Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజా చైతన్యం కోసమే టిడిపి పాదయాత్రలు: యనమల

$
0
0

తుని, జనవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక నిర్ణాయాలను ప్రజల ముందుంచి ప్రజలను చైతన్యవంతులు చేయడమే ధ్యేయంగా నియోజక వర్గంలో పాదయాత్ర చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ పొలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు.బుధవారం తన స్వగృహాంలో విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గాలికి వదిలేసారని, ఉన్న పథకాలను నీరుగార్చి ప్రజలను ఇబ్బందులను గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతుందని ఎ ఒక్కటి పరిష్కరానికి పాలకులు కృషి చేయటలేదని అన్నారు. వ్యవసాయ రంగం,విద్యుత్, కుంటుపడిన సంక్షేమ పథకాలు, వెనుకబడిన ఆర్ధికాబివృద్ధి, స్థానిక ఎన్నికలు జరగక వెనుకబడిన గ్రామాభివృది, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వంటి సమస్యలు పాదయాత్రలో ప్రజలకు వివరించనున్నామన్నారు. ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతి రోజున కోటనందూరు మండలం ఇండుగబిల్లి నుండి పాదయాత్ర మొదలౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప,ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, యనమల కృష్ణుడు, పొల్నాటి శేషగిరిరావు, ఎస్ ఎల్ రాజు,నడిగట్ల సూరిబాబు తదితరుల పాల్గొన్నారు.
గురువుని ఈశ్వరునిగా భావించాలి
శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి
తుని, జనవరి 16: గురువును ఈశ్వరునిగా చూడాలని శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి అన్నారు. మండలంలో కుమర్మిరిలోవ తాండవ నదీ సమీపానగల తపోవనానికి రెండురోజుల ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా బుధవారం స్వామీజీ విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామీజీని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో శిష్య బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్ధేశించి స్వామి మాట్లాడుతూ ఈశ్వర భావనతో గురువులను పూజించాలన్నారు. ముఖ్యంగా గురువుకు రెండు అర్హతలు ఉండాలన్నారు. ఒకటి శాస్త్రం, తాత్పర్యం చక్కగా గ్రహించి ఆర్థాన్ని శిష్యులకు బోధించగలగాలని చెప్పారు. రెండోది ఎల్లప్పుడూ శిష్యుల హితం కోరేవాడై ఉండాలి. ఈ రెండూలేని గురువు అజ్ఞానితో సమానమన్నారు. తపోవనం సచ్చిదానంద సరస్వతీ స్వామీజీ శిష్యుల హితం కోరి వారి అభివృద్ధికి, ఆధ్యాత్మిక బోధనలను అందిస్తూ ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారన్నారు. ఈ సందర్భంగా పాద ధూళిపూజ, రుద్రాక్షమాల సమర్పణ, చంద్రమహేశ్వర పూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో శంకరానంద సరస్వతి, విద్యానందస్వామీజీ, కృష్ణ్భట్, శివస్వామీజీ, విశ్వనాథ గోపాలకృష్ణ, మద్దులపల్లి దత్తాత్రేయ, టిటిడి మాజీ చైర్మన్ పప్పల చలపతిరావు, సిఎస్‌కె శర్మ, ఎస్ సోమశేఖర్, వివి మూర్తి శ్రీ్ధర్, ఆనేక మంది భక్తులు విచ్చేశారు.
