Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రశాంతంగా ఇసుక రీచ్‌ల లక్కీ డ్రా

$
0
0

నెల్లూరు, ఫిబ్రవరి 20: నెల్లూరుజిల్లాలో నూతన ఇసుక విధానం-2012 ద్వారా రీచ్‌దార్ల ఎంపికకు నిర్వహించిన లక్కీడీప్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఈ ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళెం, గొల్లకందుకూరు, పొదలకూరు మండలం విరువూరు, మహ్మదాపురం, బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు, ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం, అనంతసాగరం మండలం పడమటికంభంపాడు, ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామాల వద్ద పెన్నానదిలో ఇసుక రీచ్‌లు నిర్వహించుకనేలా దరఖాస్తుల్ని ఆహ్వానించారు. ఇందులో అత్యధికంగా పొట్టేపాళెంకు 104 మంది ఔత్సాహికులు పోటీపడ్డారు. ఏడాదికాలంలో 38,726 క్యూబిక్ మీటర్ల రాశి ఇసుక తవ్వి, తరలించుకునే అవకాశం కలిగిన ఈ రీచ్‌ను 15,49,040 రూపాయలకు లక్ష్మీనరసింహ అండ్ కంపెనీ స్వాధీనపరచుకుంది. పొదలకూరు మండలం విరువూరు ఇసుక రీచ్‌కు 38 మంది దరఖాస్తుదారులు పోటీలో నిలిచారు. ఈ రీచ్‌లో 89,733 క్యూబిక్ మీటర్ల ఇసుకరాశిని పొందేందుకు 35,89,320రూపాయలతో ఎం శ్రీనివాసులురెడ్డి అనే ఔత్సాహికుడు అవకాశం కైవసం చేసుకున్నారు. అలాగే ఇదే మండలంలోని మహ్మదాపురం రీచ్‌కు 48మంది పోటీ పడ్డారు. ఈ రీచ్‌లో 29,847 క్యూబిక్ మీటర్ల ఇసుకరాశిని 11,93,880 రూపాయలకు సిహెచ్ పెంచలకుమార్ అనే దరఖాస్తుదారుడికి అదృష్టం కలిగింది. అలాగే మినగల్లు రీచ్ కోసం 64 మంది పోటీలో నిలిచారు. 67,602 క్యూబిక్ మీటర్ల ఇసుక రాశిని 27,04,080 రూపాయలకు ఎస్ పెంచలయ్య అనే ఔత్సాహికుడు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం రీచ్ కోసం 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ రీచ్‌లో 49,892 క్యూబిక్ మీటర్ల ఇసుకరాశిని 19,95,680 రూపాయలకు కోడూరు కమలాకర్‌రెడ్డి అనే రాజకీయ నాయకుడు పొందారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడు రీచ్ కోసం 69 మంది పోటీపడ్డారు. మొత్తం 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకరాశిని 16లక్షల రూపాయలకు బంకా రాంభూపాల్‌రెడ్డి కైవసం చేసుకున్నారు.
అదేవిధంగా అనంతసాగరం మండలం పడమటికంభంపాడు రీచ్ కోసం 35 మంది పోటీపడ్డారు. ఏభైవేల క్యూబిక్ మీటర్ల ఇసుకరాశిని ఇరవై లక్షల రూపాయలకు విరువూరు సుబ్బారెడ్డి అనే ఔత్సాహికుడు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు ఇసుకరీచ్‌కు 31 మంది పోటీపడ్డారు. 49,982 క్యూబిక్ మీటర్ల ఇసుక రాశిని 19,93,280 రూపాయలకు పివి శరత్‌కుమార్‌రెడ్డి అనే ఔత్సాహికుడు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జడ్పీ సిఇఓ టి వీరభద్రయ్య, డ్వామా పి.డి గౌతమి, నెల్లూరు ఆర్డీఓ మాధవీలత, భూగర్భజలశాఖ సహాయ సంచాలకులు రమేష్, మైన్స్ ఏడి వెంకటేశ్వర్లురెడ్డి, నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. రీచ్‌లు దక్కించుకున్న హక్కుదార్లకు రెండురోజుల్లోగా కన్ఫర్మేషన్ పత్రాలు అందజేయడంతో సహా, వారంరోజుల్లోగా ఇసుక తవ్వుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
