బిల్ లాడెన్‌ను పట్టుకోవడానికి అనేక దేశాలపై ఒత్తిడి తేవడంతోపాటు అఫ్గాన్, పాకిస్తాన్లో అనేకమందిని అత్యంత దారుణంగా, హేయమైన పద్ధతుల్లో ‘విచారించిన’ మాట నిజమేనన్న విషయాన్ని అమెరికా రక్షణమంత్రిగా పదవీ బాధ్యతలు విరమించనున్న జాన్ పెనట్టా అంగీకరించారు. ‘డార్క్ జీరో థర్టీ’ సినిమా ప్రివ్యూ సందర్భంగా మాట్లాడిన పెనట్టా ఈ సినిమాలో చూపించినంతగా కాకపోయినా మొత్తంమీద లాడెన్ ఆచూకీ తెలుసుకునేందుకు అనేకమందిని చిత్రహింసలు పెట్టిన మాట వాస్తవమేనని అంగీకరించడం సంచలనాన్ని రేకెత్తించింది. అంతకుముందే మొత్తం 54 దేశాలపై పెత్తనం చెలాయిస్తూ వారిని తన దారికి తెచ్చుకునేందుకు అమెరికా పన్నిన కుయుక్తుల కథనాల నేపథ్యంలో ఈ వాస్తవాలు అగ్రరాజ్య ఆధిపత్య ధోరణికి అద్దం పడుతున్నాయి.
బిల్ లాడెన్‌ను పట్టుకోవడానికి అనేక దేశాలపై ఒత్తిడి
english title:
its true
Date:
Monday, February 11, 2013