Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కిరణ్ సర్కార్‌ను కూల్చేందుకు కెవిపి కుట్ర

$
0
0

జగిత్యాల, జనవరి 24: కిరణ్ సర్కార్‌ను కూల్చి జగన్‌కు అధికారం అప్పగించాలనే ఆకాంక్ష కెవిపిలో బలంగా ఉందని, జగన్ జైల్ నుండే రాజకీయాలు నడిపితే సీమాంద్రులతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తూ కెవిపి తెలంగాణను అడ్డుకుంటూ రాజకీయ బ్రోకర్‌గా మారాడని నిజామాబాద్ ఎంపి మధుయాష్కిగౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపి మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ కట్టుబడి ఉండగా కెవిపి సీమాంధ్రులతో లాబీయింగ్ చేస్తూ జగన్‌కు కోవర్ట్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. 2009 డిసెంబర్ 9న, నేడు 28న వచ్చే తెలంగాణ ప్రకటన రాకుండా అడ్డుకుంటున్నదీ కెవిపేనన్నారు. తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలపై మండిపడుతూ తెలంగాణకోసం బుల్లెట్లకు ఎదురు నిలిచి పోరాటాలు కొనసాగిస్తామన్నారు. తెలంగాణలోని పార్టీలన్నీ జండాలు పక్కనబెట్టి తెలంగాణే ఎజెండాగా ఉద్యిమిద్దామని, సోనియాగాంధీ వద్ద నోరు తెరిచి మాట్లాడని సీమాంద్రులు ఆజాద్, కెవిపిని ముందుపెట్టి తెలంగాణ రాకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సిపి వారంతా తెలంగాణ వ్యతిరేకులేనని దుయ్యబట్టారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ మార్గమే లేదన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆస్తులు కాపాడుకునేందుకే గుప్పెడు మంది సీమాంధ్ర నాయకులు చేయిస్తున్న కృత్రిమ ఉద్యమాలే.. తప్పితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పట్ల సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం కూడా తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో నాలుగైదు రోజులుగా ఆంధ్రాప్రాంతంలో ఆందోళనలు చేయిస్తుంది సీమాంధ్ర పెట్టుబడి దారులదేనని ఎంపి మధుయాష్కిగౌడ్ ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ ప్రతిష్టంభనకు
తెరదించిన ఎమ్మెల్యే
జమ్మికుంట, జవవరి 24: గత రెండు రోజులుగా జమ్మికుంట పత్తి మార్కెట్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెరదించారు. సిసిఐ సంస్థ పట్టాదారు పాసు పుస్తకాలు వుంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని కొత్త నిబంధనను తెరమీదికి తేవడంతో వి వాదం తలెత్తి బుధ, గురువారాల్లో యార్డులో క్రయ విక్రయాలు నిలి చి పోయాయి. దీంతో యార్డుకు విక్రయానికి వచ్చిన సుమారు 12 వేల పత్తి బస్తాలు పేరుకు పోయాయి. బుధవారం యార్డు కొచ్చిన రైతులు మరుసటి రోజు వరకు వేచివున్నా పత్తిని కొనే దిక్కులేక రైతులు ఆందోళనకు గురయ్యారు. విషయంతెలుసుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మార్కెట్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు యార్డు మొత్తాని కలియ తిరిగి పత్తి బస్తాలను పరశీలించారు. అనంతరం యార్డులో రైతులతో బైఠాయించి సి. సి. ఐ అధికారి రవిందర్‌రెడ్డి, దిలీప్‌లతో పాటు మార్కెట్ కార్యదర్శి సత్యనారాయణ, తహశీల్దార్ ఎస్.ప్రమోద్‌లతో చర్చలు జరిపారు. పట్టాదారు పాసు పుస్తకాల నిబంధన వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మద్దతు ధర పొందే వీలు చిక్కదని, ఫలితంగా ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకునే దుస్థితి నెలకొందని రైతు నేతలు ఎమ్మెల్యేకు మొర పెట్టుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే మార్కెట్ కార్యదర్శి సత్యనారాయణను వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని విక్రయించుకోడానికి వచ్చే రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా అంటూ నిప్పులు చెరిగారు. మీ వైఖరి వల్ల రైతులు పత్తి బస్తాల వద్ద చీకట్లో దోమలతో నరకాన్ని చవి చూడాల్సివచ్చిందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల నిబంధన వెంటనే ఎత్తివేయాలని మార్కెట్ కార్యదర్శితో పాటు సి.సి. ఐ అధికారులను ఆదేశించారు. కొత్త కొర్రీలతో రైతులను ఇక్కట్ల పాలు చేయకుండా వెంటనే కొనుగోలు ఆరంభించాలని హుకుం జారీ చేశారు. తేమ పేరిట ధర తగ్గించ వద్దన్నారు. సి.సి. ఐ అధికారులతో చర్చించి పత్తి ధరను ఎ,బి,సి,డిలుగా విభజించి రూ.3900, 3861, 3822, 3744 చొప్పున ధర ఖరారు చేయడంతో ఉద్రిక్తత తొలగి పోయింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటలకు క్రయ విక్రయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే చొరవతో సంక్షోభం ముగియడంతో రైతులు ఊపిరి తీసుకున్నారు.
