సంగారెడ్డిరూరల్,జనవరి 25: రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని, మహిళల కోసం ప్రత్యేక చట్టాలను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.సిరిబాబు శుక్రవారం మెదక్ ఎంపి విజయశాంతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిరిబాబు మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆరచాకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. తప్పు చేయలంటేనే వణుకు పుట్టేటువంటి చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాజేష్, విష్ణు, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.
* ఎంపి విజయశాంతికి వినతి
english title:
m
Date:
Saturday, January 26, 2013