సెమీస్‌కు చేరిన రైల్వే జట్టు
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 20: నెల్లూరు నగరంలోని విఆర్‌సి గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న 41వ సీనియర్ జాతీయ మహిళా ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో క్వార్టర్ సెమీ ఫైనల్స్‌కు చేరిన జట్లను అధికారికంగా వెల్లడించారు. అంతేగాక పూల్‌ఏలోని రన్నర్‌గా ఉన్న ఏపి జట్టుతో, పూల్ బిలో విన్నర్‌గా ఉన్న రైల్వే క్రీడాకారిణులతో క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. ఈ కీలక మ్యాచ్‌లో రైల్వే జట్టు చేతిలో ఏపి క్రీడాకారిణులు 35-10 భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. గురువారం ఉదయం నుంచి మిగిలిన క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. అందులో ఢిల్లీ, ఛత్తీస్‌ఘర్, హర్యానా మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తప్రదేశ్ క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలాఉంటే బుధవారం ఉదయం నిర్వహించిన పోటీల్లో హిమాచల్‌ప్రదేశ్ జట్టు పాండిచ్చేరిపై 11-0 పాయింట్లతో, ఛత్తీస్‌ఘర్ జట్టు రైల్వే జట్టుపై 11-16 పాయింట్లతో, మధ్యప్రదేశ్ జట్టుపై ఉత్తరాఖండ్ క్రీడాకారులు 5-6 పాయింట్లతో, పంజాబ్ జట్టు ఉత్తరప్రదేశ్ క్రీడాకారులపై 22-21 పాయింట్లతో, తమిళనాడు జట్టు బీహార్ క్రీడాకారులపై 16-10 పాయింట్లతో, కేరళ జట్టు జార్ఖండ్‌పై 30-08 పాయింట్లతో, జమ్మూ కాశ్మీర్‌తో అస్సామ్ జట్టు 14-15 పాయింట్లతో, ఛండీఘర్ జట్టుపై హర్యానా 9-16 పాయింట్లతో విజయం సాధించారు. అలాగే సాయంత్రం నిర్వహించిన పోటీల్లో హిమాచల్‌ప్రదేశ్‌పై అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడాకారిణులు 5-20 పాయింట్లతో, తమిళనాడు జట్టు జార్ఖండ్‌పై 20-15 పాయింట్లతో, ఉత్తరప్రదేశ్ జట్టుపై బీహార్ క్రీడాకారిణులు 13-4 పాయింట్లతేడాతో, జమ్మూకాశ్మీర్‌పై మహారాష్ట్ర క్రీడాకారిణులు 5-20 పాయింట్లతో, అస్సాం జట్టుపై రాజస్థాన్ జట్టు 4-11 పాయింట్ల తేడాతో విజయం సాధించారు.
బకాయిలు చెల్లించాలని చెరుకు రైతుల ఆందోళన
నాయుడుపేట, ఫిబ్రవరి 20: నాయుడుపేట మండలపరిధిలోని అయ్యప్పరెడ్డిపాలెం వద్దగల ఎంపి చక్కెర కర్మాగారం చెరుకు రైతుల బకాయిలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెరుకు రైతులు బుధవారం కర్మాగారం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా కర్మాగారానికి చెరుకు తోలుతున్నామని, ప్రతియేటా ఏదోఒక సాకుతో రైతులకు బకాయిలు పెడుతున్నారన్నారు. ఈ ఏడాది క్రషింగ్‌కు ముందు యాజమాన్యంతో జరిపిన చర్చలలో కర్మాగారానికి చెరుకు తోలిన 15 రోజులలోపు చెల్లింపులు జరుగుతాయని యాజమాన్యం వాగ్దానం చేసిందనికానీ జనవరి నెల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని వారు తెలిపారు.
రైతుల కోరిక మేరకు చెల్లింపులు జరుపుతాం : సీనియర్ విపి వెంకటేశన్
రైతులు కోరిన విదంగా చెల్లింపులు జరుపడానికి తమకు ఏవిధమైన అభ్యంతరం లేదని రైతులను ఇబ్బందులకు గురి చేయడం తమ అభిమతం కాదన్నారు. క్రషింగ్ సమయంలో ఉన్న చక్కెర రేటుకు, ఇప్పటికి సుమారు కిలోకు 3 రూపాయలు తగ్గిందని అందుచేత సరుకులన్నీ గిడ్డంగుల్లోనే ఉండిపోయాయని వారు తెలిపారు.
‘యానాది సమాఖ్యల ద్వారా రుణాలు మంజూరు’
సైదాపురం, ఫిబ్రవరి 20: సైదాపురం మండలంలోని యానాది సమాఖ్యల ద్వారా గిరిజన లబ్ధిదారులను ఏంపిక చేసి రుణాలు ఇవ్వనున్నట్లుజిల్లా గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండలంలోని కెజిఆర్ పాలెంలో సిఎల్‌డిపి ద్వారా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ కార్యక్రమంలో భాగంగా కెజిఆర్ పాలెంలోని సిఎల్‌డిపి భూములను పరిశీలించే అవకాశం ఉన్నందున తాము ఆ భూములను వేసుకొన్న పంటలను పరిశీలించామన్నారు. లబ్దిదారులతో ఆయన చర్చించి యానాది సమాఖ్యల ద్వారా రుణాలు పొందాలన్నారు. ఎంపిక చేసిన వారికి ట్రాక్టర్లు, డైరీలు మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట ఐటిడిఎ ఎపిఎం ఐడిటి డిపిలు చంద్రశేఖరయ్యలు పాల్గొన్నారు.
ఆరుగురు సిఐలకు పదోన్నతి
నెల్లూరు అర్బన్, ఫిబ్రవరి 20 : జిల్లాలోని వివిధ సర్కిళ్లలో ఇన్స్‌పెక్టర్లుగా పనిచేస్తున్న ఆరుగురు సిఐలకు డిఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజి రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్పెషల్ బ్రాంచి సిఐ డిఎస్ రాంబాబు, నార్తు ట్రాఫిక్ సిఐ రమేష్‌రెడ్డి, కృష్ణ కిషోర్‌రెడ్డి, ఖాసీంబేగ్, రమేష్‌బాబు, టివి సుబ్బారెడ్డి పదోన్నతి పొందారు. ఆరుగురు సిఐలు వెంటనే సంబంధిత గుంటూరు రేంజ్‌లో రిపోర్టు చేయాలని ఐజి ఆదేశించారు.
అట్టహాసంగా ప్రారంభమైన జనదీవెన యాత్ర
పెళ్లకూరు, ఫిబ్రవరి 20: తిరుపతి మాజీ ఎంపి, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం నియొజకవర్గంలో చేపట్టిన జనదీవెన యాత్రను మండలపరిధిలోని చావాలి గ్రామంలో బుధవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో వెంకటేశ్వరస్వామి మందిరం వద్ద పూజలు చేసి ప్రారంభించగా మహిళలు ఆయనకు హారతలు ఇచ్చి నీరాజనాలు పలికారు. నెలవల మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ మరణం తరువాత ప్రజలు దుర్భిక్ష పరిస్థితలు ఎదుర్కొంటున్నారన్నారు.
500 మంది పార్టీలో చేరిక
జనదీవెన సందర్భంగా మాజీ సర్పంచ్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో చావాలి పంచాయతీతో 500 మంది వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వేణంబాక విజయశేఖర్‌రెడ్డి, నాయకులు కె రంగయ్య, రవినాయుడు, పురుషోత్తంనాయుడు, నారాయణలతోపాటు పార్టీలో చేరినవారిలో వెంకటేశ్వర్లు, వెంకటయ్య, చిరంజీవి తదితర 500 మంది పాల్గొన్నారు.
జనదీవెన ద్వారా జన ప్రభంజనం : రామిరెడ్డి
కావలి, ఫిబ్రవరి 20: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బుధవారం తన అనుచరులతో కలిసి జనదీవెన పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేకువ జామునే కళుగోళ శాంభవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక జెండాచెట్టు వద్ద గల దర్గాలో ప్రార్థనలు చేశారు. అక్కడే గల దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని నందెమ్మపురంలో జనజీవన యాత్రను ప్రారంభించారు. జనదీవెన యాత్ర జన ప్రభంజనం అవుతుందన్నారు.
