Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జగ్రెబ్ ఎటిపి టెన్నిస్ రెండో రౌండ్‌కు సోమ్‌దేవ్

$
0
0

జగ్రెబ్ (క్రొయేషియా), ఫిబ్రవరి 6: భారత ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఇక్కడ జరుగుతున్న జగ్రెబ్ ఎటిపి టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్ చేరాడు. జర్మనీకి చెందిన మైఖేల్ బెర్‌ను అతను మొదటి రౌండ్‌లో 0-6 తేడాతో ఓటమిపాలైన సోమ్‌దేవ్ రెండో సెట్‌ను 7-6 తేడాతో గెల్చుకొని, కీలకమైన మూడో రౌండ్‌లో 4-1 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దశలో కండరాలు బెణికిన కారణంగా బెర్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో, సోమ్‌దేవ్ రెండో రౌండ్‌లో స్థానం సంపాదించాడు. ఆటగాళ్ల హక్కులపై పోరాటానికి దిగిన సోమ్‌దేవ్ మరో 11 మందికి నేతృత్వం వహించి, అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ)తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. వీరంతా దక్షిణ కొరియాతో జరిగిన డేవిస్ కప్ ఆసియా/ఓషియానియా పోటీలను బహిష్కరించారు. ఆ పోటీల్లో భారత్ 1-4 తేడాతో ఓడింది.

భారత ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఇక్కడ జరుగుతున్న జగ్రెబ్ ఎటిపి టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో
english title: 
j

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles