హైదరాబాద్, జనవరి 24: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ అనైతిక పంథాకు పాల్పడుతూ సమయానుకూలంగా కోర్టుల్లో తన వాదనను మారుస్తోందని వైఎస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. జగన్ దరఖాస్తు చేసుకున్న బెయిల్‌ను హైకోర్టు కొట్టివేయడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదంటూ సిబిఐ పేర్కొనడం చూస్తుంటే ఈ సంస్ధకు ఉన్న దురుద్దేశాలు వెల్లడవుతాయన్నారు. సిబిఐ పనితీరు ప్రశ్నించే విధంగా ఉందన్నారు. సిబిఐ కోర్టులో బెయిల్ విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం సహకరించడం లేదని సిబిఐ తెలియచేయలన్నారు. హైకోర్టులో మాత్రం రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదని చెబుతున్న తీరు చూస్తే జగన్‌ను జనానికి దూరంగా వీలైనంత ఎక్కువ కాలం ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతోందన్నారు. ఈ కేసును సిబిఐ 18 నెలలుగా దర్యాప్తు చేస్తోందని, 8 నెలల క్రితం జగన్‌ను అరెస్టు చేశారని ఆమె అన్నారు. కాని ఇంతవరకు ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలను సిబిఐ చూపించలేకపోయిందన్నారు. మూడు నెలల్లో కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సిబిఐ చెబుతోందన్నా. ఈ అంశంపై రాష్టప్రతి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సిబిఐ అప్రజాస్వామికంగా తమ నేతను అరెస్టు చేసిందన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి ధ్వజం
english title:
r
Date:
Friday, January 25, 2013