కేప్ కనెవరాల్, ఫిబ్రవరి 8: సుమారు 150 అడుగుల వ్యాసం ఉండే భారీ గ్రహశకలం ఒకటి వచ్చేవారం భూమికి చాలా దగ్గరగా రానుంది. వాస్తవానికి అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న కమ్యూనికేషన్, వాతావరణ ఉపగ్రహాలతో పోలిస్తే ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగానే వస్తుంది. ఇంత భారీ సైజులో ఉండే ఓ వస్తువు భూమికి ఇంత దగ్గరగా దూసుకు రావడం ఇదే మొదటిసారని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. అయితే పెద్ద కొండరాయి సైజులో ఉండే ఈ గ్రహశకలం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదని, ఎందుకంటే వచ్చే శుక్రవారం నాడు ఇది భూమికి దగ్గరగా పోయినప్పుడు వాస్తవానికి కనీసం 17,100 మైళ్ల దూరంలో ఉంటుందని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఎంతమాత్రం లేదని కాలిఫోర్నియా రాష్ట్రంలోని పసడేనియాలో నాసాకు చెందిన పరిశోధనల ప్రోగ్రాం మేనేజర్ డొనాల్డ్ యోమాన్స్ చెప్పారు. అంతేకాదు, ఈ గ్రహశకలం, అంతరిక్షంలో పరిభ్రమించే ఉపగ్రహాలను తాకే ప్రమాదం కూడా దాదాపుగా లేదని ఆయనతో పాటు ఇతర శాస్తజ్ఞ్రులు అంటున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కొన్ని వందల ఉపగ్రహాలు భూమికి దాదా పు 22,300 మైళ్ల ఎత్తులో ఉండే కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. అయితే అత్యంత వేగంగా దూసుకు వెళ్లే ఈ గ్రహశకలం కదలికను గమనించే ఉద్దేశంతో దీని గురించి ఉపగ్రహాల ఆపరేటర్లను ముందుగానే హెచ్చరించడం జరిగింది.
‘ఎవరు కూడా ప్రమాదం ఎదురవుతుందని హెచ్చరించడం లేదు. అలాంటి అవకాశం కచ్చితంగా లేదని చెప్పే వాళ్లలో నేనూ ఒకడిని’ అని యోమాన్స్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.
ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేదని శాస్తజ్ఞ్రులు ఓ వైపు చెప్తూనే, ఒక వేళ ఢీకొట్టినట్లయితే దాని ప్రభావం వల్ల 24 లక్షల టన్నుల టిఎన్‌టిలకు సమానమైన శక్తి ఉత్పత్తి అవుతుందని, 750 చదరపు మైళ్ల ప్రాంతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తుందని అంటున్నారు. 1908లో సైబీరియాలో ఇంతకన్నా కాస్త తక్కువ శక్తి ఉన్న గ్రహశకలం ఒకటి భూమివైపు దూసుకు వస్తూ అయిదు మైళ్ల ఎత్తులో పేలిపోయినప్పుడు తుంగుస్కా నదికి చుట్టుపక్కల ఉండే అటవీ ప్రాంతమంతా నేలమట్టమై పోయింది. ఇంత సైజు ఉండే గ్రహశకలం భూమిని తాకే అవకాశం 1200 ఏళ్లకోసారి మాత్రమే ఉంటుంది. అయితే ఈ సైజు గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చి ఎలాంటి హానీ చేయకుండా వెళ్లిపోవడం మాత్రం ప్రతి నలభై ఏళ్లకోసారి జరుగుతూ ఉంటుంది.
ప్రమాదమేమీ లేదంటున్న శాస్తజ్ఞ్రులు
english title:
g
Date:
Saturday, February 9, 2013