పుత్తూరు, జనవరి 27: పుత్తూరు మండలంలోని శిరుగురాజుపాళెం వద్ద ఆదివారం వివేక్ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. ప్రయాణికులు, డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు బయట పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్యాకుమారి నుంచి డిబ్రిగాడ్‌కు వెళ్లే వివేక్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం 9.20 గంటలకు పుత్తూరు వైపు వెళుతుంది. పుత్తూరు స్టేషన్ దాటిన 5నిమిషాల్లో ఎయిర్‌బ్రేక్ సక్రమంగా పట్టకపోవడంతో జనరల్ బోగిలో చక్రాల వద్ద మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగి బోగి నుంచి దిగేశారు. దీంతో రైలు డ్రైవరు గమనించి అగ్నిమాపక యంత్రంతో మంటలు ఆర్పి వేశారు. రేణిగుంట రైల్వే స్టేషన్‌కు సమాచారం అందచేయటంతో ఇంజనీరింగ్ అధికారులు వచ్చి మరమ్మతులు చేసి వెళ్లారు. ఈ సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత రైలు ఆలస్యంగా వెళ్లడంతో పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
* చక్రాల వద్ద మంటలు * ఆందోళన చెందిన ప్రయాణికులు
english title:
c
Date:
Monday, January 28, 2013