Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

షార్‌కు చేరిన ఉపగ్రహం

$
0
0

సూళ్లూరుపేట, జనవరి 18: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) శ్రీహరి కోట నుండి ఫిబ్రవరి 11న పిఎస్‌ఎల్‌వి సి-20 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి పంపే సరళ ఉపగ్రహం శుక్రవారం భారీ భధ్రతల నడుమ నెల్లూరు జిల్లాలోని షార్‌కు చేరింది. బెంగుళూరులోని శాటిలైట్ కేంద్రం నుండి రోడ్డు మార్గాన శ్రీహరికోటకు చేరుకుంది. ఈ ప్రయోగం ద్వారా సరళ్ ఉపగ్రహంతో పాటు ఫ్రెంచి దేశానికి చెందిన రెండు బుల్లి ఉపగ్రహాలనుకూడా కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో షార్‌లో రెండుసమావేశాలు జరిగాయి. ఈ నెలాఖరులో మరో కీలక సమావేశం జరగనుంది. ఈ ఉపగ్రహం వలన సముద్రంలోని నావికా దళాల జాడను సముద్రపు అలల ఎత్తులను కనుగొనవచ్చును. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో షార్ శాస్తవ్రేత్తలు నిమగ్నమై ఉన్నారు. ఈ రెండువారాల్లో రాకెట్‌లో ఉపగ్రహాల అమరిక, రాకెట్ అనుసంధానం పనులను శాస్తవ్రేత్తలు పూర్తి చేసి ప్రయోగానికి సిద్ధం చేయనున్నారు. ఏప్రిల్ నెలలో జిఎస్‌ఎల్‌వి-డి5 రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది పిఎస్‌ఎల్‌వి తొలి ప్రయోగం కావడంతో విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

11న పిఎస్‌ఎల్‌వి సి-20 రాకెట్ ప్రయోగం
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>