బరిలోనిలిచేది నేనే
పార్టీ తరపున తానే శాసనసభ్యత్వానికి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు చెబుతూ తనను ఆశీర్వదించాలని కోరారు. తనపై నమ్మకం వుంచి తమ పార్టీ విధానాలను తెలుసుకొని మద్దతు ఇవ్వాలని జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే తిరిగి దివంగత వైఎస్‌ఆర్ స్వర్ణయుగం వస్తుందని చెప్పారు. ఈకార్యక్రమంలో గ్రామ నాయకులతో పాటు మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి, పాలడుగు వెంకటరావు, అల్లూరు మండల కన్వీనర్ దండ కృష్ణారెడ్డి, బోగోలు కన్వీనర్ తూపిలి పెంచలయ్య, దగదర్తి మండల కన్వీనర్ గోగుల పెంచలయ్య, కె ప్రభాకర్‌రెడ్డి, వాకా శ్రీనివాసులురెడ్డి, హరిరెడ్డి, బీదా రమేష్, సుకుమార్‌రెడ్డి, గున్నం రెడ్డి హరికిషోర్‌రెడ్డి, చిలకపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
‘బెల్టుషాపు తొలగించకుంటే రోడ్డు దిగ్బంధం’
నాయుడుపేట, ఫిబ్రవరి 20: నాయుడుపేట మండలపరిధిలోని అన్నమేడు గ్రామంలో ఉన్న బెల్టుషాపుల కారణంగా తమ జీవితాలు దుర్భరంగా మారాయని, ఈ బెల్టుషాపులను వెంటనే తొలగించాలని, లేకుంటే రహదారి దిగ్బంధిస్తామని అన్నమేడు గ్రామ మహిళలు హెచ్చరించారు. బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యలయంలో ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమేడు గ్రామానికి ప్రతిరోజు తెల్లవారుఝామున ఆటోలలో మద్యాన్ని అక్రమంగా తలిస్తున్నారని వారు తెలిపారు. మద్యం అక్రమంగా యేరులై పారుతుండడంతో ఈ నెలలో ఇద్దరు యువకులు మరణించారని, దీని కారణంగా వారి కుటుంభాలు రోడ్డునపడ్డాయన్నారు. బెల్టుషాపులు ఎత్తివేయకుంటే ఎక్సైజ్ కార్యాలయం వద్దే పురుగుమందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడతామని వారు హెచ్చరించారు.
సమ్మె ప్రభావం పాక్షికం

ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వివిధ పెట్టుబడిదారీ విధానాలను నిరసిస్తూ వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలు తలపెట్టిన రెండురోజుల సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా ప్రారంభమైంది. బుధవారం తొలిరోజున స్థానికంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, బ్యాంక్‌ల లావాదేవీలు, మీ సేవా సర్వీసులు స్థంభించిపోయాయి. అలాగే విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఐదు జాతీయ కార్మిక సంఘాల మద్దతుతో జరుపుతోన్న ఈ సమ్మెతోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఉద్యోగుల, కార్మికుల డిమాండ్‌లను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలు, నిరసన సభల్లో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అలాగే విద్యుత్ చార్జీలను తగ్గించాలని, సర్ చార్జీలను ప్రభుత్వమే భరించాలన్నారు. అన్ని వస్తువుల ధరలు తగ్గించి కార్మికులకు 10 వేల రూపాయలు వేతనాన్ని చెల్లించాలన్నారు.
వికలాంగులను ఆర్థికంగా ఆదుకోవాలి
*సబ్‌కలెక్టర్ నివాస్ పిలుపు
చిల్లకూరు, ఫిబ్రవరి 20: వికలాంగులను ఆర్థికంగా ఆదుకోవాలని సబ్‌కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. బుధవారం మండల కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులునేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి 79వ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎంపిపి దువ్వూరు మదుసూధన్‌రెడ్డి మండలంలో ఉన్న వికలాంగులను గుర్తించి వారికి పండ్లు, బట్టలను పంపిణీ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.
సరస్వతి నిధికి లక్ష రూపాయల వితరణ
జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్ పేద విద్యార్థుల ఉన్నత చదువుకోసం ప్రవేశపెట్టిన సరస్వతి నిధికి మాజీ ఎంపిపి దువ్వూరు మదుసూధన్‌రెడ్డి తన సహచరుల సహకారంతో 50 వేల రూపాయలు, జిల్లా ఎస్పీ నూతనంగా ప్రవేశపెట్టిన క్రాష్ కార్యక్రమానికి 50 వేల రూపాయలను గూడూరు సబ్‌కలెక్టర్, డిఎస్పీ హనుమంతరావు అందజేశారు. అదేవిధంగా తిక్కవరం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మేకల వౌనిక ఇటీవల పాఠశాల ఆవరణలో చెట్టుకొమ్మ పైన పడడంతో మానసికంగా అనారోగ్యం పాలైంది. ఆమె ఆరోగ్య చికిత్స నిమిత్తం 10 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఉమాదేవి, ఎంపిడివో చిరంజీవి, ఇవోపిఆర్‌డి నాగార్జున్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కాకాణి ప్రజాదీవెనకు
అనూహ్య స్పందన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 20: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధనరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో ప్రారంభించిన ప్రజాదీవెన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం అంతటా సుదీర్ఘంగా, గడపగడపకు వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని రోజుల తరబడి చేపట్టనున్నారు. బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జిల్లా నలుమూల నుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా బాణాసంచా హోరెత్తింది. అభిమానులు పూలవర్షం కురిపించారు.

నెల్లూరుజిల్లాలో నూతన ఇసుక విధానం-2012 ద్వారా రీచ్‌దార్ల ఎంపికకు నిర్వహించిన లక్కీడీప్ ప్రక్రియ
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>