈసారి యువతను ప్రోత్సాహించాలనే ఉద్ధేశ్యంతో నిన్ను రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించానని చంద్రబాబు తెలిపారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుని సమర్ధవంతంగా పార్టీకి మంచిపేరు ప్రఖ్యాతలు తేవాలని చంద్రబాబు రత్నాకర్‌కు ఆదేశించారు. బాబు ఆదేశాలు, ఆశీస్సులతో ముందుగా జిల్లా కమిటీ సభ్యులను, అనుబంధ కమిటీ సభ్యులను నియమించిన తరువాత బాధ్యతలు చేపడతానని రత్నాకర్ చెప్పారు.
సమర్థుడైన నాయకుడు రత్నాకర్
విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షునిగా దాడి రత్నాకర్‌ను నియమించినందుకు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు అనకాపల్లి తెలుగుదేశం నేతలు అభినందనలు తెలియజేశారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంతో సమర్ధవంతంగా పార్టీని నడిపిస్తూ అభివృద్ధి పంథాలో నడిపిస్తున్న రత్నాకర్‌కు రూ రల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని వారన్నా రు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డపాటి చినరాజారావు, ప్రధా న కార్యదర్శి అక్కిరెడ్డి రమణబా బు, సిరసపల్లి సన్యాశిరావు, జెర్రిపోతుల ధ ర్మారావు, మాజీ ఎంపిటిసి దాడి పెంటారావు, గొర్లి అప్పలరాజు, రొంగలి శ్రీరామ్మూర్తి, గోవింద పాల్గొన్నారు.

పట్టపగలే దొంగల బీభత్సం
* 56 తులాల బంగారం,
10 తులాల వెండి చోరీ
* సుమారు రూ. 20 లక్షల సొత్తు అపహరణ
సీలేరు, జనవరి 16: సీలేరు మేజర్ పంచాయతీ సీలేరు మెయిన్ బజార్ సమీపంలో పట్టపగలు ఒక ఇంట్లో దొంగలు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 20 లక్షలకు పైగా విలువ చేసే 56 తులాల బంగారు అభరణాలు, వెండి వస్తువులు దొంగలు అపహరించుకుపోయారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్ణపద్మావతి అనే మహిళ తన మనుమడితో కలిసి మెయిన్ బజార్ రోడ్డులో నివాసం ఉంటోంది. ఇంట్లో పెద్దవాళ్ళు లేని విషయం తెలుసుకున్న ఇద్దరు దొంగలు ఇంట్లోకి చాకచక్యంగా ప్రవేశించారు. మనుమడు వంశీ చదువుతుండగా పద్మావతి పక్కనే కూర్చుంది.. ఇద్దరు దొంగలు అకస్మాత్తుగా కత్తులతో బెదిరించి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. వంశీ పీకపై కత్తిపెట్టి పద్మావతి మెడలో ఉన్న గొలుసులు, చేతికి ఉన్న బంగారు గాజులు, సుమారు 56 తులాల బంగారాన్ని దొంగలు లాక్కున్నారు. పద్మావతి నోటికి, చేతులకు కట్లు కట్టి బలవంతంగా ఆమెవద్ద నుండి మరికొన్ని బంగారు నగలు దోచుకున్నారు.. అనంతరం ఇంటి బయట వేచి ఉన్న మరో దొంగ లోపల ఉన్న దొంగలకు ఫోన్ చేసి తలుపు తట్టాడు. బయట వేచి ఉన్న దొంగకు బంగారం ఇచ్చినట్లు బాధితురాలు పద్మావతి పేర్కొంది. అనంతరం భద్రపరిచిన విలువైన పత్రాలు, బాండ్లు, పర్సులో ఉన్న వెండి పట్టీలు దొంగలు పట్టుకుపోయారు. పద్మావతి మనుమడు వంశీ సహాయంతో వేరే గదిలో ఉన్న వస్తువుల వివరాలు తెలుసుకుని వెండి సామగ్రిని దొంగిలించుకు పోయారు. పద్మావతి చేతికి ఉన్న ఉంగరం ఇవ్వమని దొంగలు ఒత్తిడి చేశారు. తన భర్త బతికి ఉన్నప్పుడు ఇచ్చిన ఉంగరమని, దయచేసి దీనిని వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. దీంతో దొంగలు ఉంగరాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు బాధితురాలు పద్మావతి విలేఖరులకు వివరించింది. ఇంట్లోని బీరువాను కత్తులతో తీసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇంకా ఏమి ఉన్నాయని ఆరా తీసిన దొంగలు లక్ష రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలువైన పత్రాలు పట్టుకుపోతున్నామని, లక్ష రూపాయలు నువ్వే ఇస్తావని బెదిరించినట్లు ఆమె విలపించింది. ఈమేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై జి.బాలకృష్ణ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి పద్మావతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలియజేశారు.

