సంగారెడ్డిరూరల్, జనవరి 25: రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తిదారులకు 25శాతం నిధులు కేటాయించి, సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ కమిటి నాయకుడు ఎంవి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సమన్వయ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రమణ మాట్లాడుతూ జనభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనభాలో 4వ వంతు మంది వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు.ప్రభుత్వం వెంటనే వృత్తులకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి,నిధులను కేటాయించి ఖర్చుచేయలన్నారు. వృత్తు దారులందరిని సహకార రంగంలోకి తీసుకరావాలని, బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ఇంటి స్థలాలు, 3ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సమన్వయ కమిటి నాయకులు జి.జయరాజ్, రమేష్,కొండల్, నర్సింలు, సంతోష్‌గౌడ్, నారాయణగౌడ్, సాయిగౌడ్, చంద్రయ్య, యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో
english title:
m
Date:
Saturday, January 26, 2013