కోడిపందాలపై పోలీసుల దాడి
నలుగురు పోలీసులను నిర్బంధించిన గిరిజనులు
దేవీపట్నం, జనవరి 16: దేవీపట్నం మండలం పెనికెలపాడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం దేవీపట్నం పోలీసులు కోడిపందాలపై దాడి చేసి పందాలకు సంబంధం లేని వ్యక్తులపై దౌర్జన్యం చేయగా గిరిజనులు తిరగబడి పోలీసులను నిర్బంధించారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు పోలీసులను వదలమని గ్రామస్థులు భీష్మించారు. దీనికి సంబంధించిన వివరాలిలావున్నాయి. పెనికెలపాడు గ్రామంలో మామిడితోటలో పండగ సందర్భంగా మూడు రోజులు కోడిపందాలు నిర్వహించుకునేందుకు పదివేల రూపాయలు పోలీసులకు ఇచ్చేందుకు గ్రామస్థులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారంతో గడువు ముగియడంతో బుధవారం మళ్లీ పందాలు నిర్వహించుకునేందుకు కొంత సొమ్ము ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. బుధవారం పందాలు నిర్వహిస్తుండగా దేవీపట్నం పోలీసు స్టేషన్‌కు చెందిన నలుగురు సిబ్బంది మధ్యాహ్నం పందాలపై దాడి చేసి పది కోళ్లు, ఒక సెల్‌ఫోన్, ఒక బంగారు గొలుసు పట్టుకుని వెళ్లిపోయారని పొడియం చెల్లన్నదొర తదితరులు ఆరోపించారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటల సమయంలో వచ్చి కోడిపందాలతో సంబంధం లేని పశువుల కాపరి బంధం సుబ్బారావును చితగ్గొట్టారు. రెండోసారి పోలీసులు రావడంతో ఆగ్రహించిన గిరిజనులు పోలీసులను గ్రామంలో నిర్బంధించారు. విషయం తెలిసిన వెంటనే దేవీపట్నం పోలీసు స్టేషన్‌లో ఎఎస్సైగా పనిచేస్తున్న సత్యనారాయణ, రైటర్ శ్రీనివాసరావు హుటాహుటిన పెనికెలపాడు వెళ్లి గిరిజనులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు విడిచిపెట్టమని గిరిజనులు స్పష్టం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రాత్రి ఏడు గంటల సమయంలో ఎఎస్సై హామీ ఇవ్వడంతో గిరిజనులు శాంతించి పోలీసు సిబ్బందిని విడిచిపెట్టారు. ఈ విషయమై దేవీపట్నం ఎస్సై డి ప్రశాంతకుమార్‌ను వివరణ కోరగా తాను రంపచోడవరం స్టేషన్‌లో ఇన్‌ఛార్జి విధులు నిర్వహిస్తున్నానని, తనకు విషయం ఇప్పుడే తెలిసిందన్నారు. రంపచోడవరం సిఐ రవికుమార్‌ను వివరణ కోరగా డ్యూటీలో లేని సిబ్బంది దాడి చేసి వుంటారని, విషయం తెలిసిన వెంటనే దేవీపట్నం ఎస్సైను పెనికెలపాడు పంపామని, గురువారం విచారణ జరిపిస్తామన్నారు.
20న పల్స్ పోలియో
*5 లక్షల 17 వేల మంది చిన్నారులకు పంపిణీ *కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 16: జిల్లాలో ఈ నెల 20వ తేదీన విస్తృతంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు, జిల్లాలో 5 లక్షల 17 వేల 216 మంది చిన్నారులు ఉండగా 7 లక్షల డోసుల పోలియో చుక్కలను ఏర్పాటు చేయడం జరిగుతుందని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులంతా సహకరించి విజయవంతం చేయాలని ఆమె కోరారు. బుధవారం కలెక్టర్ కోర్టు హాలులో వైద్య ఆరోగ్య శాఖ, సంబంధిత శాఖల అధికారులతో పల్స్ పోలియో ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20న మొదటి విడత, ఫిబ్రవరి 24వ తేదీన రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించి ఐదేళ్ళలోపు వయస్సు గల పిల్లలందరికి నూరు శాతం పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న బూత్ లెవెల్‌లో, 21, 22 తేదీల్లో రెండు రోజులు, రాజమండ్రిలో 24వ తేదీ కూడా ఇంటింటికి తిరిగి పిల్లలందరికి పోలియో చుక్కలను వేయాలని కలెక్టర్ చెప్పారు. పోలియో చుక్కలను మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో, మత్స్యకార ప్రాంతాల్లోని హైరిస్క్ ప్రాంతాల్లో, లంక ప్రాంతాల్లోను, వలసలు వచ్చిన వారిని ప్రతి ఒక్క బిడ్డకు పోలియో చుక్కలు వేసేటట్లు చూడాలన్నారు. పోలియో చుక్కలు పంపిణీ కార్యక్రమంలో అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు పాత్ర ప్రధానమైందన్నారు. గ్రామాల్లో జిల్లా పంచాయితీ అధికారి ప్రతీ రోజు టాం టాం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ ర్యాలీ నిర్వహించాలన్నారు. 18వ తేదీ నుండి పోలియో బూత్‌లు ఏర్పాటుకు పాఠశాలలు తెరిపించాలని ఇందుకు ఎంఇఓలు చర్యలు చేపట్టాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు. దేవాలయాల్లో, రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లు, సంతలు, ఎగ్జిబిషన్‌లలో పోలియో బూత్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రెడ్‌క్రాస్, రోటరీ, లయన్స్, స్వచ్ఛంద సంస్థలు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాకు 48 లక్షల రూపాయల నిధులు విడుదల చేసిందని చెప్పారు. పోలియో చుక్కలు సకాలంలో బూత్‌లకు చేరాలని, నిల్వ ఉంచేందుకు ఐస్ బాక్స్‌లు, ఇతర సామాగ్రిని ఏర్పాటు చేయాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. పోలియో చుక్కలు వేయడం ద్వారా జ్వరం, ఇతర సంఘటనలు చోటు చేసుకుంటే ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేయించాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు పాల్గొనేలా ఎంపిడిఓలు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ సిఇఓను ఆదేశించారు. గ్రామ స్థాయిలో తహశీల్దార్లు విఆర్‌ఓల ద్వారా కార్యక్రమం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని విఆర్‌ఓలను ఆదేశించారు. విద్యుత్ ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో ఎస్‌ఇని ఆదేశించారు. మన జిల్లాలో 2007లో సామర్లకోట, గాడిమొగ, పర్లోవపేటలో 3 కేసులు నమోదయ్యాయని, 2008లో ఏటిమోగలో ఒక కేసు నమోదైంది. అప్పటి నుండి పకడ్బందీగా పోలియో చుక్కలు వేయడంతో ఎటువంటి కేసులు నమోదు కాకుండా చోటు చేసుకున్నాయన్నారు. ఇంటికి వెళ్ళి పోలియో చుక్కలు వేసేందుకు 3150 టీమ్‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎజెసి బి రామారావు, డిఆర్‌ఓ బి యాదగిరి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం పద్మావతి, ఎయిడ్స్ కంట్రోల్ అధికారి ఎం పవన్‌కుమార్, టిబి కంట్రోల్ అధికారి ఎన్ ప్రసన్నకుమార్, జిల్లా పరిషత్ సిఇఓ కె జయరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తిరుగు ప్రయాణంలో పండుగ అతిథులు
కిటకిటలాడుతున్న హైదరాబాద్ బస్సులు..రైళ్లు