కానిస్టేబుళ్ల నియామకానికి ఉచిత శిక్షణ
పాడేరు, జనవరి 16: కేంద్ర ప్రభు త్వం భర్తీ చేయనున్న సి.ఆర్.పి. ఎఫ్., సి.ఐ.ఎస్.ఎఫ్., బి.ఎస్.ఎఫ్., ఐ.టి .బి.పి. లలోని కానిస్టేబుళ్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్న గిరిజన యువకులకు ఈనెల 20వతేదీ నుంచి ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నట్టు పాడేరు పోలీస్ సర్కిల్ ఇ న్‌స్పెక్టర్ గఫూర్ తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మా ట్లాడుతూ దాదాపు 30 వేలకు పైగా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల ఉద్యోగాలలో అధికంగా గిరిజన యువకులకే కేటాయించినట్టు చెప్పారు. ఈపోస్టులకు దరఖాస్తు చేసుకున్న గిరిజన యువకులకు సి.ఆర్.పి.ఎఫ్., పోలీస్ శా ఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి కానిస్టేబుళ్ల ఎంపికకు వారిని సన్నద్ధం చేయనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనే అభ్యర్థులు ఈనెల 19వతేది న పాడేరు పోలీస్ స్టేషన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణకు హాజరయ్యే గిరిజన అ భ్యర్థులు రన్నింగ్ షూలను తమతోపా టు తెచ్చుకోవాలని ఆయన కోరారు. శిక్షణ పొందే వారికి ఐ.టి.డి.ఎ. సహకారంతో భోజన, వసతి సదుపాయాలను కల్పించనున్నామని చెప్పారు.

తీర్థాల్లో జోరుగా మద్యం విక్రయాలు
మాడుగుల, జనవరి 16: మండలంలో మద్యం విక్రయాలు జోరందుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మండలంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సం క్రాంతి తరువాత నుంచి ఈ ప్రాం తంలో జరిగే తీర్థాలకు మద్యం ఏరులైపారుతుంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు సాగుతున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలం వీరవిల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన రావిచెట్టు తీర్థ ంలో బహిరంగంగానే మద్యం విక్రయాలు సాగినా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తీర్థ మహోత్సవాల్లో అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ సి.ఐ. సూర్యారావును వివరణ కోరగా అనారోగ్యం కారణంగా తాను ప్రస్తుతం సెలవులో ఉన్నానని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

‘సహకార ఎన్నికల షెడ్యూల్ మార్పు చేయాలి’
డుంబ్రిగుడ, జనవరి 16: సహకార ఎన్నికల షెడ్యూల్ మార్పు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శెట్టి గంగాధరస్వామి డిమాండ్ చేశారు. డుంబ్రిగుడలో బుధవారం జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార ఎన్నికల షెడ్యూల్‌ను ఈనెల 21వ తేదీన విడుదల చేసి అదేరోజు నామినేషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ నిబంధన గిరిజన ప్రాంతంలో కష్టసాధ్యంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈమేరకు ఎన్నికల షెడ్యూల్‌ను మార్పు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, జిల్లా కలెక్టర్, సహకార బ్యాంకు జిల్లా అధికారులను కోరనున్నామని గంగాధరస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి కె.చిన్నబాబు, నాయకులు ఎం.లక్ష్మయ్య, ఎస్.గాసి, బాబూరావు, పొన్నయ్య, సులోచన పాల్గొన్నారు.

