విభిన్న రంగుల్లో, వినూత్న డిజైన్లలో శరీరంపై ‘పచ్చబొట్లు’ వేయించుకోవడం ఆధునిక యువతలో వేలం వెర్రిగా మారడంతో చర్మ సంబంధ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘టాటూ సెంటర్ల’పై ఎలాంటి నిఘా లేనందున ప్రమాదకరమైన రసాయనాల వాడకం పెరిగిపోతోందని ఢిల్లీలోని బిఎల్‌కె ఆస్పత్రికి చెందిన ప్లాస్టిక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ డిజెఎస్ తులా అంటున్నారు. పచ్చబొట్లు వేసేందుకు వాడుతున్న ఇంకుల్లో కొన్ని రసాయనాల వల్ల క్యాన్సర్ సోకే అవకాశాలున్నాయ. నీలిరంగు ఇంకులో కోబాల్ట్, అల్యూమినియం, ఎరుపురంగు ఇంకులో మెర్యురిక్ సల్ఫైడ్, మరికొన్ని ఇంకుల్లో లెడ్, క్రోమియం, నికెల్, టైటానియం వంటి లోహాలు ప్రమాదకరమైనవని గుర్తించారు. పచ్చబొట్లు వేసే పనిముట్లను సరిగా శుభ్రం చేయనందున హెచ్‌ఐవి, హెపటైటిస్-బి, సి, చర్మసంబంధ క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. పచ్చబొట్లు వేయించుకున్న అందరికీ క్యాన్సర్ వస్తుందని భావించనక్కర్లేదని, అయితే- కొన్ని ఇంకుల వల్ల చర్మకణాలు, కండరాలు దెబ్బతింటాయని నిపుణులు తేల్చారు. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే నాసిరకం ఇంకులను నియంత్రించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
‘పచ్చబొట్లు’ వేయించుకోవడం ఆధునిక యువతలో వేలం వెర్రిగా మారడంతో చర్మ సంబంధ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
english title:
patcha
Date:
Wednesday, February 6, 2013