హైదరాబాద్, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సమస్య, రాజకీయ అనిశ్చితి విషయంలో కాంగ్రెస్ ప్రథమ ముద్దాయి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపిం చారు. అందువల్ల ఆ పార్టీ విధానాలను బట్టబయలు చేయాలని అన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కెసిఆర్ వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా పాత్రికేయులు ప్రస్తావించగా, మొదటి నుండి అనుకున్నట్టుగానే కెసిఆర్ ఉద్యమం కంటే ఎన్నికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఉద్యమం ద్వారానే రాష్ట్రంలోని సంక్లిష్ట సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటే దానినే కొనసాగించేవారని అన్నారు. ఎన్నికల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే దాని ద్వారానే తేల్చుకోవాలని అన్నారు. వీటిపై టిఆర్‌ఎస్, టిజాక్ ప్రజలకు విషయాన్ని స్పష్టం చేయడం మంచిదని సూచించారు. ఎన్నికలను ఎపుడూ ఒకే అంశం ప్రభావితం చేయబోదని, కేంద్రం, ఇటు రాష్ట్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ధరలు, నిరుద్యోగం, డబ్బు తదితర అంశాలు కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేకాని నిర్దిష్టమైన సమస్యకు ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదని అన్నారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని రాఘవులు అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాకుండా ఒకే చోట వాటిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పర్యావరణ అనుమతులు రాకపోయినా, రైతులు వ్యతిరేకిస్తున్నా, సాగుభూములను కూడా స్వాధీనం చేసుకుని ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.ప్రైవేటు పెట్టుబడిదారుల ఒత్తిడి మేరకు భూముల్లో నుండి రైతులను తరిమేసి, ఆయా ప్రాంతాలను బూడిదకుప్పలతో ముంచెత్తబోతున్నారని విమర్శించారు.
ప్రజలపై భారం తగదు
ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దని విద్యార్థ్ధి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు వేరువేరుగా విన్నపాలు అందజేశాయి. ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, పివైఎల్ ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐఎఫ్‌డివైలు ఇచ్చిన వినతి పత్రాల్లో వి ద్యుత్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు చా ర్జీలు రద్దు చేయాలని సూచించాయ.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ధ్వజం
english title:
r
Date:
Saturday, February 9, 2013