రొంపిచెర్ల, జనవరి 27: మండలంలో జరుగబోవు సొసైటీ ఎన్నికల్లో 13 వార్డులను మనమే గెలుచుకోవాలని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం రొంపిచెర్లలో జరిగిన వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి కొంత మంది నాయకులు మన పార్టీలోకి వచ్చినందువల్ల మండలంలో మనబలం పెరిగిందన్నారు. కార్యకర్తలు విబేధాలు పక్కనపెట్టి పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో మనం అన్ని వార్డులు గెలుచుకుంటే రానున్న పంచాయతీ, ఎంపిటిసి ఎన్నికల్లో గెలుపొందేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇక్కడ తెలుగుదేశం నాయకులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని 30 ఏళ్ళుగా ఈమండలంలో వారిగురించి నాకు తెలియనికాదని అన్నారు. మిమ్మల్ని భయపెట్టే తెలుగుదేశం నాయకుల గురించి మేము చూసుకుంటామని అన్నారు. మాజీ జడ్పీటీసీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉన్న మండలాల్లో ప్రభుత్వం సొసైటీ ఎన్నికలు రద్దు చేసిందని దీన్ని రద్దు చేయడంతోనే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లు అయ్యిందన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ సిద్దారెడ్డి, మాజీ సర్పంచి ఇబ్రహీంఖాన్, హరినాథరెడ్డి, చెంచురెడ్డి, నూలురెడ్డెప్ప ప్రసంగించారు. సమావేశానికి రొంపిచెర్ల మార్కెట్ కమిటీ చైర్మెన్ పి మదనమోహనరెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, సొసైటీకి పోటీ చేస్తున్న డైరెక్టర్లు, మాజీ సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, మునస్వామినాయుడు, రాజేంద్రనాయుడు, కృష్ణమనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.
* ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు
english title:
n
Date:
Monday, January 28, 2013