విశాఖపట్నం, జనవరి 18: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు సాక్షిగా తెలుగు తమ్ముళ్ళు బాహాబాహీకి దిగారు. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్ళు బాహాబాహీకి దిగారు. పార్టీ అర్బన్, రూరల్ జిల్లా కమిటీలను రెండు రోజుల కిందట పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. అర్బన్ అధ్యక్ష పదవిలో వాసుపల్లి గణేష్‌కుమార్‌ను నియమించడం పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకానికి కారణం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అని కొంతమంది భావిస్తున్నారు. దీంతో శుక్రవారం పెందుర్తిలో జరిగే ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమానికి బండారును రానీయకుండా చేయాలని అక్కడి టిడిపి కార్యకర్తలను నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ బండారు పెందుర్తి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించాలని అనుకున్నారు. నగర పార్టీ మాజీ అధ్యక్షుడు పీలా శ్రీనివాస్ వచ్చేంత వరకూ ఆగాలని బండారుతో టిడిపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈనేపథ్యంలోనే బండారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వెనుదిరుగుతుండగా, కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈసమయంలో పీలా శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పీలా శ్రీనివాస్ వర్గీయులు తనపై దాడి చేశారని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బండారు డిమాండ్ చేశారు. బండారు వర్గీయులే తనను దుర్భాషలాడారని, ఆయనపై తాము దాడి చేయలేదని పీలా వర్గీయులు చెపుతున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు సాక్షిగా తెలుగు తమ్ముళ్ళు బాహాబాహీకి దిగారు. ఎన్టీఆర్
english title:
p
Date:
Saturday, January 19, 2013