చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 13: పారిశ్రామిక వేత్తలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావాలని లేబర్ ఎంప్లాయిమెంట్, శిక్షణ ముఖ్య కార్యదర్శి జెపి శర్మలు అన్నారు. ఐటిఐ విద్యార్థులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా పలువురు పారిశ్రామిక వేత్తలతో జిల్లా కలెక్టర్ ఎస్‌ఎఎం రిజ్వీ, ఉపాధి శిక్షణశాఖ కమిషనర్ జయలక్ష్మీలతో కలిసి నాంపల్లిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ జనవరి నుండి మార్చి వరకు దాదాపు 900మంది విద్యార్థులకు రాజీవ్ యువకిరణాల పథకం లక్ష్యంగా ఉధ్యోగాలు కల్పించుటకు వివిధ పరిశ్రమలకు సంబంధించిన వృత్తి విద్యలో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నామని, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సినబాధ్యత పారిశ్రామిక వేత్తలపై ఉందన్నారు. శిక్షణ కాలంలో ఇచ్చిన శిక్షణతోపాటు ఉద్యోగంలో చేరిన తరువాత ఉద్యోగాన్ని బట్టికూడా అవసరం మేరకు శిక్షణ ఇప్పించాలని అన్నారు. యువతకు అధిక శాతం ఉపాధి కల్పించడమే తమ ఉద్దేశ్యమని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తల డిమాండ్ మేరకు వివిధ రకాల వృత్తులలో శిక్షణ ఇప్పిస్తున్నట్టు వివరించారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చినవారికి హాస్టల్ వసతి కల్పించి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. పారిశ్రామిక వేత్తలు మాట్లాడుతూ ఉద్యోగులు కన్సల్టెన్సీల ద్వారా రావడంవల్ల వారికి న్యాయంగా అందాల్సిన జీతంలో సగం మాత్రమే పొందగల్గుతున్నారని, ఈ విధానాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ రిజ్వీ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీ్ధర్, యువజన సంక్షేమ శాఖాధికారి సత్యనారాయణ రెడ్డి తదితరులు పలుకు తున్నారు.
పారిశ్రామిక వేత్తలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు రావాలని లేబర్ ఎంప్లాయిమెంట్,
english title:
u
Date:
Thursday, February 14, 2013