నాముందు మోకరిల్లి
పైకి చేరాలనో
కిందికి పోవాలనో
ఎవరో ఒకరి
ఎదురుచూపులే
తయారై వచ్చాక
ఎవరికి వారు నమ్మకంతో
నాకు బందీలవుతారు
ఎలా కావాలంటే అలా చేరుస్తున్నా
ఎప్పుడో ఎక్కడో ఆగిపోయాక
సరిహద్దుల్లో ఉండని సహనం
ఎవరు నానుండి విడిపిస్తారో
ఎప్పుడు బయటపడతారో
ఎవరి ప్రయత్నాలు ఏపాటివో
బయటపడ్డాక
నిర్జీవమైన మొహాలు
నిర్లిప్తమైన గుంపులో కలిసిపోతాయి వెంటనే
విలువ తెలిసేదల్లా
ప్రాణం పోయాకనే
అందరి ప్రార్థనలూ అప్పుడు
వెంటనే జీవం లేచి రావాలనే.
నాముందు మోకరిల్లి పైకి చేరాలనో
english title:
lift
Date:
Sunday, February 10, 2013