ఇచ్చోడ, జనవరి 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఈ నెల 28వ తేదీలోగా ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించి మాట మార్చడాన్ని నిరసిస్తూ సోమవారం ఇచ్చోడలో జాతీయ రహదారిపై తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించి తమ నిరసననువ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రకటనలపై ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని, సీమాంధ్ర నాయకులకు అమ్ముడుపోయినా యుపిఎ అధిష్టాన వర్గం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందని విమర్శించారు. వెంటనే తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఈ నెల 28వ తేదీలోగా ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి
english title:
ichoda
Date:
Tuesday, January 29, 2013