చాల్డ్మింగ్ (ఆస్ట్రియా), ఫిబ్రవరి 6: అమెరికా స్టార్ స్కీయర్ లిండ్సే వాన్ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇక్కడ జరుగుతున్న ఆల్పైన్ స్కీయింగ్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మహిళల సూపర్-జి విభాగంలో పోటీపడిన వాన్ ప్రమాదానికి గురైంది. మెరుపు వేగంతో దూసుకెళుతూ, హఠాత్తుగా పట్టుతప్పడంతో ఆమె పల్టీలు కొట్టింది. అయితే, సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు స్కీయర్ల ప్రాణాల మీదకు తెస్తుందిగానీ, అదృష్టవశాత్తు వాన్ గాయాలతో బైటపడింది. కామె మోకాలికి తీవ్రగాయంకాగా, కాలి కండరాలు చిట్లిపోయాయి. ఎముకలు విరిగాయి. సహాయక సిబ్బంది ఆమెను ఆకాశ మార్గాన ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సీజన్ మొత్తం వాన్ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని అధికార వర్గాలు ప్రకటించాయి. వచ్చే ఏడాది జరిగిన సోచి వింటర్ ఒలింపిక్స్ నాటికి వాన్ పూర్తిగా కోలుకుంటుందని అమెరికా ఆశిస్తున్నది.
గాయాలతో బయటపడిన అమెరికా స్కీయర్ వాన్
english title:
t
Date:
Thursday, February 7, 2013