Image may be NSFW.
Clik here to view.
Clik here to view.

కరాచీ, ఫిబ్రవరి 6: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని, ఆతర్వాత జైలు శిక్షను కూడా అనుభవించి విడుదలైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ తమపై విధించిన సస్పెన్షన్‌పై క్రీడాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించనున్నారు. వీరిద్దరితోపాటు మరో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌ను కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా క్రౌన్ కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. 2011లో నిషేధం వేటు పడిన తర్వాత వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా దాని నుంచి విముక్తి పొందలేకపోయారు. ఫలితంగా అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఒక న్యాయవాది ద్వారా లాంఛనాలు ప్రారంభించినట్టు సమాచారం.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని
english title:
kreeda
Date:
Thursday, February 7, 2013