కర్నూలు, ఫిబ్రవరి 19: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్‌గా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి, ధార్మికవేత్త ఆదినారాయణరెడ్డి పేరు ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆలయ కమిటీ ఎంపికపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. శ్రీశైలం దేవస్థానం కమిటీలో చైర్మన్‌తో పాటు ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఒక ఎస్సీ, ఒక మహిళా సభ్యుల నియామకం చేయాల్సి ఉంటుంది. కమిటీ ఏర్పాటు పూర్తిగా ముఖ్యమంత్రి అధికార పరిధిలోది కావడంతో ఆలయ కమిటీ చైర్మన్‌గా పలువురు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో నెల్లూరు నగరానికి చెందిన ఆదినారాయణరెడ్డి పేరు ఖరారైనట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆలయ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం దేవస్థానం చైర్మన్‌గా ఉన్న ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు నియామకం సమయంలోనే ఆదినారాయణరెడ్డి పేరు ప్రతిపాదనలోకి వచ్చినా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అందరినీ ఒప్పించి కోటేశ్వరరావునే ఖరారు చేశారు. ప్రస్తుతం కోటేశ్వరరావు పదవీకాలం ముగియనుండడంతో కొత్త కమిటీ చైర్మన్‌గా ఆదినారాయణరెడ్డి పేరును పలువురు అధికార పార్టీ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికార పార్టీ మం త్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన పేరును ముఖ్యమంత్రికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఆలయ కమిటీలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగియడంతో వాటిని పరిశీలించి ఈ నెలాఖరులోపు కొత్త కమిటీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా శ్రీశైలం ఆలయ కమిటీలో ఈదఫా కర్నాటక రాష్ట్రం నుంచి ఒకరిని సభ్యుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. కన్నడిగులకు, శ్రీశైలం ఆలయానికి ఉన్న అనుబంధం దృష్ట్యా అక్కడివారిలో ఒకరిని కమిటీ సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. శ్రీశైలం ఆలయ కమిటీ చైర్మన్ పేరు ఖరారు చేసిన ముఖ్యమంత్రి మిగిలిన ఏడుగురు సభ్యుల ఎంపిక పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. సభ్యుల్లో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సిఫారసులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రైతుల మృతి
ఆదోని టౌన్, ఫిబ్రవరి 19: పంటలను మార్కెట్‌లో అమ్మి ఆటోలో స్వగ్రామానికెళ్తుండగా మృత్యువు రైతన్నలను కబళించింది. సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రైతులు మృతి చెందారు. ఆటోను జెసిబి ఢీకొనడంతో ఈ ప్రమాదంలో సూగూరుకు చెందిన నబీసాబ్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దస్తగిరి, రాముడు ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన మహిళా రైతు లక్ష్మమ్మ (60) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. లక్షమర్రికి చెందిన లక్ష్మన్నను సైతం కర్నూలుకు తరలించారు. వివరాలు.. మంత్రాల యం మండలం సూగూరు, లక్షమర్రి, సుంకేసుల గ్రామాలకు చెందిన రైతన్నలు తాము పండించిన పత్తి, వేరుశెనగను ఆదోని మార్కెట్‌యార్డులో సోమవారం విక్రయించి రాత్రి తిరిగి ఆటోలో గ్రామానికి వెళ్తుండగా పాం డవగల్లు - కుప్పగల్ మధ్య జెసిబి ఢీ కొంది. దీంతో ఆటో నుజ్జు నుజ్జయిం ది. ప్రమాదంలో నబీసాబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన సూగూరు గ్రామస్థులు దస్తగిరి, బో య రాముడు, సల్మాన్, లక్షమర్రికి చెందిన లక్ష్మన్న, లక్ష్మమ్మ, సుంకేసులకు చెందిన సురేష్‌ను 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందు తూ దస్తగిరి, రాముడు మృతి చెందా రు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్సై శంకరయ్య పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన జెసిబి ఆచూకికోసం గాలింపుచర్యలు చేపట్టామన్నారు.