హైదరాబాద్, జనవరి 20: రాష్ట్ర విభజన ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి ప్రతినిధులు ఆదివారం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు రాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినాదాలు చేశారు. విద్యార్థి జెఏసి ప్రతినిధులు తొలుత లోయర్ ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్ వద్దకు వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
రాష్ట్ర విభజన ప్రతిపాదన
english title:
s
Date:
Monday, January 21, 2013