ఆదిలాబాద్, జనవరి 28: పట్ట్భద్రుల నియోజకవర్గం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల నియమావళి ప్రకారం జరుగుతాయని జిల్లా కలెక్టర్ అశోక్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో రాజకీయ పార్టీల నేతల సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. శాసన మండలిలోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి టీచర్, పట్ట్భద్రుల ఎన్నికల కొరకు 28న నామినేషన్ల ప్రక్రియ ప్రకటించబడిందని, నామినేషన్ల చివరి తేదీ ఫిబ్రవరి 4 వరకు వుందన్నారు. నామినేషన్ల పరిశీలన 5న, ఉప సంహరణ 7వ తేదీన, పోలింగ్ 21న జరుగుతుందన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపు జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జనవరి 23 నుండి ఎన్నికల నియమావళి ప్రారంభమైందని, టీచర్ల, పట్ట్భద్రుల ఎన్నికల కొరకు 65 పోలింగ్ కేంద్రాలు పట్ట్భద్రుల కొరకు 58 పోలింగ్ కేంద్రాలు టీచర్ల కొరకు ఏర్పాటు చేయబడినట్లు, ఇందులో 30488 పట్ట్భద్రుల ఓటర్లు, 4969 టీచర్ ఓటర్లు వున్నారన్నారు. ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు, ఎన్నికల నామినేషన్ల కొరకు కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకరిస్తారని, నామినేషన్ల డిపాజిట్ కొరకు జనరల్ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేల చొప్పున డిపాజిట్ చేయాలన్నారు.
పట్ట్భద్రుల నియోజకవర్గం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల నియమావళి ప్రకారం
english title:
graduates constituency
Date:
Tuesday, January 29, 2013