వారపుసంతలో బుడియాల సందడి
డుంబ్రిగుడ, జనవరి 16: సంక్రాంతి పురస్కరించుకొని మండలంలోని కించుమండ వారపుసంతలో బుధవారం బుడియాలు సందడి చేశారు. డుంబ్రిగుడతో పాటు గుంటసీమ, అరమ, కించుమండ పంచాయతీలకు చెందిన కొంతమంది యువత విభిన్న వేషధారణలు ధరించి సంతలో నృత్యాలు చేస్తూ చందాలు దండుకున్నారు. అటుగా వస్తున్న వాహనాలను నిలిపివేసి సంప్రదాయ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ చూపరులను కనువిందు చేశారు. ఈ విధంగా సేకరించిన బియ్యం, కూరగాయలను వండి అందరితో కలిసి పంక్తి భోజనాలు చేశారు. బుడియాల సందడితో కించుమండ వారపుసంతలో పండుగ వాతావరణం నెలకొంది.

గిరిజన గ్రామాల్లో మంచినీటి కష్టాలు
అరకులోయ, జనవరి 16: మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి సీజన్ ప్రా రంభం కాకముందే బావులు, బోరింగ్ లు, నీటి కుండీలు మూలకు చేరడంతో గిరిజనులు మంచినీటి కోసం ఇబ్బందు లు పడుతున్నారు. బోర్లు పడకేయటం, బావులు, కుండీలు మరమ్మతులకు గురికావడంతో గ్రామాల్లో అప్పుడే మంచి నీటి సమస్య ఏర్పడింది.మంచినీటి సౌకర్యార్థం గ్రామాల్లో బావులు, బోరింగ్‌లు, కుండీలు ఉన్నప్పటికీ గత కొంతకాలం గా నిరుపయోగంగా పడి ఉండడంతో వాటిని తక్షణం మరమ్మతులు చేపట్టాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో నీటిఎద్దడి నెలకొం ది. బావులు, కుండీలు అడుగంటడం, బోరింగ్‌లు పనిచేయకపోవడంతో గడ లు, వాగులు, పంట పొలాలపై గిరిజనులు ఆధారపడుతూ ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కలుషిత నీటిని వినియోగిస్తున్న వివిధ గ్రామాలకు చెందిన అనేక మంది గిరిజనులు వ్యాధుల బారినపడి ఆసుపత్రి పాలవుతున్నారు. బురద నీటిని కాచి, వడగాచి ఉపయోగిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేసవి రాకముందే మూలకు చేరిన మంచినీటి వసతులను వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు.

జెసీ కారును అడ్డగించిన వైఎస్సార్, టీడీపీ
అచ్యుతాపురం, జనవరి 16: సహకార బ్యాంకులలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలను అరికట్టాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బుధవారం మండల కేంద్రానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ కారుని అడ్డగించి ఆందోళన చేశారు. దుప్పతూరు సొసైటీలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డిదారిలో సభ్యత్వాలు నమోదు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ జెసీ కారు ముందు ఆందోళన చేశారు. అన్నీ పార్టీల నుండి సభ్యత్వాలు సేకరణ చేపట్టాలని, లేనిపక్షంలో నిలుపుదల చేయాలని డిమాండు చేశారు. సుమారు రెండు గంటల పాటు కారును ఆందోళనకారులు అడ్డగించడంతో జెసీ ప్రవీణ్‌కుమార్

తెలుగుదేశం పార్టీ
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>