* దగ్గర ప్రాంతాలకు రద్దీ అంతంతమాత్రం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జనవరి 16: పండుగ అతిథులు తిరుగు ప్రయాణమయ్యారు. పండుగకు ముందు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి గోదావరి జిల్లాల్లోని పుట్టిళ్లు, అత్తవారిళ్లకు వచ్చిన అతిథులు బుధవారం నుండి తిరుగు ప్రయాణంకావటంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు ఆర్టీసీ గత ఏడాది రాష్ట్రంలోని హైదరాబాద్‌తో పాటు, ఇతర జిల్లాల నుండి గోదావరి జిల్లాలకు అదనంగా నడిపిన ప్రత్యేక బస్సుల కన్నా, ఈ ఏడాది నడిపిన బస్సులు 20శాతం ఎక్కువ. అంటే గత ఏడాది కన్నా ఈ ఏడాది గోదావరి జిల్లాలకు వచ్చిన అతిథులు బాగా పెరిగారన్న మాట. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ పండుగ తరువాత తిరుగు ప్రయాణాలకు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. పండుగకు ముందు హైదరాబాద్ నుండి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ 120 ప్రత్యేక బస్సులను నడిపింది. తిరుగు ప్రయాణాలకు మంగళవారం నుండే ప్రత్యేక బస్సులను సిద్ధంచేసింది. మంగళవారం రెగ్యులర్ బస్సులకు అదనంగా జిల్లా నుండి 20ప్రత్యేక బస్సులు నడిస్తే, బుధవారం 30ప్రత్యేక బస్సులు నడిచాయి. గురువారం కూడా అదే స్థాయిలో 30బస్సులకు టిక్కెట్లు రిజర్వయ్యాయని ఆర్టీసీ డిప్యుటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వరప్రసాద్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. మరోపక్క హైదరాబాద్‌కు వెళ్లే ప్రయివేటు బస్సులకు డిమాండ్ ఎక్కువే ఉంది. ఆర్టీసీ కన్నా కాస్తంత అధికంగానే ప్రయివేటు బస్సుల్లో చార్జీలను వడ్డిస్తున్నాగానీ, ప్రయివేటు బస్సులకు కూడా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రాజమండ్రి నుండి హైదరాబాద్‌కు నాన్ ఏసి హైటెక్ బస్సులో టిక్కెట్టు ధర రూ.800 నుండి రూ.900వరకు పలుకుతోంది. ఏసి బస్సుకయితే ఇది రూ.1800 నుండి రూ.2వేల 500వరకు ఉంది. హైదరాబాద్ వెళ్లేందుకు టిక్కెట్టు ధర ఎంత ఉందన్న అంశంపై కన్నా, అసలు టిక్కెట్టు దొరికితే చాలన్నట్టు తిరుగు ప్రయాణంలోని పండుగ అతిథులు ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లతోపాటు, రెగ్యులర్ రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే గత రెండు రోజులుగా కనిపిస్తున్న రద్దీ అంతా హైదరాబాద్ వెళ్లే బస్సులు, రైళ్లకే పరిమితమయింది. విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మాత్రం అంతగా రద్దీ కనిపించటం లేదు. పండుగకు గోదావరి జిల్లాలకు వచ్చిన అతిథులను బట్టి, తిరుగు ప్రయాణాలకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటుచేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయాణికులు కనిపించటం లేదని ఆర్టీసీ డిప్యుటి సిటిఎం వరప్రసాద్ చెప్పారు. పిల్లలకు ఇంకా పండుగ సెలవులు మరో నాలుగైదు రోజులు ఉండటంతో కాస్తంత దగ్గర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు శని లేదా ఆదివారాల్లో బయలుదేరతారని భావిస్తున్నామన్నారు.

పనితీరు మెరుగుపరుచుకోండి..
