మదనపల్లె, జనవరి 27: సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జెఎసి నాయకులు టివి రెడ్డి, మధుసూదన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆదివారం స్థానిక స్వామినాధన్ (మల్లికార్జున) సర్కిల్‌లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుజాతి ఒకే ప్రాంతానికి చెందినదని, తెలుగును విడదీసే హక్కు రాజ్యాంగంలో కూడా లేదన్నారు. నాడు ఆంద్రప్రదేశ్ చేసిన అనేక పోరాటలు, నాయకుల ఆత్మార్పణల ఫలితంగా ఏర్పాటైందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండటానికి మూలకారణం ప్రధానంగా హైదరాబాద్ అన్నారు. రాజధానిగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధికి అన్ని ప్రాంతాల కృషి ఉందన్నారు. అంతేకాకుండా రాష్ట్రం ముక్కలు చేస్తే రాయలసీమ చాలా వెనుకబడుతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలంగాణా ప్రజలు సైతం కోరుకుంటున్నారని, కేవలం తెలంగాణా ప్రాంతానికి చెందిన రాజకీయ దృష్టశక్తులు ఆందోళన సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం సమైక్యాంధ్రకు వ్యతిరేకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
సమైక్యాంధ్రకు
english title:
c
Date:
Monday, January 28, 2013