ముంబయి, ఫిబ్రవరి 6: రంజీ ట్రోఫీ చాంపియన్ ముంబయితో బుధవారం ప్రారంభమైన ఇరానీ కప్ క్రికెట్ మ్యాచ్ మొదటి రోజున రెస్ట్ఫా ఇండియా పట్టు సంపాదించింది. మురళీ విజయ్ సెంచరీతో రాణించడంతో, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 330 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకోగా, రెస్ట్ఫా ఇండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, విజయ్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 144 పరుగులు జోడించిన తర్వాత శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన ధావన్ 101 బంతుల్లో, 11 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. మనోజ్ తివారీ 37 పరుగులకు అవుట్‌కాగా, 206 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 116 పరుగులు చేసి అభిషేక్ నాయర్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అంబటి రాయుడు 51 పరుగులు సాధించి, రోహిత్ శర్మ బౌలింగ్‌లో వసీం జాఫర్‌కు దొరికిపోయాడు. వృద్ధిమాన్ సాహా (17) చివరి నిమిషాల్లో పెవిలియన్‌కు చేరాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సురేష్ రైనా (51), కెప్టెన్ హర్భజన్ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ముంబయి బౌలర్లలో అభిషేక్ నాయర్ రెండు వికెట్లు పడగొట్టగా, ధవళ్ కులకర్ణి, శార్దూల్ ఠాకూర్, రోహిత్ శర్మ తలా ఒక వికెట్ పంచుకున్నారు.
ఇలావుంటే, అనారోగ్యం కారణంగా రెస్ట్ఫా ఇండియా కెప్టెన్ వీరేందర్ సెవాగ్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దీనితో ఈ జట్టుకు హర్భజన్ సింగ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో, రెస్ట్ఫా ఇండియా కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకొని, మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని భజ్జీ ఆశిస్తున్నాడు.
సంక్షిప్తంగా స్కోర్లు
రెస్ట్ఫా ఇండియా తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 5 వికెట్లకు 330 (్ధవన్ 63, మురళీ విజయ్ 116, మనోజ్ తివారీ 37, అంబటి రాయుడు 51, సురేష్ రైనా నాటౌట్ 36, అభిషేక్ నాయర్ 2/49).
ముంబయితో ఇరానీ కప్ క్రికెట్ మ్యాచ్ తొలిరోజు ఆటలో రెస్ట్ఫా ఇండియా పట్టు
english title:
m
Date:
Thursday, February 7, 2013