మున్సిపల్ ఆర్డీ రాజేంద్రప్రసాద్
మండపేట, జనవరి 16: మున్సిపాల్టీలో అధికారులంతా పనితీరును మెరుగుపరుచుకోవాలని, చదువురాని వాళ్లలా పనిచేయవద్దని మున్సిపల్ ఆర్డీ రాజేంద్రప్రసాద్ అధికారులపై మండిపడ్డారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టణంలో తర్వాణీపేటలో ఓ భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని హైదరాబాద్ లోకాయుక్తకు స్థానిక మాజీ కౌన్సిలర్ ఒకరు ఫిర్యాదు చేసిన మేరకు తనను విచారణాధికారిగా నియమించారన్నారు. కొన్ని నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మాణం జరిగిందని, అధికారుల తప్పులు కూడా దొర్లాయన్నారు. విచారణ పూర్తయిన తరువాత దీనికి సంబంధించిన రికార్డును లోకాయుక్తకు పంపుతున్నట్టు ఆర్డీ చెప్పారు. విచారణ అనంతరం ఆర్డీ మున్సిపాల్టీలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగ అధికారుల పనితీరును మార్చుకుని, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం అనధికార లే అవుట్లను ఆయన సందర్శించి వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనధికార లే అవుట్లలో ఎటువంటి వౌలిక సదుపాయాల కల్పన ఉండదనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోతే ప్రజలు మోసపోతారన్నారు. బోర్డుల ఏర్పాటుపై అధికారులకు మొహమాటాలు ఉంటే సెలవుపెట్టి ఇంటి దగ్గర కూర్చోండని హెచ్చరించారు. అలాగే అనధికార సెల్‌టవర్లు, కల్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషనర్ శ్రీరామశర్మకు ఆర్డీ సూచించారు. అదే విధంగా జనవరి నెలాఖరుకి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్ డిజిటల్ ప్రింట్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పనులు జరుగుతున్నాయన్నారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరామశర్మ, మున్సిపల్ అన్నిశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
విద్యుత్‌చార్జీలపై దశలవారీ ఉద్యమం
* పెంచిన చార్జీలు చెల్లించద్దు*సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మిడియం
రాజమండ్రి, జనవరి 16: పెంచిన విద్యుత్‌చార్జీలకు వ్యతిరేకంగా రాష్టవ్య్రాప్తంగా దశలవారీ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపి డాక్టర్ మిడియం బాబూరావు వెల్లడించారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఉద్యమ కార్యాచరణను వివరించారు. ఈనెల 17న రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖలను అందజేస్తామన్నారు. 22న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మంత్రులను ఘోరావ్ చేస్తామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి 15తరువాత అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. పెంచిన విద్యుత్‌చార్జీలను చెల్లించరాదని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పెంచిన విద్యుత్‌చార్జీలు, సర్‌చార్జీల వల్ల ప్రజలపై 32వేల కోట్ల భారంపడిందన్నారు. విద్యుత్‌చార్జీల వల్ల 12వేల 700కోట్ల భారం పడిందన్నారు. పెంచిన విద్యుత్‌చార్జీలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌రంగంలో ప్రైవేటు కంపెనీల పెత్తనం కారణంగానే డిస్కంలు నష్టాల్లో నడుస్తున్నాయన్నారు. గ్యాస్, బొగ్గు సరఫరా కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించి, భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. విద్యుత్‌చార్జీలు, కోతల కారణంగా ఇప్పటికే చిన్నతరహా పరిశ్రమలు మూతపడి, కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. వ్యవసాయరంగం కూడా కుదేలయ్యిందన్నారు. విద్యుత్‌చార్జీల పెంపుపై వినియోగదారుల్లో చైతన్యం తెస్తామన్నారు. ఇందుకోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తామని మిడియం వివరించారు. విద్యుత్‌చార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారన్నారు. ఆయన మంత్రివర్గ సహచరులే చార్జీల పెంపును వ్యతిరేకించారని గుర్తుచేశారు. మన బియ్యం పథకం ప్రచార ఆర్భాటమేనని, ఈపథకం కూడా రుపాయి కిలో బియ్యం వంటిదేనని ఎద్దేవా చేశారు. సబ్సిడీలను ఎగవేసేందుకే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని, ఈపథకం అమలు కోసం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టిఎస్ ప్రకాష్ మాట్లాడుతూ వచ్చేనెల 2,3 తేదీల్లో కమ్యూనిస్టుయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పుచ్చలపల్లి రాజమండ్రిలోని ట్రైనింగ్ కళాశాలలో చదువుకున్నారని, శ్రద్ధానంద ఘాట్ నుంచి రాజకీయాలు ప్రారంభించారన్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులకు ఆయన రాజకీయ జీవితంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తామన్నారు. 3వ తేదీన రాష్టస్రదస్సు, డాక్యుమెంటరీ ప్రదర్శన, కళారూపాల ప్రదర్శన జరుగుతాయన్నారు. ఈకార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు హాజరవుతారన్నారు. విలేఖర్ల సమావేశంలో సిపిఎం నాయకులు టి అరుణ్, బిబి నాయుడు, ఎస్‌ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
-ఎమ్మెల్సీ కందుల
ధవళేశ్వరం, జనవరి 16: క్రీడలు శారీరక దృఢత్వం పెంపొందించడంతోబాటు మానసిక ఉల్లాసాన్ని చేకూరుస్తాయని ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ అన్నారు. ఎన్‌జిఒ నాయకుడు జంగా బులిగరిటి జ్ఞాపకార్థం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ఎమ్మెల్సీ రిబ్బన్ కట్‌చేసి టోర్నీ ప్రారంభించారు. ఈ టోర్నీలో రాజమండ్రి రూరల్ పరిసర ప్రాంతాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దుర్గేష్ వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు యాదల స్టాలిన్, వారా రాము, మాజీ సర్పంచ్ వెలుగుబంటి వెంకటాచలం, కొత్తూరి బాల నాగేశ్వరరావు, కట్టా జమీందార్, కాగిత సన్యాసిరాజు, గిరిజాల బాబు, కొత్తూరి బాల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ షోలు ఎవరి ‘బెనిఫిట్’ కోసం...
