తిరుపతి, జనవరి 27: తిరుపతి కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ప్యానల్‌ను గెలిపిస్తే నీతివంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు తాను హామీ ఇస్తున్నానని స్థానిక ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్‌రెడ్డి బ్యాంకు ఖాతాదారులకు హామీ ఇచ్చారు. తిరుపతి కో- ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో పోటీ చేయనున్న వైఎస్‌ఆర్‌సిపి ప్యానల్‌తో కలిసి ఎమ్మెల్యే స్థానిక తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగమ్మకు బ్యాంక్ ఎన్నికల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా, దుష్టశక్తుల నుండి రక్షణగా నిలవాలని గంగమ్మను మొక్కుకున్నట్లు ప్యానల్ సభ్యులు తెలిపారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం తమ పార్టీ ప్యానల్‌ను గెలిపించాలని కోరుతూ పెద్దకాపువీధి, కాపువీధి, బండ్లవీధి, నెహ్రూవీధి, గాందీరోడ్డులలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పులుగోరు ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దింపుతున్నట్లు ఇప్పటికే ప్రకటించామన్నారు. డైరెక్టర్ల ప్యానల్‌లో కూడా 13 మందిని గెలిపించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం వున్న బ్యాంక్ పాలక మండలికన్నా ఎంతో సమర్థవంతంగా పరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నానన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బ్యాంకును నెంబర్‌వన్‌గా ఎదిగేలా పనిచేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్‌కెబాబు, చైర్మన్ అభ్యర్థి పులుగోరు ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్ అభ్యర్థులు దొడ్డారెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్నా, వౌలా, ఖాదర్‌బాషా, అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు బొడ్డు నాదమునిరెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, టి రాజేంద్ర, ఎంవిఎస్ మణి, ఆంజనేయులు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
* కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ప్యానల్‌ను గెలిపించండి * ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్‌రెడ్డి పిలుపు
english title:
c
Date:
Monday, January 28, 2013