తెలంగాణ రావాలంటే తెరాస
కాంగ్రెస్‌లో విలీనం కావాలి
* నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ
ధర్మపురి, జనవరి 24: తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరుగుతున్న ఉద్యమాలు ప్రస్తుతం పరాకాష్ఠకు చేరుకున్నాయని, ఉద్యమ పార్టీయైన తె రాస, కాంగ్రెస్‌లో విలీనమైతే తెలంగాణ ఏర్పా టు సులభతరం కాగలదని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. గురువారం సాయంత్రం ధర్మపురి క్షేత్రానికి చేరుకున్న యాష్కీ, బ్రాహ్మణ సంఘ భవనానికి నేరుగా చేరుకుని, ధర్మకర్తల మండలి ప్రతిపాదిత చైర్మన్ కృష్ణారావుతో పాటు ధర్మకర్తలను ఆయన అభినందించారు. తెలంగాణ సాధనకోసం పార్లమెంట్ సభ్యులమైన తమను లోపాయికారిగా తెరాసలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నారని, అయితే తమ చేరికతో తెరాస బలపడడం తప్ప, తెలంగాణ మాత్రం రాదని, అందుకే తెరాస, కాంగ్రెస్‌లో విలీనమై, తమతో చేయి కలపాలని తెరాస అధినేత కేసిఆర్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వం అడకకుండానే గడువు విధించుకుని, స్పష్టమైన ప్రకటన చేసే సమయంలో, ఢిల్లీ వెళ్ళిన సీమాంధ్ర పెట్టుబడి దారులు గద్దలా తన్నుకు పోయే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ సాధనలో వివేక్, పొన్నం, తామంతా కల్సికట్టుగా పోరాడే విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో సోనియా, రాహుల్‌లను కలవున్నట్లు తెలిపారు. ఎపిఐఐసి డైరెక్టర్ నర్సింగరావు, ప్రతిపాదిత దేవస్థానం చైర్మన్ కృష్ణారావు, ధర్మకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణారావును, యాష్కీ ఘనంగా సత్కరించారు. అనంతరం దైవ దర్శనాలు చేసుకుని, పూజాదులలో పాల్గొన్నారు.