*అభిమానుల ముసుగులో నిలువుదోపిడీ *నాలుగేళ్లుగా బెనిఫిట్ షోల సొమ్ము ఏమైనట్టు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 16: టాలీవుడ్ టాప్‌హీరోల సినిమాలు విడుదల సమయంలో అభిమానుల కోసం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్న బెనిఫిట్‌షోలు కొందరు రౌడీషీటర్లు, బ్లాక్‌టికెట్లు అమ్మేవారి జేబులు నింపే వ్యవహారంగా మారిపోయింది. అభిమానుల కోసం బెనిఫిట్‌షోలు నిర్వహించటం టాప్‌హీరోల సినిమాలు విడుదల సమయంలో ఒక ప్రహసనంగా మారింది. ప్రముఖ హీరోల సినీమాలు విడుదల సంధర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయాథియేటర్‌లలో30 నుండి 50 రూపాయలు ఉన్న టికెట్‌ను 2వందల నుండి ఐదువందల వరకూ సినీమాకు ఉన్న డిమాండ్‌ని బట్టి అమ్ముతుంటారు. సాధారణంగా తమ హీరో అభిమాన సంఘం తరుపున ఈ బెనిపిట్‌షోలు నిర్వహించి ఈ వచ్చిన అదనపు సొమ్ముతో గాయపడిన అభిమానుల కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయటమో, లేదా ఆయా పట్టణాల్లో సేవా కార్యక్రమాలకు వినియోగించేవారు. కానీ రానురానూ సేవ అంతరించిపోయి స్వార్ధం పెరిగిపోవటంతోపాటు అభిమాన సంఘాల ముసుగులో రౌడీషీటర్లు, రాజకీయ నాయకులు, కులసంఘాల నాయకులు, చివరికి బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వారు సైతం చక్రం తిప్పి బెనిఫిట్‌షోల టిక్కెట్లను గుత్తగా పట్టుకుపోయి వారి ఇష్టం వచ్చిన రేటుకి అమ్మి జేబులు నింపుకుంటున్నారని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. తమ అభిమాన హీరోసినిమాను ఉదయానే్న బెనిపిట్‌షో చూడాలన్న ఆతృతతో డబ్బు ఎంతయినప్పటికీ లెక్కచేయకుండా టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నామని, టిక్కెట్ కొనుగోలు అదనపు భారం అయినప్పటికీ ఆ సొమ్ముతో పదిమంది పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారన్న భావనతో అదనపు సొమ్ము ఎంతయినా కొనుగోలు చేస్తుంటే ఇటీవల ఆ సొమ్ము దారిమళ్లి సంఘ విద్రోహుల చేతిలోకి వెడుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రెండు సినిమాల విడుదల సందర్భంగా అమలాపురంలో నిర్వహించిన బెనిఫిట్‌షోలు వివాదాస్పదమయ్యాయి. ఒక నటుడి సినిమాకు వేసిన బెనిఫిట్‌షోలు ఒక నేత పేరిట నిర్మించనున్న ఘాట్‌కి కేటాయించటం కొంతలోకొంత ఊరట కలిగించినా, మరోనటుడి అభిమానుల పేరుతో ఒకవర్గ నాయకులు మొత్తం ధియేటర్లలో టిక్కెట్లు అన్నీ వారే పట్టుకుపోయి ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారన్న విమర్శలు చుట్టుముట్టాయి. అయితే ఆ విధంగా తమ నుండి అదనంగా వసూలు చేస్తున్న సొమ్ము ఏమవుతుందో తెలియటం లేదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. గతంలో అయితే తమ అభిమాన హీరో పేరున పేదలకు అన్నదానం, వస్తద్రానం, వికలాంగులకు సహాయం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారమని, గత నాలుగేళ్లుగా ప్రధాన హీరోల సినిమాల విడుదల రోజున బెనిఫిట్‌షోలు నిర్వహిస్తున్నా