హైదరాబాద్, ఫిబ్రవరి 8: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12 ఎమ్మెల్యే కాలనీలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భవనాన్ని ప్రారంభించిన అనంతరం భవనాన్ని పూర్తిగా సందర్శించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఎసిపి డైరక్టర్ జనరల్ బి.ప్రసాదరావు మాట్లాడుతూ ఈ భవనాన్ని ఆధునాతన టెక్నాలజీని వినియోగించుకునేందుకు అనువుగా రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం మొజాంజాహి మార్కెట్‌లో ఉన్న ఎసిబి ప్రధాన కార్యాలయంలో ఉండే అన్ని విభాగాలను ఈ కొత్త భవనంలోకి మార్చి వేస్తున్నట్లు తెలిపారు. భవన ప్రారంభానికి విచ్చేసిన సిఎంకు శాఖాపరంగా ఉన్న కొన్ని సమస్యల గురించి వివరించినట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రసాదరావు వెల్లడించారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు సిఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎసిబి పనితీరును వివరించారు.
.......................
ఎసిబి ప్రధాన కార్యాలయం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు
అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం
english title:
acb
Date:
Saturday, February 9, 2013