ముగిసిన నామినేషన్ల పర్వం
78 నామినేషన్లు స్వీకరణ *ఐదోవార్డు ఏకగ్రీవం
చిగురుమామిడి, జనవరి 24: సహకార పరపతి సంఘం ఎన్నికల్లో గురువారం కోలాహలంగా నామినేషన్ల పర్వం కొనసాగింది. 13 వార్డులకు గాను వివిధ రాజకీయ పార్టీల ప్యానల్ అభ్యర్థులు 78 మం ది నామినేషన్లను స్వీకరించినట్లు ఎన్నికల అధికారి జి. జమదగ్ని తెలిపారు. సాయంత్రం పదు గంటల వరకు నామినేషన్ల సంఖ్యను అధికారులు ప్రకటించారు. బొమ్మనపల్లి గ్రామానికి సంబంధించిన 5వ వార్డుకు ఒక నామినేషన్ మాత్రమే వచ్చిందని జమదగ్ని తెలిపారు. కుతాటి తిరుపతి 5వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే కానీ అధికారింగా ఎన్నికల అధికారులు ప్రకటన చేయలేదు. వివిధ రాజకీయ పక్షాలు జోరుగా ఎన్నికల క్యాంపెయిన్‌ను సాగిస్తున్నారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో 5వ వార్డు నుం చి ఎన్నికైన కుతాటి తిరుపతిని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి అందె స్వామి, చాడ ప్రభాకర్‌రెడ్డిలు పార్టీ కండువా కప్పి సిపిఐ లోకి అహ్వనించారు. సహాకార ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని రాంగోపాల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సహాకార కార్యాలయంపై ఎర్రజెండాను రెపరెపలాడించాలని అన్నారు.

అధికారం కోసం
కాంగ్రెస్ ఆరాటం
తెలంగాణపై నాన్చుతే
కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు
-సిపిఐ రాష్ట్ర నేత చాడ-
ఎల్కతుర్తి, జనవరి 24: తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజ లు ఆత్మబలిదానాలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా సోనియా కొడుకు రాహుల్ అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు ఆరాటపడుతున్నారని, నాన్చుడు దోరణిమాని తెలంగాణ ప్రకటించనట్లయితే పార్టీ నామ రూపాల్లేకుండా పోతుందని సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఎల్కతుర్తి మండల పలు గ్రామాల్లో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పర్యటించి మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో చాడ మాట్లాడుతూ సిపిఐ కార్యకర్తలు తె లంగాణ రాష్ట్రం కోసం సమరశీల ఉద్యమాలకు సన్నద్ధం కావాలని సోనియా కొడుకు కోసం ఆరాటపడుతుంటే తప్పా సమస్య పరిష్కరించకుండా నాన్చుడు దోరణి అవలంభిస్తూ, రెండు ప్రాంతాల్లో సమస్యను జటిలం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కర్రె భిక్షపతి, లక్ష్మణ్, కొమురయ్య, శ్రీనివాస్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
సిఎంపై ఎంఐఎం
నాయకుల విమర్శలు సరికాదు
కరీంనగర్ టౌన్, జనవరి 24: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంఐఎం పార్టీపై, ఎంఐఎం నాయకులు అసదుద్దీన్ ఓవైసీ, అక్భరుద్దీన్ ఓవైసీలపై కుట్రపూరిత చర్యలతో, మతతత్వ పార్టీలతో కలిసి అరెస్టులు చేయిస్తున్నారని జిల్లా ఎంఐఎం నాయకులు విమర్శలు చేయడం తగదని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ మోహిసిన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో ఖండించారు. ఎంఐఎం నాయకులు అరెస్టులు కావడం వాళ్ల స్వయంకృతాపరాదమని పేర్కొన్నారు. 2005 సంవత్సరంలో జరిగిన ఒక గొడవ కేసులో అసదుద్దీన్ ఏడు సంవత్సరాలుగా వ్యక్తిగతంగా ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాని కారణంగానే ఇప్పుడు అరెస్టయ్యారని తెలిపారు. బాధ్యతగల భారతీయులుగా ఎంఐఎం నాయకులు ముందుగా చట్టాలను, కోర్టులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. రాజకీయం చేయడం కోసమే కోర్టుకు వెళితే అరెస్టయి జైలుకు వెళ్తారని తెలిసే కోర్టులో లొంగిపోయారని, ఇందులో సిఎం బాధ్యున్ని చేయడం ఏమిటని ప్రశ్నించారు. మతం రంగు పులిమేసి అమాయక ముస్లీంలను ఎంఐఎం నేతలు ఎప్పటి నుండో మోసం చేస్తున్నారని, ఇక ఆటలు సాగవని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ముస్లిం మైనారిటీలు తమకు దూరమవుతారనే భయపడి ఎంఐఎం నాయకులు ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అసదుద్దీన్, అక్భరుద్దీన్ మాయమాటలకు ముస్లీములు మోసపోరని, 2014 సంవత్సరంలో కాంగ్రెస్‌కు మునుపటికన్నా ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తారని, ముస్లింలందరు ఎంఐఎం పార్టీ సొత్తు కాదని స్వయంగా ఆలోచించే సత్తా వారికుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మతతత్వ ప్రచారాలు చేయడం, కాంగ్రెస్ పార్టీని, సిఎంపై చౌకబారు విమర్శలు మానుకోవాలని మోహిసిన్ అహ్మద్ ఖాన్ ఆ ప్రకటనలో సూచించారు.