ఆ షోల ప్రదర్శన మూలంగా వచ్చిన సొమ్ము ఏమయ్యిందో ఎవరికీ తెలియదని అభిమాన సంఘాల నాయకులే ఆవేదన చెందుతున్నారు. పెద్దహీరోల సినిమాలు విడుదల రోజున పలువురు అభిమానులు గాయపడి, వికలాంగులు అవుతున్నా వారికి వైద్య ఖర్చులు, ఇతర సహాయం కింద పైసా కూడా విదల్చకుండా కాజేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇది ప్రధాన పట్టణాలకే కాకుండా మండల కేంద్రాలలో కూడా ఇటీవల పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. అక్కడ కూడా ఆదే పరిస్థితి కొనసాగటం విశేషంగా చెబుతున్నారు. బెనిఫిట్‌షోల మూలంగా వస్తున్న సొమ్ము ఏమవుతోందనే దానికి బెనిఫిట్‌షోలు నిర్వహించిన వారే సమాధానం చెప్పాలని అభిమానులు కోరుతున్నారు. అభిమానుల జేబులు కొల్లగొడుతున్న బెనిఫిట్‌షోల మహమ్మారి నుండి కాపాడాలని, టిక్కెట్‌రేటుకి పదింతలు కాజేస్తున్న రౌడీషీటర్లు, బ్లాక్ టిక్కెట్లు అమ్మేవారి భరతం పట్టి ఇంతవరకూ ప్రదర్శించిన బెనిఫిట్‌షోల సొమ్ము రికవరీచేసి సేవా కార్యక్రమాలకు అందించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్‌పిలు నడుంబిగించాలని అభిమానులు కోరుతున్నారు.
మడ అడవుల్లో కాలుష్యం నివారణకు చర్యలు :కలెక్టర్
కాకినాడ సిటీ, జనవరి 16: పర్యావరణాన్ని పరిరక్షించేందకు సంబంధిత శాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కోరంగి మడ అడవులు, హోప్‌ఐల్యాండ్, పాపికొండలు వంటి ప్రాంతాల్లో కాలుష్యం కలిగించే పనులు చేయరాదని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎకో సెన్సిటీవ్ జోన్‌లో ఉండే ప్రాంతాల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు తగిన కృషి చేయాలన్నారు. దీనికి అవసరమైన సూచనలు, సలహాలు అందజేసి మాస్టర్ ప్లాన్ ప్రకారం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి జిల్లా మోనటరింగ్ కమిటీకి ప్రతిపాదనలను అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎకో సెన్సిటీవ్ జోన్‌లోని 10 కిలో మీటర్ల పరిధిలో ఎటువంటి అక్రమణలు లేకుండా రెవెన్యూ, అటవీ శాఖలు జాయింట్ సర్వేలు నిర్వహించి అక్రమణలు ఉంటే తక్షణం తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి బాబు, సబ్ కలెక్టర్ జి చంద్రుడు, డిఎప్‌ఓ ఆర్ రాఘవయ్య, డిఆర్‌ఓ యాదగిరి, జెడ్పీసిఇఓ జయరాజు, డ్వామా పిడి మధుసూధన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

నాడు శిక్షాలయం...నేడు శిక్షణాలయం
రాజమండ్రి, జనవరి 16: నాడు జైళ్లు శిక్షాలయంగా ఉండేవని, నేడు శిక్షణాలయాలుగా మారాయని ప్రముఖ క్యారెక్టర్ నటుడు రావి కొండలరావు పేర్కొన్నారు. 1948లో మహాత్మాగాంధీ హత్య సందర్భంగా కొన్ని కారణాల వల్ల ఆయనపై కేసు నమోదు కావడంతో కొండలరావు రాజమండ్రి సెంట్రల్‌జైలులో 2నెలల 10రోజుల పాటు జైలుశిక్ష అనుభవించారు. అప్పుడు జైలు శిక్ష అనుభవించిన జైలు ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తితో బుధవారం సెంట్రల్‌జైలును సందర్శించారు.
