సిరిసిల్ల, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికే హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలన్న చర్చను తెరపైకి తెచ్చారని బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్‌రావు ఆ రోపించారు. మంగళవారం సిరిసిల్ల లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవ రాజధాని అంశాన్ని కావాలని ప్రచార సాధనాలు ప్రచారం చేస్తున్నాయని, ఈ చర్యలను ప్రతిఘటించాలని విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలని జవహార్‌లాల్ నెహ్రూ మాట్లాడినట్టు చెబుతున్నది అబద్దమని, 1953లోనే విశాలాంధ్ర ఏర్పాటును వద్దని నెహ్రూ వ్యతిరేకించాడన్నారు. విశాలాంధ్ర కోరిక వెనుక విద్రోహ పూరిత సామ్రాజ్యతత్వం ఉందన్నారు. అందుకే ప్రత్యే క రాష్ట్రం కోరుతు న్న తెలంగాణ వాదులను అణచివేయాలని, ఈ ప్రాంతాన్ని కబలించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆనాడు భారత దేశమంతా త్రివర్ణ పతాకం ఎగురుతుండగా, నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వమే 1948 నవంబర్, 29న హైదరాబాదులో త్రివర్ణ పతాకం ఎగురకుండా ని జాం సర్కార్‌తో అగ్రిమెంటు చేసుకుందని, అలాంటిది రెండవ రాజధానిగా హైదరాబాదు చేయాలనడం అబద్దమన్నారు.
బోగస్ సంస్థలతో ఖజానా ఖాళీ
సామాన్య ప్రజలు జాతీయ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బం తా సీమాం ధ్ర పెట్టుబడిదారులు బోగస్ సంస్థల పేరుతో కొళ్ళగొట్టారని, దీనిపై ముఖ్య మంత్రి శే్వత పత్రం విడుదల చేయాలని విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేయలేమని చెబుతున్న సిఎం వ్యాఖ్యలు సరికావన్నారు. రుణాలను మాఫీ చేయవచ్చని, రుణాలు మాఫీ చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్న, చిన్నకారు రైతులకు, చేతి వృత్తుల వారిని ఆదుకోవాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికే హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలన్న చర్చను తెరపైకి
english title:
re
Date:
Wednesday, February 13, 2013