జంబ్లింగ్ విధానాన్ని
రద్దు చేయాలని విద్యార్థుల ర్యాలీ
కరీంనగర్ టౌన్, జనవరి 24: ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోర్టు సమీపంలో నుండి తెలంగాణ చౌక్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పలు ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

టి మంటల్లో ఆజాదు బాబా 40 దొంగలు
కరీంనగర్ టౌన్, జనవరి 24: తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెలంగాణ మంటలు అంటుకునేలా చేశాయి. ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో నిరసన ప్రదర్శనలు ఎగిసిపడ్డాయి. ఆజాద్ వ్యాఖ్యలతో అంటుకున్న మంటల్లో సీమాంధ్రుల దిష్టిబొమ్మలు తగులబడ్డాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ చౌక్ మళ్లీ ఉద్యమ పోరుకు వేదికగా మారింది. తెలంగాణను అడ్టుకోవడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి విధంగా ఆజాద్‌ను ముఠా నాయకుడిగా అభివర్ణిస్తూ 40మంది సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మలను తెలంగాణ చౌక్‌లో వరుసగా పెట్టి దహనం చేశారు. పెద్దఎత్తున సీమాంధ్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్ మాట్లాడుతూ ఇక తెలంగాణ వస్తదని అనుకుంటున్న ప్రతీసారి అడ్డుపడుతూ తెలంగాణ వనరులు దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న సీమాంధ్ర నేతలను చూస్తే ‘ఆలీబాబా 40దొంగలు’ అనే పాత సినిమా గుర్తుకు వస్తుందని మండిపడ్డారు. పార్టీలు వేరైనా చంద్రబాబు, కిరణ్‌కుమార్, జగన్మోహన్‌రెడ్డిలు దోచుకోవడం కోసం ఒక చీకటి ఒప్పందంతో కలిసిమెలిసి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. వీరు కలిసి డిసెంబర్ 9 ప్రకటనను అడ్డుకోవడమే నిదర్శనమని అన్నారు. టిఆర్‌ఎస్ నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుర్రం పద్మారెడ్డి, తాటి ప్రభావతి, భారతి, రేణుక, డి.సంపత్, అక్బర్‌హుస్సేన్, మైఖేల్ శ్రీను, చొప్పరి వేణు, బెజుగం మధులతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తెలంగాణపై నాన్చివేత దోరణికి నిరసనగా ఎబివిపి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ చౌక్‌లో యుపిఏ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు రాచకొండ గిరిబాబు మాట్లాడుతూ యుపిఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రేపంటూ, మాపంటూ కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ పేరుతో కొన్ని రోజులు, ఎలక్షన్లు, పండుగల పేరుతో కొన్ని రోజులు, అఖిలపక్ష సమావేశాలని మరికొన్ని రోజులు వాయిదాలేసుకుంటూ పబ్బం గడుపు కుంటున్నదని విమర్శించారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, ప్రశాంత్, అనిల్, సాయిక్రిష్ణ, క్రాంతి, అనిల్‌రెడ్డి, జగదీష్, శ్రీ్ధర్, ప్రదీప్, వై.తిరుపతి, శ్రీకాంత్, రమేష్, సాయితేజ, సాగర్, వేణు, సూర్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద ఆజాద్ వ్యాఖ్యల పుణ్యమా అని మళ్లీ తెలంగాణ ఉద్యమ సెగ రాజుకుంది.

- ఎంపి మధుయాష్కిగౌడ్ ధ్వజం -
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>