గత స్మృతులను నెమరువేసుకున్నారు. జైళ్లు గతంలో కన్నా ఎంతో అభివృద్ధి చెందాయని, సౌకర్యాలు కూడా మెరుగయ్యాయన్నారు.
నాడు జైలు శిక్ష అంటే ఎంతో భయపడేవారని, నేడు జైలు అంటే భయం లేకుండాపోయిందని అభిప్రాయపడ్డారు. నాడు తాను శిక్ష అనుభవించిన బ్యారెక్‌ను, ఇతర ప్రదేశాలను ఆయన సందర్శించారు.
ఫైనల్స్‌కు చేరిన బాస్కెట్‌బాల్ పోటీలు
రామచంద్రపురం, జనవరి 16: రామచంద్రపురం పట్టణంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి బాస్కెట్‌బాల్ పురుషుల, మహిళల ఓపెన్ పోటీలు బుధవారం అర్ధరాత్రికి ముగియనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీలలో అత్యంత ఉత్సాహంగా, ఉత్తేజంగా తమ క్రీడా సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ వీక్షకుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. బుధవారం రాత్రి 7 గంటల సమయానికి మహిళల విభాగంలో తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్ టీమ్‌లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. అదే విధంగా పురుషుల విభాగంలో చెన్నైకు చెందిన సత్యభామ టీమ్, విజయవాడకు చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే టీమ్‌లు ఫైనల్స్‌లో తలపడనున్నాయి. వీటి నుండి ప్రథమ, ద్వితీయ విజేతలు ఎంపిక కానున్నారు. తృతీయ స్థానానికి మహిళల విభాగంలో రామచంద్రపురం ఎ, పురుషుల విభాగంలో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన శాయ్ అకాడమిలు చేరాయి.
ముగిసిన శృంగేరి పీఠాధిపతి విజయయాత్ర
రాజమండ్రి, జనవరి 16: రాజమండ్రిలో ఈనెల 12నుంచి 16వ తేదీ వరకు శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి విజయయాత్ర బుధవారంతో ముగిసింది. బుధవారం సాయంత్రం ఆయన తుని తపోవనంకు బయలుదేరి వెళ్లారు. ఆహ్వాన కమిటీ నాయకులు మద్దూరి శివసుబ్బారావు, మహామహోపాధ్యాయ విశ్వనాధ గోపాలకృష్ణశాస్ర్తీ, చల్లా వెంకట్రామయ్య, ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, మామిడన్న శేషగిరి, రిటైర్డ్ జస్టిస్ మామిడన్న జగన్నాధరావు మహాస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం సాయంత్రం ఆయన శ్రీవిరించి వానప్రస్థాశ్రమం నుంచి గోదావరిగట్టు రోడ్డులోని శంకరమఠంకు చేరుకుని భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీశారదామాతకు ప్రత్యేక పూజలు జరిపారు.

రాష్ట్ర ప్రభుత్వం
english title: 
e

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>