కరీంనగర్/ జగిత్యాల జనవరి 18: హైందవ సంప్రదాయాలు, దేవుళ్లపై దురుసుగా వ్యాఖ్యానించి జైలుపాలైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఉదంతం మరువకముందే అదే పార్టీకి చెందిన చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి మహాత్మగాంధీ విగ్రహంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజా వివాదానికి కారణమైన ఎమ్మెల్యే ఖాద్రి జాతిపితను అవమానించాడని ఆరోపిస్తూ కరీంనగర్, జగిత్యాల పోలీస్ స్టేషన్‌లలో జిల్లా బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు బిజెపి, బిజెవైఎం కార్యకర్తలు జగిత్యాల తహశీల్ కార్యాలయం ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గురువారం జగిత్యాల పట్టణంలోని ఖాజీపుర ప్రాంతానికి చెందిన ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా దేశంలో చారిత్రక కట్టడాలన్నీ మహమ్మదీయ రాజులు కట్టించినవేనని, వారు కట్టించిన అసెంబ్లీలో కూర్చొని కిరణ్ రాజకీయం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, నిజాం కట్టించిన అసెంబ్లీలో గాంధీ బొమ్మ ఎలా పెడతారంటూ పరుష పదజాలంతో దూషించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బిజెపి నేతలు పేర్కొన్నారు. గాంధీని అవమానకరంగా వ్యాఖ్యానించిన ఎమ్మెల్యేపై జాతి గౌరవాన్ని భంగం కలిగించిన నేరానికి కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టాలని బిజెపి కరీంనగర్ నగరశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జగిత్యాల బిజెవైఎం అధ్యక్షుడు ఆముద రాజు డిమాండ్ చేశారు. కాగా ఖాద్రిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
హైందవ సంప్రదాయాలు, దేవుళ్లపై దురుసుగా వ్యాఖ్యానించి జైలుపాలైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్
english title:
c
Date:
Saturday, January 19, 2013