పెనుమూరు, జనవరి 27: మండల కేంద్రమైన పెనుమూరులోని పెద్దకలికిరి పంచాయతీ పరిధిలోని కె.గొల్లపల్లెలో భూతగాదాపై ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. పెనుమూరు మండలం పెద్దకలికిరి పంచాయతీలోని కె.గొల్లపల్లెలో భూతగాదాపై ఆనందయ్య, రామచంద్రయ్య వర్గీయులు శనివారం రాత్రి రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఆనందయ్య వర్గీయులు, రామచంద్రయ్య వర్గీయులపై రాళ్లవర్షం కురిపించడంతో రామచంద్రయ్య వర్గీయుల్లో సుమారు 9మందికి తల, చేయి, కాళ్ల భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కె.గణేష్, రామచంద్రయ్య, ఎం.హరీష్, ఎం.రఘునాధయ్య, హరిప్రసాద్, రేణుక, కమలమ్మ, కృష్ణయ్య, నాగరాజమ్మలు తీవ్ర గాయాలపాలయ్యారు. అదే విధంగా ఆనందయ్య వర్గీయుల్లో గోవర్దన్, వెంకటేశ్, సుబ్రహ్మణ్యం, ఆనందన్, శ్రీనివాసులు, పద్మావతి, జమున, కృష్ణయ్యలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వీరిని 108అంబులెన్సు ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు శనివారం రాత్రి 10గంటల ప్రాంతంలో కె.గొల్లపల్లె గ్రామాన్ని సందర్శించి 147, 148, 324, 427, ఆర్/149 ఐపిసి సెక్షన్ ప్రకారం ఇరువర్గాలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనుమూరు ఎస్సై బి.కృష్ణయ్య తెలిపారు. దీంతో గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు పహారాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* 17మందికి తీవ్ర గాయాలు * గ్రామంలో పోలీసు పహారా
english title:
c
Date:
Monday, January 28, 2013