రాజమండ్రి, ఫిబ్రవరి 8: గోదావరి ప్రధాన ప్రవాహం రోజు రోజుకూ దిగజారుతుండటంతో ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టా ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోదావరి డెల్టాలోని సుమారు 8లక్షల ఎకరాల ఆయకట్టు గట్టెక్కాలంటే 7వేల క్యూసెక్కుల నీటి సరఫరా జరగాలి. కనీసం 6500క్యూసెక్కుల నీటి సరఫరా జరిగినాగానీ ఏదో విధంగా తిప్పలుపడి రబీని గట్టెక్కించవచ్చు. కానీ శుక్రవారం నమోదయిన ప్రవాహం కేవలం 5వేల క్యూసెక్కులు మాత్రమే. 2009లో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడినపుడు కూడా గోదావరి ప్రధాన ప్రవాహం ఇంత దారుణంగా దిగజారలేదు. ఇదే రోజుల్లో అప్పట్లో 6500 క్యూసెక్కులు నమోదయ్యింది. కానీ ఇపుడు అంతకన్నా ఘోరంగా గోదావరి ప్రధాన ప్రవాహం తగ్గటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారయింది. గోదావరి ప్రధాన ప్రవాహంలో వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే నమోదవటం రబీ ఆయకట్టుకు పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రబీని గట్టెక్కించటం ఎలా అనే కోణంలో ఇరిగేషన్ నిపుణులు తలలు బద్ధలుకొట్టుకుంటున్నారు. అసలు నీరం టూ ఉంటే సక్రమంగా పంపిణీచేసేందుకు ఏమైనా చర్యలు తీసుకోవచ్చుగానీ, నీరే అందుబాటులో లేకపోతే ఏం చెయ్యగలమని సాగునీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. సీలేరు నుండి కొన్ని సార్లు 4400 క్యూసెక్కుల నీరు గోదావరి డెల్టాకు వస్తుంటే, కొన్ని సార్లు 2500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. దాంతో సాగునీటి సరఫరా వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి పెట్టారు.
శ్రీశైలంలో నేడు
శాసనసభ కమిటీ పర్యటన
శ్రీశైలం, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపక్ష కమిటీ శనివారం కర్నూలు జిల్లా శ్రీశైలం మండలంలో పర్యటించనుంది. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని కమిటీలో 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు ఉంటారు. కమిటీ సభ్యులు ఉదయం 9.30 గంటలకు శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని అనంతరం మండలంలోని చెంచుగూడేల్లో పర్యటిస్తారు. వారి స్థితిగతులు తెలుసుకుంటారు. గిరిజన సమాఖ్య లతో స్పీకర్ ముఖాముఖీ చేస్తారు.
రబీకి ముప్పు
english title:
g
Date:
Saturday, February 9, 2013