కరీంనగర్, ఫిబ్రవరి 12: ప్రమాదకర లక్షణాలున్న గర్భిణీలను (హైరిస్కు) ప్రాథమిక స్థాయిలో గుర్తించి క్రమంగా సరైన వైద్య సేవలందించి మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్లతో ‘మార్పు’ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా, శిశు మరణాల నివారణకు మార్పు చక్కని పథకమని అన్నారు. గ్రామాలలో గర్భిణులందరిని గుర్తించి పూర్తి స్థాయిలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి హైరిస్కుగా నిర్ధారణ అయిన వెంటనే డెలీవరి వరకు తగిన వైద్య సేవలందిస్తే మాతృ మరణాలుండవని తెలిపారు. మెడికల్ ఆఫీసర్లు ఎస్‌పిహెచ్‌ఓలు హైరిస్కు గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలని చెప్పారు. గర్భిణీల ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలిసికోవాలని తద్వారా వారిలో మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. జిల్లాలో 45,739 మంది గర్భిణీలు నమోదై ఉన్నారని, వారిలో హైరిస్కు కేసులు గుర్తించి ‘మాతా శిశు సంరక్షణ రికార్డు’ కార్డులో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో జరిగిన మాతృ మరణాల కేసులు పరిశీలిస్తే అన్ని హైరిస్కు కేసులని అన్నారు. రక్త హీనత, బిసి వంటి కేసులని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదని తెలిపారు. జిల్లాలోని అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులలో అమ్మలాలన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సహాయ కేంద్రాలలో హెల్త్ సూపర్‌వైజర్లను నియమించి 24 గంటలు ప్రసవానికి వచ్చు గర్భిణులకు అత్యవసర వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 నుండి ఈ సహాయ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేస్తాయని అన్నారు. గ్రామ స్థాయిలో జరుగు మార్పు సమావేశాలకు సంబంధించిన అధికారులు సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు. మార్పు సమావేశాలు ముగిసిన తరువాతనే హాజరు తీసుకొని హాజరుకాని వారి వివరాలు పంపించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విఓ సమావేశాలలోనే గర్భిణులకు, పిల్లలకు అదనపు పౌష్టికాహారం పంపిణీ చేయాలని సూచించారు. మార్పు పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి ప్రభుత్వం నుండి తమకు అందాల్సిన సంక్షేమ ఫలాలు డిమాండ్ చేసి పొందేలా చూడాలని అన్నా రు. మార్పు పథకంపై గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులకు ఈ నెల 19 నుండి రెండవ విడత శిక్షణ కార్యక్రమాలు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో నిర్భయ కమిటీలతో అవగాహన పెంపొందించనున్నారు.
ప్రమాదకర లక్షణాలున్న గర్భిణీలను (హైరిస్కు) ప్రాథమిక స్థాయిలో గుర్తించి క్రమంగా సరైన వైద్య
english title:
m
Date:
Wednesday, February 13, 2013