ముంబయి, ఫిబ్రవరి 6: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెనె్సక్స్ అయిదో రోజూ నష్టాలను చవిచూసింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్స్‌లో సెనె్సక్స్ 345 పాయింట్లు నష్టపోయింది. అయిదోరోజైన బుధవారం కూడా సెనె్సక్స్ 20.10 పాయింట్లు నష్టపోయి 0.10 శాతం క్షీణించి 19,639.72 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా సాగుతున్నప్పటికీ దేశీయంగా బ్లూచిప్ స్టాక్సయిన ఐసిఐసిఐ, ఎల్ అండ్ టి, హిందూస్తాన్ యూనీలివర్ తదితర కంపెనీలలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ కూడా 2.30 పాయింట్ల నష్టంతో 0.04 వాతం కోల్పోయి 5,959.20 వద్ద ముగిసింది. ఒక దశలో 5,990.90 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయంగా ఒడిదుడుకులతో మార్కెట్ సాగడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.సిమెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ వంటి కొన్ని కంపెనీల స్టాక్స్ మాత్రం మార్కెట్ మరీపతనం కాకుండా కాపాడగలిగాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 1.08 శాతం, ఎస్‌బిఐ 0.60 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.62 శాతం, ఎల్ అండ్ టి 1.23 శాతం, బిహెచ్‌ఇఎల్ 1.72 శాతం నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 0.17 శాతం కోల్పోయింది. అయితే ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, డిఎల్‌ఎఫ్, భారతీ ఎయిర్‌టెల్, జిందాల్ స్టీల్, సిమెంట్ కంపెనీలయిన అంబుజ సిమెంట్, అల్ట్రాటెక్, గ్రేసమ్ ఇండస్ట్రీస్, ఎసిసి, గుజరాత్ సిద్ధి, మద్రాస్ సిమెంట్ లాభపడి మార్కెట్ మరీ పతనం కాకుండా కాపాడాయి.\
విద్యుత్ భారం నుండి
స్టీల్ ప్లాంట్‌కు ఊరట లభించేనా?
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 6: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై విద్యుత్‌శాఖ మోపిన భారం అంతా ఇంతా కాదు. అదనంగా విద్యుత్‌ను వినియోగించుకున్నందుకు ఏకంగా 74 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు స్టీల్ ప్లాంట్ సన్నాహాలు ప్రారంభించింది. అసలు విషయానికి వస్తే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 247 మెగా వాట్ల సొంత విద్యుత్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన విద్యుత్‌ను ఆ పవర్ ప్లాంట్ నుంచే వినియోగించుకుంటున్నారు. ప్లాంట్ అవసరాలకు పోగా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే స్టీల్ ప్లాంట్ ట్రాన్స్‌కో విద్యుత్‌ను వినియోగించుకుంటోంది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా, అదనపు విద్యుత్ వినియోగించుకున్నారన్నది స్టీల్ ప్లాంట్‌పై ట్రాన్స్‌కో అభియోగం. అవసరానికి మించి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇస్తున్నా, ట్రాన్స్‌కో ఏమాత్రం మొహమాటం లేకుండా, స్లీల్ ప్లాంట్‌పై ఇంత భారాన్ని మోపడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు యూనిట్‌ను మూడు నుంచి, 3.50 రూపాయలకు సరఫరా చేసే ట్రాన్స్‌కో ఒక్కసారిగా యూనిట్ ధరను 12.30 రూపాయలకు పెంచడం వల్లనే ఇంత భారం పడిందన్నది స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ఆరోపణ. ఇదిలా ఉండగా స్టీల్ ప్లాంట్, ట్రాన్స్‌కోకు మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు స్టీల్ ప్లాంట్ ఐఎన్‌టియుసి నాయకులు తెలిపారు.